సుస్వాగతం (సినిమా)

సుస్వాగతం 1998లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం.[1] ఇందులో పవన్ కల్యాణ్, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రఘువరన్, సుధ తదితరులు నటించారు.[2] ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతాన్నందించాడు.

సుస్వాగతం
దర్శకత్వంభీమినేని శ్రీనివాసరావు
నిర్మాతఆర్. బి. చౌదరి
రచన
  • బాలశేఖరన్ (మూలకథ)
  • చింతపల్లి రమణ (మాటలు)
  • భీమినేని శ్రీనివాసరావు (స్క్రీన్ ప్లే)
నటులుపవన్ కళ్యాణ్, దేవయాని
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
ఛాయాగ్రహణంమహీందర్
కూర్పుగౌతంరాజు
నిర్మాణ సంస్థ
సూపర్ గుడ్ కంబైన్స్
విడుదల
జనవరి 1, 1998 (1998-01-01)
నిడివి
150 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ

గణేష్ (పవన్ కల్యాణ్) కాలేజీలో చదివే ఓ విద్యార్థి. అతని తండ్రి డాక్టర్ చంద్రశేఖర్ (రఘువరన్) తల్లి లేని పిల్లవాడని గారాబం చేస్తూనే అతని జీవితం చక్కదిద్దడానికి సున్నితంగా నచ్చజెపుతుంటాడు. గణేష్ తన కాలేజీలోనే చదివే సంధ్య (దేవయాని) అనే అమ్మాయిని నాలుగేళ్ళగా ప్రేమిస్తుంటాడు. కానీ సంధ్యకు మాత్రం చదువు తప్ప మరో లోకం ఉండదు. ఆమెకు ప్రేమలంటే నచ్చదు. గణేష్ ఎంతగా ఆమె వెంటపడినా ఆమె నుంచి స్పందన ఉండదు. దాంతో గణేష్ ప్రేమ జంటలని కలపడంలో పేరున్న కళ (సాధిక) ను కలిసి తన ప్రేమను ఆమెకు తెలిసేలా చేయమంటాడు. ఆమె కూడా సంధ్యకు గణేష్ ఆమెను ప్రేమిస్తున్న సంగతి చెబుతుంది. కానే ఆమె ప్రేమ రాహిత్యాన్ని గురించి తెలుసుకుని, ఆమెను ఒప్పించడం తనవల్ల కాదని గణేష్ కు చెబుతుంది. కానీ గణేష్ కు ఆమె మీదున్న ప్రేమను చూసి ఎలాగైనా ఒప్పించాలని అనుకుని అందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటుంది. సంధ్య తండ్రి ఇన్స్పెక్టర్ వాసుదేవరావు (ప్రకాష్ రాజ్) ఒక శాడిస్టు. తన భార్య కృష్ణవేణి (సుధ) ను ఎప్పుడూ అనుమానిస్తూ ఉంటాడు. ఆమె తన కూతురు కోసం అవన్నీ మౌనంగా భరిస్తుంటుంది.

తారాగణం

పాటలు

సుస్వాగతం
ఎస్. ఎ. రాజ్‌కుమార్ స్వరపరచిన సినిమా
విడుదల1998
నిడివి28:29
రికార్డింగ్ లేబుల్ఆదిత్య మ్యూజిక్
నిర్మాతఎస్. ఎ. రాజ్‌కుమార్
ఎస్. ఎ. రాజ్‌కుమార్ యొక్క ఆల్బమ్‌ల కాలక్రమణిక
శుభాకాంక్షలు
(1997)
సుస్వాగతం
(1998)
సూర్యవంశం
(1998)

ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.

సంఖ్య. పాటసాహిత్యంగాయకులు నిడివి
1. "ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి"  సిరివెన్నెల సీతారామ శాస్త్రిబాలు 4:46
2. "హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు"  సామవేదం షణ్ముఖ శర్మమణికిరణ్ 4:50
3. "సుస్వాగతం నవరాగమా"  సామవేదం షణ్ముఖ శర్మహరిహరన్, కె. ఎస్. చిత్ర 4:16
4. "ఫిగర్ మాట"  భువనచంద్రమనో, ఎస్. ఎ. రాజ్ కుమార్ 5:06
5. "కం కం వెల్కం పలికెను"  సామవేదం షణ్ముఖ శర్మఎస్. ఎ. రాజ్ కుమార్, అనురాధ శ్రీరామ్ 4:54
6. "ఆలయాన హారతిలో"  సిరివెన్నెల సీతారామ శాస్త్రిబాలు 4:26
మొత్తం నిడివి:
28:29

బయటి లింకులు

  1. "తెలుగు వన్. కాం లో సుస్వాగతం సినిమా పేజీ". teluguone.com. తెలుగు వన్. Retrieved 5 December 2016.
  2. "ఫిల్మీ బీట్ లో సుస్వాగతం నటీ నటుల జాబితా". filmibeat.com. ఫిల్మీ బీట్. Retrieved 5 December 2016.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.