సొమ్మొకడిది సోకొకడిది
సొమ్మొకడిది సోకొకడిది సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బి.రాధామనోహరి నిర్మాతగా శ్రీబాలసుబ్రహ్మణ్య ఫిలింస్ బ్యానర్‌పై వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమాకు రాజన్ - నాగేంద్రలు సంగీతం సమకూర్చారు. ఈ సినిమా 1979, జనవరి 5వ తేదీన విడుదలయ్యింది. ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశాడు.
| సొమ్మొకడిది సోకొకడిది (1979 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
| నిర్మాణం | బి.రాధామనోహరి |
| తారాగణం | కమల్ హాసన్, జయసుధ, రోజారమణి |
| సంగీతం | రాజన్ - నాగేంద్ర |
| నిర్మాణ సంస్థ | శ్రీ బాలసుబ్రహ్మణ్య ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
సాంకేతికవర్గం
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
- మాటలు: జంధ్యాల
- ఛాయాగ్రహణం: బాలుమహేంద్ర
- సంగీతం: రాజన్-నాగేంద్ర
పాటలు
- అబ్బో నేరేడుపళ్ళు అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ఆ కొండ నీడలు ఈ కన్నె వాడలు ఉన్నా వేచి ఉన్నా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల
- ఆకాశం నీ హద్దురా అవకాశం వదలద్దురా పరువాల - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా అందమైన ఆడపిల్ల చెంతచేరి - పి.సుశీల
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
