హర్యానా
హర్యానా (हरयाणा, Haryana ) వాయువ్య భారతదేశములోని ఒక రాష్ట్రము. దీనికి ఉత్తరాన పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములు, పశ్చిమాన మరియు దక్షిణాన రాజస్థాన్ సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున యమునా నది హర్యానా మరియు ఉత్తరాఖండ్ మరియు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రములకు సరిహద్దుగా ఉంది. ఘగ్గర్ నది, మర్ఖందా, తంగ్రి, సాహిబీ మొదలైన నదులు రాష్ట్రము గుండా ప్రవహించుచున్నాయి.
| హర్యానా | |
![]() Map of India with the location of హర్యానా highlighted. | |
| రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
ఛండీగఢ్ - |
| పెద్ద నగరము | ఫరీదాబాద్ |
| జనాభా (2001) - జనసాంద్రత |
21,082,989 (16th) - 477/చ.కి.మీ |
| విస్తీర్ణము - జిల్లాలు |
44,212 చ.కి.మీ (20th) - 19 |
| సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
| అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1966-11-01 - ఎ.ఆర్.కిద్వాయ్ - మనోహర్ లాల్ ఖట్టర్ - ఒకే చట్ట సభ (90) |
| అధికార బాష (లు) | హిందీ,పంజాబీ(రెండవ అధికారిక భాష) |
| పొడిపదం (ISO) | IN-HR |
| వెబ్‌సైటు: haryana.gov.in | |
భౌగోళికము
హర్యానా ఉత్తరాన 27 డిగ్రీల 37' నుండి 30 డిగ్రీల 35' అక్షాంశముల మధ్య మరియు 74 డిగ్రీల 28' నుండి 77 డిగ్రీల 36' రేఖాంశముల మధ్య ఉంది. హర్యానా రాష్ట్రము సముద్రమట్టమునకు 700 నుండి 3600 అడుగుల ఎత్తున ఉంది. పరిపాలనా సౌలభ్యము కొరకు రాష్ట్రము నాలుగు విభాగములుగా విభజించబడింది. అవి అంబాలా, రోతక్, గుర్‌గావ్ మరియు హిస్సార్. రాష్ట్రము 19 జిల్లాలు, 47 ఉప-విభాగములు, 67 తాలూకాలు, 45 ఉప-తాలూకాలు మరియు 116 బ్లాకులుగా విభజించబడింది. హర్యానాలో మొత్తము 81 నగరములు మరియు పట్టణములు, 6,759 గ్రామాలు ఉన్నాయి. 1,553 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణములో అడవులు ఉన్నాయి. హర్యానా యొక్క నాలుగు ముఖ్య భౌగోళిక విశేషాలు.
చరిత్ర
పంజాబ్ ప్రాంతములో అధికముగా హిందీ మాట్లాడే భాగము హర్యానా అయినది. పంజాబీ మాట్లాడే భాగము పంజాబ్ రాష్ట్రము అయినది. ప్రస్తుత హర్యానా జనాభాలో హిందువులు అధిక సంఖ్యాకులు. భాషా సరిహద్దు మీద ఉన్న ఛండీగఢ్, కేంద్ర పాలిత ప్రాంతముగా యేర్పడి రెండు రాష్ట్రములకు రాజధానిగా వ్యవహరింపబడుతున్నది.
4000 సంవత్సరాల పురాతన చరిత్రగల హర్యానా వైదిక మరియు హిందూ నాగరికతలకు పుట్టినిల్లు. 3000 సంవత్సరాల క్రితము ఇక్కడే శ్రీకృష్ణభగవానుడు మహాభారతయుద్ధ ప్రారంభ సమయమున గీతను ప్రవచించాడు. మహాభారత యుద్ధమునకు మునుపు సరస్వతి లోయలోని, కురుక్షేత్ర ప్రాంతములో దశ చక్రవర్తుల యుద్ధము జరిగింది. మహాభారతములో (క్రీ.పూ.900) హర్యానా బహుధాన్యక (సకల సంపదల భూమి) అని వ్యవహరింపబడింది. హరియానా అన్న పదము మొదట ఢిల్లీ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న 1328 ప్రాంతపు సంస్కృత శాసనములో కనిపిస్తున్నది. ఈ శాసనములో ఈ ప్రాంతము భూతల స్వర్గముగా అభివర్ణించబడింది. ఆర్య సంస్కృతి ఇక్కడే పుట్టి పెరిగినదని చాటుతున్నది.
నౌరంగాబాద్, భివానీలోని మిత్తతల్, ఫతేబాద్ లోని కునాల్, హిస్సార్ దగ్గరి అగ్రోహా, జింద్ లోని రాఖీగర్హీ, రోతక్ లోని రూఖీ మరియు సిర్సాలోని బనావలి మొదలైన ప్రాంతములలో జరిపిన పురావస్తు త్రవ్వకాలలో హరప్పా సంస్కృతి మరియు హరప్ప పూర్వ సంస్కృతుల ఆధారములు లభించినవి. కురుక్షేత్ర, పెహోవా, తిల్‌పట్ మరియు పానిపట్ ప్రాంతాలలో దొరకిన మట్టి కుండలు, శిల్పాలు, ఆభరణాలు మహాభారత కథకు చారిత్రతకు ఆధారములు సమకూర్చినాయి. ఈ ప్రాంతాలన్ని మహాభారతములో ప్రీతుదక (పెహోవ), తిలప్రస్థ (తిల్‌పట్), పానప్రస్థ (పానిపట్) మరియు సోనప్రస్థ (సోనిపట్) గా ఉల్లేఖించబడినవి.
హర్యానా జిల్లాలు
హర్యానా
| వ.సం. | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణము | జనాభా (2001) | విస్తీర్ణము (కి.మీ.²) | జన సాంద్రత (/కి.మీ.²) |
|---|---|---|---|---|---|---|
| 1 | AM | అంబాలా | అంబాలా | 1013660 | 1569 | 646 |
| 2 | BH | భివాని | భివాని | 1424554 | 5140 | 277 |
| 3 | FR | ఫరీదాబాద్ | ఫరీదాబాద్ | 2193276 | 2105 | 1042 |
| 4 | FT | ఫతేబాద్ | ఫతేబాద్ | 806158 | 2491 | 324 |
| 5 | GU | గుర్‌గావ్ | గుర్‌గావ్ | 1657669 | 2760 | 601 |
| 6 | HI | హిస్సార్ | హిస్సార్ | 1536417 | 3788 | 406 |
| 7 | JH | ఝజ్జర్ | ఝజ్జర్ | 887392 | 1868 | 475 |
| 8 | JI | జింద్ | జింద్ | 1189725 | 2736 | 435 |
| 9 | KR | కర్నాల్ | కర్నాల్ | 1274843 | 2471 | 516 |
| 10 | KT | కైతాల్ | కైతాల్ | 945631 | 2799 | 338 |
| 11 | KU | కురుక్షేత్ర | కురుక్షేత్ర | 828120 | 1217 | 680 |
| 12 | MA | మహేంద్రగఢ్ | నర్నౌల్ | 812022 | 1683 | 482 |
| 13 | PK | పంచ్‌కుల | పంచ్‌కుల | 469210 | 816 | 575 |
| 14 | PP | పానిపట్ | పానిపట్ | 967338 | 1250 | 774 |
| 15 | RE | రెవారి | రెవారి | 764727 | 1559 | 491 |
| 16 | RO | రోహ్తక్ | రోహ్తక్ | 940036 | 1668 | 564 |
| 17 | SI | సిర్సా | సిర్సా | 1111012 | 4276 | 260 |
| 18 | SO | సోనిపట్ | సోనిపట్ | 1278830 | 2260 | 566 |
| 19 | YN | యమునానగర్ | యమునానగర్ | 982369 | 1756 | 559 |
జిల్లాలు
రాష్ట్ర గణాంకాలు
- అవతరణము.1 నవంబరు 1966
వైశాల్యము.44,212 చ.కి.
- జనసంఖ్య. 25,353,081 స్త్రీలు. 11,847,951 పురుషులు. 13,505,130 నిష్పత్తి . 877
- జిల్లాల సంఖ్య.21
- గ్రామాలు. 6,764 పట్టణాలు.106
- ప్రధాన భాష. హింది . పంజాబి. ప్రధాన మతం. హిందు, ఇస్లాం, క్రీస్తు
- పార్లమెంటు సభ్యుల సంఖ్య, 10 శాసన సభ్యుల సంఖ్య.90
- మూలము. మనోరమ యీయర్ బుక్
.svg.png)