సూత్రధారులు
సూత్రధారులు 1990 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. గ్రామీణ నేపథ్యంలో హింసకు వ్యతిరేకంగా అల్లుకున్న కథ ఇది. అక్కినేని నాగేశ్వరరావు, మురళీ మోహన్, కైకాల సత్యనారాయణ, కె. ఆర్. విజయ, సుజాత, భానుచందర్, రమ్యకృష్ణ ప్రధాన నటులు. కె. వి. మహదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.
| సూత్రధారులు | |
|---|---|
| దర్శకత్వం | కె.విశ్వనాథ్ |
| రచన |
కె.విశ్వనాథ్ (కథ మరియు స్క్రీన్ ప్లే) ఎం. వి. ఎస్. హరనాథ రావు (సంభాషణలు) |
| నటులు |
అక్కినేని నాగేశ్వరరావు మురళీ మోహన్ కైకాల సత్యనారాయణ కె. ఆర్. విజయ భానుచందర్ సుజాత రమ్యకృష్ణ సాక్షి రంగారావు |
| సంగీతం | కె.వి. మహదేవన్ |
| ఛాయాగ్రహణం | మధు అంబట్ |
విడుదల | 4 మే 1990 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
కథ
హనుమద్దాసు, మరియు అతని బావమరిది రంగదాసు హరిదాసుల కుటుంబానికి చెందిన వారు. హనుమద్దాసు, దేవమ్మ ల కుమారుడు తిరుమల దాసు. రంగదాసు కూతురు సీతాలు. నీలకంఠం ఆ ఊరిలో ఒక కరుడు గట్టిన భూస్వామి. అదే ఊర్లో హరికథలు చెప్పే యశోదమ్మను నీలకంఠం పాడు చేస్తాడు. అది తెలుసుకున్న ఆమె భర్త ఆచార్యులు, ఆమె ముఖం చూడలేననీ ఊరు విడిచి వెళ్ళిపోమంటాడు. యశోదమ్మ తిరుమల దాసును తనతోబాటు తీసుకుని అతనికి మంచి చదువు చెప్పించడం కోసం పట్నం వచ్చేస్తుంది.
ఇరవై సంవత్సరాల తర్వాత తిరుమల దాసు కలెక్టరుగా ఆ ఊరు వస్తాడు. వస్తూనే నీలకంఠం మాటలకు వత్తాసు పలుకుతూ అతని పక్కనే చేరతాడు. సీతాలు, అతని కుటుంబ సభ్యులతో సహా ఊరందరూ అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోతారు.
పాత్రలు-పాత్రధారులు
- అక్కినేని నాగేశ్వరరావు - హనుమద్దాసు
- భానుచందర్ - తిరుమలదాసు
- కైకాల సత్యనారాయణ - నీలకంఠయ్య
- కె. ఆర్. విజయ - యశోదమ్మ
- సుజాత - దేవమ్మ
- రమ్య కృష్ణ - సీతాలు
- మురళీ మోహన్ - రంగదాసు
- అశోక్ రావు - ఆచార్యులు
- సాక్షి రంగారావు
- వంకాయల సత్యనారాయణ
- కోట శంకరరావు
- గోకిన రామారావు
- పొట్టి ప్రసాద్
- శ్రీలక్ష్మి
పాటలు
- ఆయతనవాన్ భవతీ ఏ యేవం వేదా
- గానం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శైలజ
- కలలెందుకు కథలెందుకు, తలపెందుకు తపమెందుకు
- గానం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం
- కొలిచీనందుకు నిన్ను కోదండరామా
- గానం - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- జోలజోలమ్మ జోలా జేజేల జోలా, నీలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా
- గానం - వాణీ జయరాం
- మహారాజ రాజశ్రీ మహనీయులందరికీ వందనాలు
- గానం - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- లాలేలో ఏలేలో రామాలాలొయిలాల అమ్మలాల, మూడు బురుజుల కోట ముత్యాల తోట
- గానం - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
బయటి లింకులు
- Sutradharulu film at IMDb.
- Listen to the songs of Suthradharulu at Chitramala.com
- For Sutradharulu lyrics