హరనాథ్

బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు (సెప్టెంబర్ 2, 1936 - నవంబర్ 1, 1989) తెలుగు సినిమా కథానాయకుడు.

హరనాథ్
హరనాథ్
జననం బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు
(1936-09-02) 1936 సెప్టెంబరు 2
రాపర్తి , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, India
మరణం 1989 నవంబరు 1 (1989-11-01)(వయసు 53)
వృత్తి నటుడు
క్రియాశీలక సంవత్సరాలు 1959 - 84

జననం

ఈయన 1936లో సెప్టెంబర్ 2 న తూర్పుగోదావరి గొల్లప్రోలు మండలం రాపర్తి గ్రామంలో బుద్దరాజు వరహాలరాజు దంపతులకు జన్మించాడు. ఈయనకు కుమారుడు శ్రీనివాస రాజు, కుమార్తె పద్మజ ఉన్నారు. తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే సుప్రసిద్ధ గ్రంథ రచయిత.

కళాశాలలో చదువుకునే రోజుల్లో హరనాథ్ అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నాడు. 60 వ దశకంలో హరినాధ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేరొందాడు. ఈయన తొలి సినిమా అయిన మా ఇంటి మహాలక్ష్మి 1959 లో హైదరాబాద్ సారథీ స్టూడియోస్ లో చిత్రీకరించారు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులో హరనాద్ ప్రముఖ హీరో అని అనిపించుకున్నాడు.[1] నందమూరి తారక రామారావు నిర్మించిన సీతారామకళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడుగా నటించాడు. 1967 లో నిర్మించిన భీష్మలో శ్రీకృష్ణుడుగా నటించాడు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడం సినిమాల్లో నటించాడు. చివరి దశలో మద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిథి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి. హరనాథ్ చివరి సినిమా... చిరంజీవి నటించిన, నాగు సినిమాలో తండ్రి పాత్ర పోషించాడు.

మరణం

ఈయన 1989, నవంబర్ 1 న మరణించాడు.

నటించిన సినిమాలు

మూలాలు

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.