హరీష్
హరీష్ (జననం: ఆగస్టు 1, 1975) ఒక ప్రముఖ సినీ నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో దాదాపు 280 సినిమాలలో నటించాడు.
| హరీష్ | |
|---|---|
![]() 2011లో హరీష్ | |
| జననం | హరీష్ 1975 ఆగస్టు 14 హైదరాబాదు |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 1979–1983, 1991–ప్రస్తుతం |
జీవిత విశేషాలు
హరీష్ ఆగస్టు 14, 1975 న హైదరాబాదులో జన్మించాడు.[1]
కెరీర్
హరీష్ బాలనటుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. తరువాత హీరో గా మారి దక్షిణాది భాషలన్నింటిలోనే కాక హిందీ లో కూడా నటించాడు. 1990 లో ఇ.వి.వి. దర్శకత్వంలో ప్రేమ ఖైదీ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా హిందీలో కూడా ఇదే పేరుతో పునర్నిర్మితమైంది. ఇందులో కరిష్మా కపూర్ కథానాయికగా నటించింది. [2]
పురస్కారాలు
1983 లో ఆంధ్రకేసరి సినిమాకు గాను ఉత్తమ బాలనటుడిగా అప్పటి ముఖ్యమంత్రి రామారావు చేతులమీదుగా రాష్ట్ర పురస్కారం అందుకున్నాడు. 1996 లో జంధ్యాల దర్శకత్వం వహించిన ఓహో నా పెళ్ళంట సినిమాకు గాను ప్రత్యేక జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నాడు.
నటించిన సినిమాలు
- ఆడపిల్ల
- కొండవీటి సింహం
- ముద్దుల కొడుకు
- త్రిశూలం
- దొంగ
- నా దేశం
- శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
- డాడీ డాడీ
- గోకులంలో సీత
- ఓహో నా పెళ్ళంట
- ఎస్.పి.పరశురాం
- బంగారు కుటుంబం
- మనవరాలి పెళ్ళి
- ఇన్స్పెక్టర్ ఝాన్సీ
- ప్రాణదాత
- రౌడీ ఇన్స్పెక్టర్
- పెళ్ళాం చెబితే వినాలి
- ప్రేమ పంజరం
- ప్రేమ ఖైదీ
- వివాహ భోజనంబు
- సీతామాలక్ష్మి
- మాధవయ్యగారి మనవడు
- ఏవండీ ఆవిడ వచ్చింది
- కొండపల్లి రత్తయ్య
- పెళ్ళైంది కానీ
మూలాలు
- "హరీష్ బయోగ్రఫీ". movies.dosthana.com. Retrieved 6 September 2016.
- "Spotted: Prem Qaidi actor Harish in Delhi". rediff.com. Retrieved 6 September 2016.
బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో హరీష్ పేజీ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
