ICD-10
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేత అమోదించబడిన అంతర్జాతీయ వ్యాధులు మరియు ఇతర సంబంధ ఆరోగ్య సమస్యల వర్గీకరణ, 10వ పరిశీలన (ICD-10). ఇవి వ్యాధులు, వ్యాధి లక్షణాలు, సాంఘిక పరిస్థితులు, బాహ్య కారణాలు తదితరమైన కోడ్లు. ICD-10 కోడ్ల పట్టిక దిగువ పేర్కొనబడినది. పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్‌లో చూడవచ్చును.
| అధ్యాయము | విభాగాలు | పేరు |
|---|---|---|
| I | A00-B99 | అంటువ్యాధులు మరియు పరాన్నజీవులకు సంబంధించిన వ్యాధులు. |
| II | C00-D48 | నియోప్లాజమ్స్ |
| III | D50-D89 | రక్తము మరియు ఇతర సంబంధ అవయవాల వ్యాధులు మరియు రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు. |
| IV | E00-E90 | వినాళగ్రంధులు, పోషకాహార మరియు జీవక్రియ సంబంధిత వ్యాధులు. |
| V | F00-F99 | మానసిక మరియు ప్రవర్తన రుగ్మతలు. |
| VI | G00-G99 | నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు. |
| VII | H00-H59 | కంటి జబ్బులు మరియు అనుబంధ అవయవాల వ్యాధులు. |
| VIII | H60-H95 | చెవి సంబంధ వ్యాధులు. |
| IX | I00-I99 | రక్తప్రసరణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు. |
| X | J00-J99 | శ్వాస సంబంధ వ్యాధులు. |
| XI | K00-K93 | జీర్ణవ్యవస్థకు చెందిన వ్యాధులు. |
| XII | L00-L99 | చర్మవ్యాధులు. |
| XIII | M00-M99 | కండరాలు, ఎముకలు మరియు ఇతర ఆధార కణజాల వ్యాధులు. |
| XIV | N00-N99 | మూత్ర మరియు జననేంద్రియ సంబంధ వ్యాధులు. |
| XV | O00-O99 | గర్భం, శిశుజననం ముందు మరియు తరువాత వచ్చే వ్యాధులు. |
| XVI | P00-P96 | జన్మసంబంధమైన చిన్నపిల్లల వ్యాధులు. |
| XVII | Q00-Q99 | వంశపారంపరిక అవలక్షణాలు మరియు జన్యు సంబంధ వ్యాధులు. |
| XVIII | R00-R99 | వ్యాధి లక్షణాలు, ప్రయోగశాల పరిశీలనలు ఇతరత్రా వర్గీకరించబడనివి. |
| XIX | S00-T98 | దెబ్బలు, విష ప్రభావాలు మరియు తదితర బాహ్య కారణాల వల్ల కలిగే వ్యాధులు. |
| XX | V01-Y98 | రుగ్మత మరియు మరణాలకు (morbidity and mortality) బయటి కారణాలు |
| XXI | Z00-Z99 | ఆరోగ్య స్థితిని, ఆరోగ్య సేవలతో సంబంధాలను ప్రభావితం చేసే విషయాలు |
| XXII | U00-U99 | ప్రత్యేక విధులకై సంకేతాలు. |
ఇవికూడా చూడండి
- ICD10 -- ICD-10 కోడ్‌ల వివరాలకై వివిధ లింకులు
- ఆంకాలజీకి సంబంధించిన వ్యాధుల అంతర్జాతీయ వర్గీకరణ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.