సెయింట్ మేరీ కేథడ్రాల్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద మరియు ప్రసిద్ధి చెందిన చర్చిలలో ఒకటి కడప పట్టణంలోని మరియాపురంలో కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి మీద సెయింట్ మేరీ కేథడ్రాల్ చర్చి.
ప్రత్యేకతలు
- 1992 ఫిబ్రవరి 19 వ తేదీన ఆ చర్చిని ప్రారంభించారు.
- ఈ చర్చి ఆధునిక నిర్మాణం. రాష్ట్రంలో ఇటువంటిది మరెక్కడా లేదు. ఆ రోజుల్లో నిర్మాణానికి అయిన ఖర్చు కోటి రూపాయలు.
- చర్చి పైభాగంలో రంగురంగుల గుమ్మటం ప్రకాశిస్తూ ఉంటుంది. చావు పుట్టుకల బంధంలో చిక్కుకొని దిక్కు తెలియని వారికి కాంతిరేఖ ఈ గుమ్మటం. ఈ గుమ్మటం రాత్రిపూట వెలుగులు విరజిమ్ముతూ ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
- తెల్లని పాలరాతితోను, ఆకుపచ్చ రాతితోను ఈ మందిరాన్ని నిర్మించారు.
- సువిశాల మైదానంలో అందమైన ఈ మందిరం చూచేవారికి కనువిందు చేస్తుంది.
- ప్రతిరోజూ ప్రార్థనలతో ఈ క్రైస్తవ మందిరం ప్రశాంతి కేంద్రంగా ఉంటుంది. ఆరోగ్యమాత వేడుకలు, క్రిస్మస్ వేడుకలు ఆనంద పారవశ్యాలతో సాగుతాయి.
- హిందూ, క్రైస్తవ వాస్తుశిల్ప నిపుణులచే ఈ మందిరం నిర్మించబడింది.
మూలాలు, వనరులు
వైఎస్ఆర్ జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరియు విద్వాన్ కట్టా నరసింహులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.