1948
1948 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1945 1946 1947 - 1948 - 1949 1950 1951 |
| దశాబ్దాలు: | 1920లు 1930లు 1940లు 1950లు 1960లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది.
- మే 14: ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఏర్పడింది.
- జూన్ 21: స్వతంత్ర భారత తొలి భారతీయ గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి రాజగోపాలాచారి బాధ్యతలు చేపట్టినాడు.
- జూలై 29: 14వ వేసవి ఒలింపిక్ క్రీడలు లండన్‌లో ప్రారంభమయ్యాయి.
- సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవం.
- డిసెంబరు 18: జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.
జననాలు
- జనవరి 1: షేక్ బడేసాహెబ్ తెలుగు రచయిత.
- జనవరి 3: ఐతా చంద్రయ్య: తెలంగాణా ప్రాంతానికి చెందిన కవి,రచయిత.
- ఫిబ్రవరి 24: జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రిణి.
- ఫిబ్రవరి 25: డానీ డెంజోంగ్ప, సుప్రసిద్ధ భారతీయ చలనచిత్ర నటుడు.
- మే 22: నాగం జనార్ధన్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు
- జూన్ 16: ఉత్పల హనుమంతరావు, కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ నుండి భారత రాజ్యసభకు ప్రాతినిథ్యము వహిస్తున్నాడు
- జూన్ 30: తమ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు.ఆయన ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి కుమారుడు.
- జూలై 6: ఛాయరాజ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా యున్నారు. (మ.2013)
- జూలై 27: ఎం. వి. ఎస్. హరనాథ రావు, ప్రముఖ నాటక రచయిత, సినీ మాటల రచయిత, మరియు నటుడు. (మ.2017)
- ఆగష్టు 3: వాణిశ్రీ, తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ సినినటి.
- ఆగష్టు 4: శత్రుచర్ల విజయరామరాజు, విజయనగరం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి, పార్లమెంటుకు పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.
- సెప్టెంబర్ 22: మల్లాది గోపాలకృష్ణ, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, రూపశిల్పి మరియు నటశిక్షణ అధ్యాపకులు.
- సెప్టెంబర్ 25: రేమెళ్ళ అవధానులు, తెలుగు శాస్త్రవేత్త.
- సెప్టెంబర్ 25: భూపతిరాజు సోమరాజు, ప్రసిద్ధిచెందిన గుండె వ్యాధి నిపుణుడు, కేర్ హాస్పిటల్ హెడ్ మరియు ఛైర్మన్.
- అక్టోబరు 12: ప్రొతిమా బేడి, ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి. (మ.1998)
- అక్టోబరు 16: రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ప్రముఖ రచయిత, విమర్శకులు. 2014 సంవవత్సరానికి వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది.
- నవంబరు 9: గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ పేరొందిన సంగీత విద్వాంసులు.
- నవంబరు 30: కె. ఆర్. విజయ, భారతీయ సినిమా నటి.
- డిసెంబర్ 11: రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (మ.2008)
- డిసెంబర్ 30: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు సురీందర్ అమర్నాథ్.
మరణాలు

మహాత్మాగాంధీ
- జనవరి 30: మహాత్మా గాంధీ, భారత జాతి పిత. (జ.1869)
- ఏప్రిల్ 4: రాజా నర్సాగౌడ్, సంఘసేవకుడు, మహాదాత. (జ.1866)
- జూన్ 18: హరిలాల్ గాంధీ, మహాత్మాగాంధీ ప్రథమ పుత్రుడు. (జ.1888)
- ఆగష్టు 9: యల్లాప్రగడ సుబ్బారావు, భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు. (జ.1895)
- ఆగష్టు 22: షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (జ.1920)
పురస్కారాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.