హోల్మియం

Holmium,  67Ho
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/ˈhlmiəm/ (HOHL-mee-əm)
కనిపించే తీరుsilvery white
ప్రామాణిక అణు భారం (Ar, standard)164.93033(2)[1]
ఆవర్తన పట్టికలో Holmium


Ho

Es
dysprosiumholmiumerbium
పరమాణు సంఖ్య (Z)67
గ్రూపుn/a
పీరియడ్పీరియడ్ 6
బ్లాకుf-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Xe] 4f11 6s2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 29, 8, 2
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం1734 K (1461 °C, 2662 °F)
మరుగు స్థానం2873 K (2600 °C, 4712 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)8.79 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు8.34 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
17.0 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
251 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ27.15 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1432 1584 (1775) (2040) (2410) (2964)
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు3, 2, 1 (a basic oxide)
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.23
అయనీకరణ శక్తులు
  • 1st: 581.0 kJ/mol
  • 2nd: 1140 kJ/mol
  • 3rd: 2204 kJ/mol
పరమాణు వ్యాసార్థంempirical: 176 pm
సమయోజనీయ వ్యాసార్థం192±7 pm
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణం హెక్సాగోనల్ క్లోజ్-పాక్‌డ్ (hcp)
Speed of sound thin rod2760 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచంpoly: 11.2 µm/(m·K) (at r.t.)
ఉష్ణ వాహకత16.2 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధంpoly: 814 nΩ·m (at r.t.)
అయస్కాంత క్రమంparamagnetic
యంగ్ గుణకం64.8 GPa
షేర్ గుణకం26.3 GPa
బల్క్ గుణకం40.2 GPa
పాయిసన్ నిష్పత్తి0.231
వికర్స్ కఠినత్వం481 MPa
బ్రినెల్ కఠినత్వం746 MPa
CAS సంఖ్య7440-60-0
చరిత్ర
ఆవిష్కరణMarc Delafontaine (1878)
holmium ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
163Ho syn 4570 y ε 0.003 163Dy
164Ho syn 29 min ε 0.987 164Dy
165Ho 100% (α) 0.1394 161Tb
166Ho syn 26.763 h β 1.855 166Er
167Ho syn 3.1 h β 1.007 167Er
Decay modes in parentheses are predicted, but have not yet been observed

పేరు, ఉచ్చారణ

ఈ రసాయన మూలకానికి స్వీడన్ దేశపు ముఖ్యపట్టణం అయిన స్టాక్‌హోమ్‌ (Stockholm) పేరు పెట్టేరు. స్టాక్‌హోమ్‌ (Stockholm) లో L ఉచ్చరించము; అలాగే Holmium లో L అనుచ్చరితం. కనుక ఈ మూలకాన్ని తెలుగులో "హోమియం" అని పలకాలి. కాని హోల్మియం అన్నా పరవాలేదు. (Holmium is pronounced as HOHL-mee-em.)

లభ్యత

ఈ మూలకం మోనజైట్, గేడొలినైట్ అనే ఖనిజాలలో దొరుకుతుంది. కేరళ్ లో ఉన్న సముద్ర తీరపు ఇసకలో ఈ మోనజైట్ సమృద్ధిగా దొరుకుతోంది.

ఆవర్తన పట్టిక (పీరియాడిక్ టేబుల్‌) లో హోమియం స్థానం 6 వ గుంపు (నిరుస) లో లేంథనైడ్ వరుసలో వచ్చే విరళ మృత్తిక మూలకాల ("రేర్‌ ఎర్త్" జాతి) కోవలో కనిపిస్తుంది. ఈ మూలకం అణు సంఖ్య 67. అణు భారం 164.930. రసాయన హ్రస్వ నామం: Ho. విరళ మృత్తిక మూలకాలు అన్నీ అరుదు కావు కానీ, ఈ మూలకం మాత్రం అరుదే. దీని అణు సంఖ్య బేసి సంఖ్య కావడం వల్ల ఆడో-హార్కింస్ (Oddo-Harkins) నియమానుసారం దీని లభ్యత సరి సంఖ్య అణు సంఖ్యగా ఉన్న మూలకాలతో పోల్చి చూస్తే దీని లభ్యత అరుదే. అయినా సరే మిగిలిన విరళ మృత్తిక మూలకాలతో పోల్చి చూస్తే ఈ మూలకం చవగ్గానే దొరుకుతోంది. సా. శ. 2016 లో దీని వెల కిలోగ్రాముకి సుమారు 1000 అమెరికా డాలర్లు.

ఉపయోగాలు

ప్రస్తుతం ఈ మూలకానికి ఎక్కువ ఉపయోగాలు కనిపించడం లేదు. తక్కువ ఉష్ణోగ్రత దగ్గర హోల్మియం స్పుటంగా అయస్కాంత లక్షణాలు ప్రదశిస్తుంది కనుక ఎక్కువ పటిమ గల ప్రత్యేకమైన అయస్కాంతపు కడ్డీల తయారీలో ఇది ఉపయోగపడుతోంది. వైద్య పరికరాలలో వాడే లేసర్లు తయారీలో కూడా దీనికి ఒక ప్రత్యేకమైన ఉపయోగం ఉంది. ఈ లేసర్లు ఉరమరగా 2 మైక్రోమీటర్లు ( 2 x 10−6 మీటర్లు ) పొడుగున్న కాంతి తరంగాలని పుట్టిస్తాయి. శరీరంలో ఉన్న కణజాలంలో ఉన్న నీళ్లు ఈ తరంగాలని సమర్ధవంతంగా పీల్చుకుంటాయి. అందుకని ఈ రకం లేసరుతో కోసినప్పుడు కోత, చిరుగులు లేకుండా, సీదాగా వస్తుంది. అంతే కాకుండా శస్త్రం చేస్తూన్నప్పుడు తెగిన రక్తనాళాలు వాటంతట అవి మూసుకుపోతాయి (self-cauterizing) కనుక రక్త స్రావం జరిగిపోదు.

బోరాన్ లాగే హోల్మియం కూడా నూట్రానులని సమర్ధవంతంగా పీల్చుకుంటుంది కనుక అణువిచ్ఛిత్తి జరిగే సందర్భాలలో దీనిని moderator గా ఉపయోగిస్తారు.

మూలాలు

  1. Meija, J.; et al. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305.
  • Guide to the Elements – Revised Edition, Albert Stwertka, (Oxford University Press; 1998) ISBN 0-19-508083-1
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.