హంపి

13-15వ శతాబ్దములో విజయనగర సామ్రాజ్య రాజధాని ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని ఒక చిన్న పట్టణం. విద్యారణ్య స్వామి ఆశిస్సులతో స్థాపించడిన విజయనగరసామ్రాజ్యానికి విజయనగరం లేదా హంపి రాజధాని. దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయంగరసామ్రాజ్యం ఒకటి. .

విజయనగరం (కర్ణాటక) వ్యాసాన్ని, ఈ వ్యాసము లేదా వ్యాస విభాగములో విలీనము చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
హంపి
ಹಂಪೆ
హంపె
పట్టణం
Virupaksha Temple, Hampi, Karnataka
హంపి
భౌగోళికాంశాలు: 15.335°N 76.462°E / 15.335; 76.462
CountryIndia
StateKarnataka
DistrictBellary
స్థాపించిన వారుHarihara and Bukkaraya
ఎత్తు m ( ft)
జనాభా (2011)
  మొత్తం2,777[1]
Languages
  OfficialKannada
సమయప్రాంతంIST (UTC+5:30)
Nearest cityHospet
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
Group of Monuments at Hampi
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
రకంCultural
ఎంపిక ప్రమాణం(i)(iii)(iv)
మూలం241
యునెస్కో ప్రాంతంAsia-Pacific
శిలాశాసన చరిత్ర
శాసనాలు1986 (10th సమావేశం)
అంతరించిపోతున్న సంస్కృతి19992006
గమనిక: విజయనగరం (కర్ణాటక) అనే మరొక వ్యాసంలో విషయం విపులంగా ఉన్నది. "విజయనగరం", "హంపి" అనే రండు వ్యాసాలను వేరు వేరుగా చేసి, విషయాన్ని అందుకు అనుగుణంగా విభజించాలి.

దర్శనీయ స్థలాలు

నగర ప్రవేశం

14వ శతాబ్దం నగర అవశేషాలు 26 చదరపు కి.మి విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఉత్తరం వైపు తుంగ భద్ర నది మిగతా మూడు వైపుల పెద్ద పెద్ద గ్రానైటు శిలలతో అప్పటి విజయనగర వీధుల వైభవాన్ని తెలుపుతూ ఉంటుంది. ఈ పట్టణంలోకి ప్రవేశిస్తుంటే కనిపించే విశాలమైన భవంతులు, పెద్ద పెద్ద ప్రాకారాలు అప్పటి నగర నిర్మాణ చాతుర్యాన్ని, సుల్తానుల అవివేక వినాశన వైఖరిని వెల్ల బుచ్చుతాయి.

నగరం యొక్క ప్రధాన అవశేషాలన్ని కమలాపుర్‌ నుండి హంపి వెళ్ళే రహదారిలో కనిపిస్తాయి. కమలాపుర నుండి హంపి వెళ్ళె దారిలో కమలాపురకు మూడు కి.మి. దూరం మల్యంవంత రఘునాధ స్వామి దేవాలయం వస్తుంది. ఈ దేవాలయం దవ్రిడ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఆ ఆలయంలో వైవిధ్య భరితంగా చెక్క బడిన చేపలు, జలచరాలు పర్యాటకుల కళ్ళలను

విరుపాక్ష దేవాలయం

800 గజాల పొడవు 35 గజాల వెడల్పు ఉన్న హంపి వీదులలో అత్యంత సుందరమైన ఇళ్ళున్నాయి.

  • విరుపాక్ష దేవాలయం - హంపి వీధికి పశ్చిమ చివర విరుపాక్ష దేవాలయం ఉంది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరుపాక్ష దేవాలయంలోనికి స్వాగతం పలుకుతుంది. దేవాలయంలో ప్రధాన దైవం విరుపాక్షుడు (శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపా దేవి గుడి, భువనేశ్వరి దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్దం[2] నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉంది. విరుపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్దానికి చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా [3]

చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయస్లల పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజులే నిర్మించారు.[4]

విజయనగర రాజుల పతనమయ్యాక దండయాత్రల వల్ల 16 వ శతాబ్ధానికి హంపి నగరంలోని అత్యాద్బుత శిల్ప సౌందర్యం నాశమైపోయింది.[5]

విరుపాక్ష-పంపా ప్రాకారం మాత్రం 1565 దండయాత్రల బారి పడలేదు. విరుపాక్ష దేవాలయంలో దేవునికి దూపనైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 19 వ శతాబ్దం మెదలులో ఈ ఆలయం పైకప్పు పై చిత్రాలకి, తూర్పు, ఉత్తర గోపురాలకి జీర్ణోద్ధరణ జరిగింది.[6]

  • ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి మిగతా 7 ఖానాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయటి నుండి ఆలయంలోకి వెళ్ళే మొదటి ప్రాకారం స్తంభాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్థంబాలతో కూడి కప్ప బడిన వసరా ఉంటుంది. స్తంభాలతో కూడి ఉన్న వసరాలో చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. దీని కూడా దాటి లోపలి ప్రాకారంలోకి వెళ్ళితే గర్భగుడి వస్తుంది.[7]

తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెళ్తుంది.[8]

ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీ కృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్థంబాల వసరాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి. ఈ లోపలి ప్రాకారంలోని స్తంభాల వసరాని 1510 సంవత్సరములో కృష్ణదేవరాయలు కట్టించాడని కుడా శిలాశాసనాలు చెబుతున్నాయి. [9] విరుపాక్ష దేవాలయంలోని బయటి ప్రాకారంలో ఏకశిలలో చెక్క బడిన నంది ఒక కి.మి. దూరం వరకు కనిపిస్తుంది.[10]

విఠల దేవాలయ సముదాయం

హంపికి ఈశాన్య భాగంలో అనెగొంది గ్రామానికి ఎదురుగా ఉన్న విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్ప కళా సంపత్తికి ఒక నిదర్శనం. ఈ దేవాలయం మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విఠలుడిది. ఈ ఆలయం 16 వ శతాబ్ధానికి చెందినది. విఠలేశ్వర దేవాలయం ఆకర్షణీయమైన విశేషం సప్త స్వరాలు పలికే ఏడు సంగీత స్తంభాలు.ఈ దేవాలయంలోనే పురందరదాస ఆరాధనోత్సవాలుe phone and జరుతాయి.

శిలా రథం

ఈ ఏక శిలా రథం విఠల దేవాలయ సముదాయానికి తూర్పు భాగంలో ఉంది. ఇంకో విశేషం ఏమంటె ఈ రథానికి కదిలే చక్రాలు ఉంటాయి.

గజ శాల

పట్టపు ఏనుగులు నివాసం కొరకు వాటి దైనందిన కార్యకలాపాల కొరకు రాజ ప్రసాదానికి దగ్గరలోనే గజశాల ఉంది. ఏనుగులు కవాతు చేయడానికి వీలుగా ఈ గజశాలకు ఎదురుగా ఖాళీ ప్రదేశం ఉంది. ఈ గజశాల గుమ్మాలు కొప్పు ఆకారంలో ఉండి ముస్లిం కట్టడ శైలి చూపుతున్నాయి. మావటి వారు సైనికులు ఉండడానికి గజశాలకు ప్రక్కన సైనిక స్థావరాలు ఉన్నాయి.[11]

==ఇతర విశేషాలు== గోపురం నీడ ప్రధాన ఆలయం లోని ఒక చిన్న రంద్రంలో నుండి క్రింద నుండి పైకి అనగా తలక్రిందులుగా కనపడటం అప్పటి కళా చాతుర్యంకి నిదర్శనం

దృశ్యం

Hampi Scenery, 360° Panorama Shot from Matanga Hill

చిత్రమాలిక

మూలాలు

బయటి లింకులు


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.