సోలంకీలు

భారతదేశంలోని, గుజరాత్ ప్రాంతాన్ని క్రీ.శ 950-1300 మధ్యకాలంలో పరిపాలించిన ఒక రాజవంశం, సోలంకీలు. వీరిని గుజరాత్ చాళుక్యులుగా, సోలంకీ రాజపుత్రులుగా కూడా పిలుస్తారు. అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ ను ఆక్రమించినపుడు, ఈ రాజవంశం అంతరించింది. వీరి కులదేవం, ప్రభాసతీర్థం వద్దనున్న సోమనాధుడు. .[1]

సోలంకీలు

c. 960  1243
 

రాజధాని అంహిల్ వాడా (నేటి పాటణ్, గుజరాత్
మతము శైవమతం, జైనమతం
Government రాజరికం
President
 - 940- మూలరాజు
భీమదేవుడు - 1
 - -1096 కరణదేవుడు - 1
 - 1096-1143 సిద్ధరాజ జయసింహ
 - 1143-1172 కుమారపాలుడు
 - 1172-1243 బాల మూలరాజు
చరిత్ర
 - ఆవిర్భావం c. 960
 - పతనం 1243

సోలంకీ/చాళుక్య అనే తెగ 36 రాజపుత్ర తెగలలో ఒకరు.[2]

పరిపాలనాకాలం

వీరి పరిపాలనాకాలంలో గుజరాత్ హిందూమహాసముద్రం ద్వారా సాగిన వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. అప్పటి రాజధాని అంహిలవాడ (నేటి పాటణ్), 100000 జనాభాతో, ఆనాటి భారతీయ పెద్ద నగరాలలో ఒకటి. వీరి కాలంలోనే, సుప్రసిద్ధ సోమనాధ్ దేవాలయాన్ని గజనీ మహమ్మద్ క్రీ.శ1026లో కొల్లగొట్టాడు. క్రీ.శ 1243 అనంతరం, సోలంకీలు గుజరాత్ ప్రాంతంపైన నియంత్రణ కోల్పోయారు. వీరి సామంతులైన వాఘేలాలు, స్వతంత్రించారు. ఈ వాఘేలాలు దేవగిరిని పాలించిన యాదవులకు సామంతులైనారు.

మూలరాజు

క్రీ.శ 940-41 కాలంలో మూలరాజు అనహిలపటకం రాజధానిగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు.[1]

భీమదేవ - 1

భీమదేవ- 1 నిర్మించిన మొధేరా సూర్యదేవాలయం

మూలరాజు అనంతరం భీమదేవుడు-1 రాజ్యానికి వచ్చాడు. మొధేరాలోని సూర్యదేవాలయాన్ని, నిర్మింపజేశాడు. ఈతని భార్య, ఉదయమతీ దేవి రాణి కీ వావ్ (రాణిగారి బావి) ని నిర్మింపజేసింది.

కరణదేవ - 1

భీమదేవుని అనంతరం వచ్చిన రాజు, కరణదేవుడు - 1. ఈతడు భిల్లులను ఓడించి, కర్ణావతి (నేటి అహ్మదాబాద్) నగరాన్ని నిర్మించాడు. కరణదేవ - మీనలదేవి ల కొడుకు, సిద్ధరాజ జయసిన్హ్

సిద్ధరాజ జయసిన్హ్

సిద్ధరాజ జయసిన్హ్ అర్థశతాబ్దంపైగా పాలించడమే కాక, మాళవ రాజ్యాన్ని ఆక్రమించి సామ్రాజ్యంగా మార్చాడు. సిద్ధాపూర్ వద్దన ఈతడు కట్టించిన రుద్రమహాకాల ఆలయం, ఆనాటి శిల్పకళలని చూపుతుంది. [1]

కుమారపాల

సిద్ధరాజు అనంతరం వచ్చిన కుమారపాలుడు క్రీ.శ 1143 నుండి 1174 వరకూ, 31 సంవత్సరాలు పాలించాడు. సోమనాధ్ ఆలయాన్ని పునర్నిర్మించాడు.

బాల మూలరాజు

అనంతరం, బాల మూలరాజు ఘోరీ మహమ్మద్ దాడులని తిప్పికొట్టగలిగాడు.

అనంతరం

సోలంకీల పాలన అంతమైన పిదప, వాఘేలాలు గుజరాత్ ప్రాంతాన్ని 76 సంవత్సరాలు పాలించారు. వారిలో చివరివాడైన కరణదేవుని, క్రీ.శ 1297లో అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడించి., ఆ ప్రాంతాన్ని ఢిల్లీ ఏలుబడిలోని తీసుకుని వచ్చాడు.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. p. 28-29. ISBN 978-9-38060-734-4.
  2. https://books.google.co.in/books/about/36_Royal_Races_Agnivansha_Bais_Rajputs_B.html?id=JqUxngEACAAJ
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.