హింగోలి

హింగోలీ (हिंगोली), మహారాష్ట్రలో ఒక జిల్లా. ఈ జిల్లా పాలనాకేంద్రం హింగోలీ పట్టణం. జిల్లా వైశాల్యం4,526 చ.కి.మీ. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 9,87,160. అందులో పట్టణ నగరవాసులు 15.60%. . ప్రస్తుతం హింగోలి జిల్లా పరిధిలో ఉన్న ప్రాతం 1956లో బొంబాయి రాష్ట్రంలో భాగమైనది. 1960లో మహారాష్ట్ర రాష్ట్రంలో పర్భణీ జిల్లాలో భాగంగా ఉంది. 1999, మే 1న పర్భణీ జిల్లా నుండి హింగోలి జిల్లాను ఏర్పాటుచేశారు.

హింగోలీ జిల్లా
हिंगोली जिल्हा
మహారాష్ట్ర జిల్లాలు

మహారాష్ట్ర రాష్ట్రంలో హింగోలీ యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజన్ఔరంగాబాదు డివిజన్
ముఖ్యపట్టణంహింగోలీ
తాలూకాలు1. హింగోలీ, 2. కాలమ్నూరి, 3. సేన్‌గావ్, 4. ఔందా, 5. బాస్మత్
ప్రభుత్వం
  లోకసభ నియోకవర్గాలుహింగోలీ
  శాసనసభ నియోజకవర్గాలు3
విస్తీర్ణం
  మొత్తం4
జనాభా (2001)
  మొత్తం987
  సాంద్రత220
  Urban15.60
వెబ్‌సైటుఅధికారిక వెబ్‌సైటు

జిల్లాను రెండు ఉప డివిజన్లు, మొత్తం ఐదు తాలూకాలుగా వ్యవస్థీకరించారు. హింగోలి సబ్ డివిజన్లో హింగోలి, కాలమ్నూరి మరియు సేన్‌గావ్ తాలూకాలున్నాయి. అలాగే, బాస్మత్ సబ్ డివిజన్లో ఔందా మరియు బాస్మత్ తాలూకాలున్నాయి. జిల్లాలో మూడు విధానసభా నియోజకవర్గాలున్నాయి. అవి బాస్మత్, కాలమ్నూరి మరియు హింగోలి. ఈ మూడు నియోజకవర్గాలు హింగోలి లోక్‌సభ నియోజకవర్గంలో భాగమై ఉన్నాయి.[1]

ఇతర విశేషాలు

మూలాలు

  1. "Districtwise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Retrieved 2009-03-24.

బయటి లింకులు

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.