హైదరాబాద్ రాజ్యం

ఒకప్పటి భారత సామ్రాజ్యంలో నిజాముల ఆధ్వర్యంలో ఉన్న అతిపెద్ద రాచరిక రాష్ట్రం హైదరాబాద్ మరియు బేరార్. మహారాష్ట్ర లోని ప్రస్తుత విదర్భ యొక్క ప్రాంతం ఈ బేరార్, ఇది 1903 లో సెంట్రల్ ప్రావిన్సెస్ లతో విలీనం చేయబడి, సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు బేరార్ గా రూపొందింది. దక్షిణమధ్య భారత ఉపఖండంలో ఉన్న ఈ హైదరాబాద్ రాష్ట్రం 1724 నుండి 1948 వరకు వారసత్వ నైజాముల పాలనలో ఉండేది. 1947 లో భారతదేశం యొక్క విభజన సమయంలో హైదరాబాద్ నిజాం, కొత్తగా ఏర్పడిన భారతదేశంలో గాని లేదా పాకిస్తాన్లో గాని చేరనని తన ఉద్దేశాన్ని ప్రకటించారు.

  • حیدرآباد ریاست
  • హైదరాబాద్ స్టేట్
  • دولت حیدرآباد
  • हैद्राबाद स्टेट
  • ಹೈದರಾಬಾದ್ ಸ್ಟೇಟ್

State of Hyderabad
మొఘల్ సామ్రాజ్య ప్రావిన్స్ 1724–1798

బ్రిటిష్ భారతదేశం యొక్క రాజరిక రాజ్యం 1798–1947
గుర్తించబడని రాష్ట్రం 1947–1948


 

1724  1948
Flag Coat of arms
Location of హైదరాబాద్
హైదరాబాద్ (ముదురు ఆకుపచ్చ) మరియు బేరార్ (హైదరాబాద్ భాగం కాదు కానీ 1853 మరియు 1903 మధ్య నిజాం అధినివేశంలో ఉండేది) లేత ఆకుపచ్చ.
రాజధాని ఔరంగాబాద్ (1724-1763)
(ప్రస్తుతం భారతదేశంలోని మహారాష్ట్రలో)
హైదరాబాద్ (1763-1948)
(ప్రస్తుతం భారతదేశంలోని telangana లో)
భాష(లు) ఉర్దూ, తెలుగు, పెర్షియన్, మరాఠీ, కన్నడ
మతము హిందూ మరియు ఇస్లాంమతం
Government Principality (1724–1948)

Province of the Dominion of India (1948–1950)
State of the Republic of India (1950-1956)

నిజాం
 - 1720–48 కమ్రుద్దీన్ ఖాన్ (మొదటి)
 - 1911–48 ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ జాహ్ VII (ఆఖరి)
ప్రధాన మంత్రి
 - 1724–1730 ఇవజ్ ఖాన్ (మొదటి)
 - 1947–1948

ఐక్య భారత్ వంశమైన తరువాత 1948–1956

హైదరాబాద్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రులు ఎం.కె.వెల్లోడి 1948–1952 బూర్గుల రామకృష్ణారావు 1952–1956

మీర్ లాయిక్ అలీ (ఆఖరి)
Historical era ముఘల్ సామ్రాజ్యం (1724-1798)

బ్రిటిష్ ఇండియా (1798-1947)
గుర్తింపులేని రాష్ట్రం (1947-1948)
ఇండియన్ యూనియన్ (1948-1950)
భారతరిపబ్లిక్ (1950-1956)
Dividing between Andhra Pradesh
Merging Telanagana part of Hyderabad State with Andhra State
Mysore and Bombay States.

 - ఆవిర్భావం 1724
 - తెలంగాణా విమోచనోద్యమము 1946
 - ఆపరేషన్ పోలో 18 సెప్టెంబరు
 - విభజన 1 నవంబరు 1956
Area 2,15,339 km² (83,143 sq mi)
Currency హైదరాబాదీ రూపీ

ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రంగా (హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం) మరియు మహారాష్ట్ర యొక్క మరాఠ్వాడ ప్రాంతంగా విభజించబడింది.

బ్రిటీష్ పాలనలో

హైదరాబాద్‌లో చార్మినార్ వీధి, 1890

1801 నాటికి నైజాం ప్రాంతం మధ్య దక్కన్ కలిగి చుట్టూ బ్రిటీష్ ఇండియాతో భూభాగంతో బంధింపబడి, బ్రిటీష్ అధికారం క్రింద ఉండే ప్రిన్స్‌లీ స్టేట్‌ స్థితిలో ఉండేది. ఐతే అంతకు 150 ఏళ్ళనాడు విస్తారమైన బంగాళాఖాతపు కోస్తాతీరాన్ని కలిగివుండేది. రాజ్యాంతర్భాగాల్లో కొంత ప్రాంతం నేరుగా నిజాం అధికారంలో ఉండగా, కొంత ప్రాంతాన్ని నిజాం సామంతులైన సంస్థానాధీశులు పరిపాలించేవారు, కొద్ది భూభాగాన్ని రాజు తన వ్యక్తిగత అవసరాల కోసం స్వంత ఆస్తిగా ఉంచుకున్నారు. జమీందారులు కట్టవలసిన కొద్ది ధనం నిజాం రాజుకు కట్టి పరిపాలనలో బాగా స్వాతంత్ర్యం తీసుకునేవారు. ఒకవిధంగా సంస్థానాధీశుల పాలనలో ఉన్న భూభాగంపై నిజాం పాలన కన్నా వారి పాలనే ఎక్కువగా సాగేది. కొద్ది డబ్బును కూడా ఈయకుండా పరిపాలన చేసే సంస్థానాదీశులపై నిజాం ససైన్యంగా వచ్చి కొట్టి సాధించి రూకలు తీసుకునేవారు. ఆ జమీందార్లలో ఒకరిలో ఒకరికి సరపడకపోతే వారిలో వారు సైన్యసహితంగా పోరుసల్పడమే కాక ఒకరి గ్రామాలను ఒకరు కొల్లగొట్టి, గ్రామాలను పాడుచేసేవారని 1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాసుకున్నారు. ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించేనాటికి కొల్లాపూర్ సంస్థానం, వనపర్తి సంస్థానాలకు నడుమ అటువంటి వివాదం [1].

1857లో ప్రధానంగా సైన్యంతో పాటు సంస్థానాధీశులు, స్థానిక రాజులు అసంతృప్తితో కంపెనీ పరిపాలనపై తిరుగుబాటు చేసిన సమయంలో మధ్య దక్కన్లో అతిఎక్కువ భూభాగాన్ని పరిపాలిస్తున్న హైదరాబాద్ నవాబు దివాన్ సాలార్ జంగ్ మాత్రం బ్రిటీష్ పక్షాన్ని వహించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా బ్రిటీషర్ల వద్ద నమ్మదగ్గ మిత్రుడు అన్న బిరుదును సంపాదించుకున్నారు. ఈ నిర్ణయం ఆధునిక దేశభక్తులు చాలా అసంతృప్తితో గమనిస్తూంటారు. బ్రిటీష్ ఇండియాలో అతి ఎక్కువ భూభాగాన్ని కలిగివుండి, కొంతవరకూ బలమైన సైన్యశక్తిని కూడా కలిగున్న నిజాం తిరుగుబాటుదారుల వైపు ఉండివుంటే బ్రిటీషర్లు అనూహ్యంగా బలహీనమైపోయి ఉండేవారేనని పేర్కొంటూంటారు. ఉత్తరభారతదేశానికి ఢిల్లీ ఎటువంటిదో దక్షిణభారతానికి హైదరాబాద్ అటువంటిది. ఐతే చారిత్రికంగా ఈ పరిణామం జరగలేదు, పైగా దేశంలోని అనేకమైన రాజ్యాలతోపాటే హైదరాబాద్ బ్రిటీష్ వైపు నిలిచాయి. 1857తో ఈస్టిండియా కంపెనీ పరిపాలన అంతమై బ్రిటీష్ కిరీటపు పాలన కిందకు నేరుగా వచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ అత్యంత ప్రధానమైన ప్రిన్స్‌లీ స్టేట్‌గా నిలిచింది. ఆపైన 20 ఏళ్ళకు విక్టోరియా మహారాణి భారత సామ్రాజ్ఞిగా ప్రకటించుకున్నారు.ఈ పరిణామాలను ఇబ్బందిగా ఊహించిన భారతదేశం ఆపరేషన్ పోలో ప్రారంభించింది, దీని ఫలితంగా హైదరాబాద్ 1948లో ఐక్య భారత్ వశమైంది.

సామాజిక స్థితిగతులు

హైదరాబాద్ రాజ్యాన్ని, హైదరాబాద్ నగరాన్ని 1830ల్లో తన కాశీయాత్రలో భాగంగా సందర్శించిన ఏనుగుల వీరాస్వామయ్య ఈ ప్రాంతాన్ని గురించి తెలుగులో తొలియాత్రాచరిత్రయైన కాశీయాత్ర చరిత్రలో వ్రాశారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.