స్వప్న

స్వప్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రం ద్వారా సినీనటి స్వప్న పరిచయం చేయబడింది.

స్వప్న
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం రాజా ,
స్వప్న,
రాంజీ,
చాట్ల శ్రీరాములు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ లలిత ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథ

స్వప్నని రాజా ప్రేమిస్తాడు. అది చెప్పే లోపలే ఆమె తండ్రి స్వప్నకి రాంజీతో పెళ్ళి నిశ్చయం చేస్తారు. రాంజీ అన్ని విధాల తగిన వాడు అని స్వప్న కూడా ప్రేమలో పడుతుంది. ఈ లోపల స్వప్న తండ్రి మరణిస్తారు. స్వప్న ఆస్తి మొత్తం కోర్టు గొడవల్లో ఉండటంతో రాంజీ ఇంకో డబ్బున్న అమ్మాయి వెనకాల పడతాడు. ఆ అమ్మాయి రాంజీ స్వభావం తెలిసి వదిలేస్తుంది. రాంజీ తిరిగి స్వప్న దగ్గరకి వస్తాడు. స్వప్న ఛీకొట్టి రాజాతో వెళ్ళిపోతుంది.

పాటలు

  • అంకితం, నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం !
  • అందాలు రాశిగా పోసి ఆ రాశికి ప్రాణం పోసి
    ఆ బ్రహ్మ చేసిన బొమ్మ నీవు, నీకు జోహారు, స్వప్నా, స్వప్న!
  • ఇదే నా మొదటి ప్రేమలేఖ, రాసాను నీకు చెప్పలేక
    ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేతకాక
  • ముద్ద ముద్ద మందారాలు, లేత బుగ్గ సింగారాలు
  • శ్రీరస్తు అబ్బాయి, శుభమస్తు అమ్మాయి...

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.