సోమరసం

సోమరసం ఒక ప్రత్యేకమైన మొక్కల కాండాల నుండి రసం సంగ్రహించుట వలన సిద్ధం అవుతోంది అని వేదాలలో వర్ణించబడింది.[1]

చరిత్ర

  • సోమలత యొక్క చిన్న చిన్న కొమ్మలు అంశువులు అని అంటారు. వీటిని రెండు చేతులు, పది వ్రేళ్ళతో త్రిప్పుతూ రాళ్ళతో చితక కొడతారు. వీటి నుండి సోమరసం స్రవిస్తుంది (ద్రవిస్తుంది). ఆ తరువాత పది వ్రేళ్ళతో, ఉన్నివస్త్రాలతో ఆ సోమ రసాన్ని వడగడతారు. ఆ వచ్చిన ద్రవాన్ని పాల తోనూ, పెరుగు తోనూ, బార్లీ తోనూ, నీళ్ళ తోనూ కొన్ని సందర్భాలలో తేనె తోనూ కలిపిన రసాన్ని యజ్ఞములలో వినియోగించుతారు.

ఈ మొక్క చాలా అరుదైనది . ఈ మొక్క యొక్క ఆకు, రోజుకు ఒక్క ఆకు చొప్పున శుక్లపాడ్యమి నుండి పున్నమి వరకు పెరిగి బహుళ పాడ్యమినుండి అమావాస్య వరకు ఒక్కొక్క ఆకును రాల్చుతుంది.

యజ్ఞం

ఆఫ్ఘనిస్తాన్ లో 'సోమలత సమృద్ధిగా దొరుకుతుంది. సోమరసం లేకుండా ఏ యజ్ఞం లేదు. ఋగ్వేదం యొక్క తొమ్మిదో మండలము సోమ మండలం అంటారు.[2]

నమ్మకము

  • ఈ సోమరసం ఇంద్రుడుకి చాలా ఇష్టం,
  • ఈ సోమరసము త్రాగిన వారిని అమరులని చేస్తుందని నమ్మకము. ఈ అమృతమును పీయూషము అని కీర్తించ బడింది.
  • ఈ సోమరసము, సోమలత, సోమదేవతలు హరిత వర్ణము, అరుణ వర్ణము లతో కలిగి ఉంటాయి.
  • ఈ సోమరసం మూజవత పర్వతము లలో పుట్టినదని, దివ్య పక్షి చేత స్వర్గము నుండి భూలోకము నకు తీసుకు రాబడినదని ఋగ్వేదములో వర్ణించ బడింది.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

  • Anthony, David W. (2007), The Horse The Wheel And Language. How Bronze-Age Riders From the Eurasian Steppes Shaped The Modern World, Princeton University Press
  • Bakels, C.C. 2003. “The contents of ceramic vessels in the Bactria-Margiana Archaeological Complex, Turkmenistan.” in Electronic Journal of Vedic Studies, Vol. 9. Issue 1c (May 2003)
  • Beckwith, Christopher I. (2009), Empires of the Silk Road, Princeton University Press
  • Jay, Mike. Blue Tide: The Search for Soma. Autonomedia, 1999.
  • Lamborn Wilson, Peter. Ploughing the clouds:The search for Irish Soma, City Lights,1999.
  • McDonald, A. "A botanical perspective on the identity of soma (Nelumbo nucifera Gaertn.) based on scriptural and iconographic records" in Economic Botany 2004;58

మూలాలు

  1. https://en.wikipedia.org/wiki/Soma
  2. (ఋ, 9.42.1 మరియు 9.61.17)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.