హిమాలయాలు

హిమాలయాలు లేదా హిమాలయా పర్వతాలు (ఆంగ్లం : Himalaya Range) (సంస్కృతం : हिमालय,), లేదా ఆసియా లోని హిమాలయ పర్వతా పంక్తులు. ఈ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమిని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో కారాకోరం, హిందూకుష్, తోబా కాకర్ మరియు చిన్న పర్వతశ్రేణులైన పామిర్ కోట్ వరకూ వ్యాపించి ఉన్నాయి. హిమాలయాలు అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా మంచుకు నెలవు.[1]

హిమాలయాల 6,000 కి.మీ.ల యాత్ర, భారతఫలకం తాకక ముందు.

ఈ పర్వత పంక్తులు, ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో ఎవరెస్టు పర్వతం, కాంచనగంగ మొదలగు శిఖరములున్నవి. సుమారు నూరు శిఖరములు 7,200 మీటర్ల ఎత్తుకు మించివున్నవి.[2]

ఈ హిమాలయాలు, ఆసియా లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి : భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్ మరియు పాకిస్తాన్. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన సింధు, గంగ-బ్రహ్మపుత్ర మరియు యాంగ్‌ట్‌జీ నదులకు వనరులు. వీటి పరీవాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా ఉంది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ మరియు 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి.

హిమాలయాలలో కొన్ని ముఖ్యమైన శిఖరాలు

శిఖరం పేరుఇతర పేర్లు మరియు అర్థంఎత్తు (మీటర్లు)ఎత్తు (అడుగులు)మొదటి అధిరోహణవ్యాఖ్యలు/గమనికలుఅక్షాంశరేఖాంశాలు[3]
ఎవరెస్టు శిఖరంసాగర్ మాతా, "ఆకాశ నుదురు",
చోమోలాంగ్మా, "విశ్వమాత"
8,84829,0291953ప్రపంచంలోని ఎత్తైన పర్వతం, నేపాల్/టిబెట్ సరిహద్దులో గలదు.27°59′17″N 86°55′31″E
కే-2చోగో గాంగ్రి8,61128,2511954ప్రపంచంలోని 2వ ఎత్తైన పర్వతం, ఆజాద్ కాశ్మీరు, పాకిస్తాన్ మరియు చైనాలోని జింజియాంగ్ లో గలదు.35°52′53″N 76°30′48″E
కాంచనగంగకాంగ్‌చెన్ డ్‌జోంగా, "మంచు యొక్క ఐదు ఖజానాలు"8,58628,1691955ప్రపంచములోని 3వ ఎత్తైన శిఖరం. సిక్కిం (భారత్) మరియు నేపాల్ లో గలదు.27°42′12″N 88°08′51″E *
లోట్‌సే"దక్షిణ శిఖరం"8,51627,9401956ప్రపంచంలోని 4వ ఎత్తైన శిఖరం. నేపాల్ మరియు టిబెట్ ల మధ్యలో గలదు, ఎవరెస్టు ఛాయలో గలదు27°57′42″N 86°55′59″E
మకాలూ"మహా నల్లనిది (The Great Black)"8,46227,7651955ప్రపంచలోని 5వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు.27°53′23″N 87°5′20″E
చో ఓయుఖోవోవుయాగ్, "నీలి (టర్కోయిస్ ఊదా రంగు) దేవత"8,20126,9051954ప్రపంచలోని 6వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు.28°05′39″N 86°39′39″E
ధవళగిరి"తెల్లని పర్వతం"8,16726,7641960ప్రపంచలోని 7వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు.28°41′48″N 83°29′35″E
మానస్లూకుటాంగ్, "ఆత్మ పర్వతం"8,15626,7581956ప్రపంచలోని 8వ ఎత్తైన శిఖరం. గూర్ఖా హిమాల్, నేపాల్ లో గలదు.28°33′00″N 84°33′35″E
నంగా పర్వతందయామీర్, "నగ్న పర్వతం"8,12626,6601953ప్రపంచలోని 9వ ఎత్తైన శిఖరం. భారత్/పాకిస్తాన్ లో గలదు.35°14′14″N 74°35′21″E
అన్నపూర్ణ"పంటల దేవత"8,09126,5451950ప్రపంచలోని 10వ ఎత్తైన శిఖరం. మృత్యుకర పర్వతం. నేపాల్ లో గలదు.28°35′44″N 83°49′13″E
గాషెర్‌బ్రమ్ I"అందమైన పర్వతం"8,08026,5091958ప్రపంచలోని 11వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు.35°43′28″N 76°41′47″E
విశాల శిఖరంఫైచాన్ కాంగ్రి8,04726,4011957ప్రపంచలోని 12వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు..35°48′38″N 76°34′06″E
గాషెర్‌బ్రమ్ II-8,03526,3621956ప్రపంచలోని 13వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు..35°45′28″N 76°39′12″E
షిషాపాంగ్మాజిజియాబాంగ్మా, "గడ్డిమైదానాలపై ఎత్తుప్రాంతం"8,01326,2891964ప్రపంచలోని 14వ ఎత్తైన శిఖరం. టిబెట్ లో గలదు..28°21′12″N 85°46′43″E
గాషెర్‌బ్రమ్ IV-7,92526,0011958ప్రపంచలోని 17వ ఎత్తైన శిఖరం. అత్యంత సాంకేతిక అధిరోహణ. కారాకోరమ్ పాకిస్తాన్/చైనాలో గలదు. .35°45′38″N 76°36′58″E
మషేర్బ్రం / K1మషెర్బ్రమ్7,82125,6601960ప్రపంచలోని 22వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు. .35°38′28″N 76°18′21″E
నందా దేవి"ఆశీర్వదించు-దేవత"7,81725,6451936ప్రపంచలోని 23వ ఎత్తైన శిఖరం. భారత్ లోని ఉత్తరాఖండ్లో గలదు..30°22′33″N 79°58′15″E
రాకాపోషి"మెరిసే కుడ్యము"7,78825,5511958శిఖరాల సముదాయము. కారాకోరం పాకిస్తాన్/చైనాలో గలదు. .36°08′33″N 74°29′22″E
గాంగ్‌ఖర్ పుయెన్సుమ్గాంకర్ పుంజుమ్, "మూడు సోదర పర్వతాలు"7,57024,836అధిరోహించలేదుప్రపంచంలో అధిరోహించని ఎత్తైన శిఖరం. భూటాన్లో గలదు..28°02′50″N 90°27′19″E *
అమా దబ్లామ్"తల్లి మరియు ఆమె నెక్లేస్"6,84822,4671961ప్రపంచంలోనే చాలా అందమైన శిఖరం. నేపాల్ లోని ఖుంబూలో గలదు. .

ధార్మిక స్థానాలు

జమ్మూ లోని వైష్ణోదేవి మందిరం.

హిమాలయాలలో హిందూ మరియు బౌద్ధ ధర్మాలకు చెందిన అనేక ధార్మిక ప్రదేశాలు గలవు. హిందూ ధర్మంలో హిమవత్ శివుని భార్యయైన పార్వతి యొక్క తండ్రి.

  • హరిద్వార్, గంగానది, మైదానంలో ప్రవేశించే ప్రాంతం.
  • బద్రీనాథ్, వైష్ణవాలయం.
  • కేదార్‌నాథ్, 12 జ్యోతిర్లింగాలు గల ప్రదేశం.
  • గౌముఖ్, భగీరథి జన్మస్థానం.
  • దేవ్‌ప్రయాగ్, ఇచట అలక్‌నంద మరియు భగీరథి నదులు కలసి గంగా నదిగా ఏర్పడుచున్నవి.
  • రిషీకేష్,లో లక్ష్మణ దేవాలయం ఉంది.
  • కైలాశ పర్వతం, 6,638 మీటర్ల ఎత్తులో గల శిఖరం, ఇది శివపార్వతుల నివాస స్థలి. ఈ పర్వత అడుగుభాగానే మానస సరోవరం వున్నది, ఇది బ్రహ్మపుత్ర జన్మస్థానం.
  • అమరనాథ్, ఇక్కడ శివలింగం ఉంది.
  • వైష్ణోదేవి, ఈ దేవాలయం, దుర్గాదేవి భక్తులకు కేంద్రబిందువు.
  • హిమాలయాలలో టిబెట్ కు చెందిన ఎన్నో ధార్మిక ప్రదేశాలు గలవు. దలైలామా నివాస స్థలం కూడా ఈ హిమాలయాలలోనే గలదు.
  • యతి అనే ప్రసిద్ధ జీవి, జీవించినట్లు ప్రజల విశ్వాసం.
  • షంభాలా బౌద్ధ ధర్మంలో ప్రముఖ నగరం. భౌతికంగా ఈ నగరం లేకపోయినప్పటికీ ఆధ్యాత్మికంగా బౌద్ధులు చేరే నగరం.
  • హేమ్‌కుండ్ సాహెబ్ - గురు గోబింద్ సింగ్ తపస్సు చేసిన స్థలంలో గల గురుద్వార.

ఇవీ చూడండి

టిబెట్ పీఠభూమి ఆగ్నేయం నుండి ఎవరెస్టు పర్వతం దృశ్యచిత్రం.
  • భారతదేశ భౌగోళికం
  • కారాకోరం (పర్వత పంక్తి)
  • లదఖ్
  • ఎత్తైన శిఖరాల జాబితా - 7,200 మీటర్ల ఎత్తుకు మించినవి.

మూలాలు

  1. Oracle Education Foundation: Indian Himalayas
  2. "Himalayan Mountain System". Retrieved 2007-08-07.
  3. Coordinates were established by comparing topographical maps with satellite images and SRTM-derived terrain maps. The terrain maps and satellite images often don't match exactly. An asterisk (*) indicates that the map and image are shifted by more than 100 m (4") and/or that the landscapes around the summit don't match.

ఇతర పఠనాలు

  • Michael Palin, Himalaya, Weidenfeld Nicolson Illustrated (2004) ISBN 0-297-84371-0
  • John Hunt, Ascent of Everest, Hodder & Stoughton (1956) ISBN 0-89886-361-9
  • Everest, the IMAX movie (1998), ISBN 0-7888-1493-1

బయటి లింకులు

చిత్రమాలిక

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.