హిడింబి

హిడింబి మహాభారతంలో భీముని భార్య. ఘటోత్కచుడు ఆమె కుమారుడు. ఆదిపర్వంలోని 18 వ ఆశ్వాసంలో హిడింబి భీముని కలుసుకుంటుంది. ఈమెకే పల్లవి అనే పేరు కూడా ఉంది.

పాండవులు లక్క ఇంటి నుంచి తప్పించుకుని ఒక దట్టమైన అడవిలోకి వెళతారు. చాలా సేపు నడచి అలసిపోయి ఆ రాత్రి ఒకచోట విశ్రమిస్తారు. అందరూ నిద్రపోతుండగా భీమసేనుడు కాపలాగా ఉంటాడు. వారికి సమీపంలో రాక్షస జాతికి చెందిన హిడింబి, తండి అనే అన్నా చెల్లెళ్ళు ఉంటారు. తండి పాండవుల వాసనను పసిగట్టి అక్కడ బాగా బలిష్టంగా ఉన్న భీముని ఆకర్షించి ఆహారంగా తీసుకుమ్మని హిడింబిని పంపిస్తాడు. కానీ హిడింబి భీముణ్ణి మోహిస్తుంది. ఒక అందమైన స్త్రీ రూపం ధరించి తనను పెళ్ళాడమని భీముని కోరుతుంది. భీముడు అందుకు అంగీకరించడు. ఆమె తన నిజస్వరూపం ధరించి తన అన్న చెప్పిన పని గురించి చెబుతుంది. భీముడు తండితో యుద్ధానికి తలపడతాడు. ఆ పోరులో భీముడు తండిని సంహరిస్తాడు.

సోదరుని మరణంతో తనమీద ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని భీముడు హిడింబిని కూడా చంపబోతాడు. ధర్మరాజు అడ్డుకుంటాడు. తరువాత హిడింబి తను ఒంటరిదానను కాబట్టి పెళ్ళి చేసుకోమని భీముడిని ఒప్పించమని కుంతీదేవిని వేడుకుంటుంది. ఆమె కుమారుణ్ణి హిడింబిని పెళ్ళాడమని ఆజ్ఞాపిస్తుంది. అయితే భీమసేనుడు ఆమెను పెళ్ళాడిన తరువాత విడిచి వెళ్ళడానికి ఆమె అనుమతిస్తేనే అందుకు అంగీకరిస్తానంటాడు. హిడింబి అందుకు అంగీకరించి భీముని పెళ్ళాడుతుంది. వారికి ఘటోత్కచుడు అనే కుమారుడు కలిగిన తరువాత పాండవులు అక్కడినుండి నిష్క్రమిస్తారు. తల కుండ లాంటి ఆకారంతో ఉండటం వల్ల ఘటోత్కచుడికి ఆ పేరు వచ్చింది. ఘటోత్కచుడు పెరిగి పెద్దైన తరువాత మంచి యోధుడవుతాడు. మహాభారత యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషిస్తాడు. అతని మంత్ర తంత్ర విద్యలకు తను తప్ప ఇంకెవ్వరూ సాటి రారని శ్రీకృష్ణుడు వరం ప్రసాదిస్తాడు.

హిమాచల్ ప్రదేశ్ లో హిడింబాదేవిని దేవతగా ఆరాధిస్తారు. మనాలిలొ ఆమెకు ఓ ఆలయం కూడా ఉంది.

మహాభారతం - ఆంధ్ర మహాభారతం - వ్యాసుడు - కవిత్రయం

పర్వాలు

ఆది పర్వము  సభా పర్వము  వన పర్వము లేక అరణ్య పర్వము  విరాట పర్వము  ఉద్యోగ పర్వము  భీష్మ పర్వము  ద్రోణ పర్వము  కర్ణ పర్వము  శల్య పర్వము  సౌప్తిక పర్వము  స్త్రీ పర్వము  శాంతి పర్వము  అనుశాసనిక పర్వము  అశ్వమేధ పర్వము  ఆశ్రమవాస పర్వము  మౌసల పర్వము  మహాప్రస్ధానిక పర్వము  స్వర్గారోహణ పర్వము  హరివంశ పర్వము

పాత్రలు
శంతనుడు | గంగ | భీష్ముడు | సత్యవతి | చిత్రాంగదుడు | విచిత్రవీర్యుడు | అంబ | అంబాలిక | విదురుడు | ధృతరాష్ట్రుడు | గాంధారి | శకుని | సుభద్ర | పాండు రాజు | కుంతి | మాద్రి | యుధిష్ఠిరుడు | భీముడు | అర్జునుడు | నకులుడు | సహదేవుడు | దుర్యోధనుడు | దుశ్శాసనుడు | యుయుత్సుడు | దుస్సల | ద్రౌపది | హిడింబి | ఘటోత్కచుడు | ఉత్తర | ఉలూపి | బభృవాహనుడు |అభిమన్యుడు | పరీక్షిత్తు | విరాటుడు | కీచకుడు | ద్రోణుడు | అశ్వత్థామ | ఏకలవ్యుడు | కృతవర్మ | జరాసంధుడు | సాత్యకి | దుర్వాసుడు | సంజయుడు | జనమేజయుడు | వేదవ్యాసుడు | కర్ణుడు | జయద్రధుడు | శ్రీకృష్ణుడు | బలరాముడు | ద్రుపదుడు | | దృష్టద్యుమ్నుడు | శల్యుడు | శిఖండి
ఇతర విషయాలు
పాండవులు | కౌరవులు | హస్తినాపురం | ఇంద్రప్రస్థం | రాజ్యాలు | కురుక్షేత్ర యుద్ధం | భగవద్గీత


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.