సుమిత్ర మహాజన్
శ్రీమతి సుమిత్రా మహాజన్ లోక్‌సభ స్పీకర్ పదవిని నిర్వహిస్తున్న రెండో మహిళ. సుమిత్ర మహాజన్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పార్లమెంటరీ నియోజిక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరుపున గెలిచారు. మధ్యప్రదేశ్ నుంచి సుమిత్రా మహాజన్ ఇప్పటికి ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో జన్మించిన ఆమెను పలువురు తాయి (పెద్దక్క) అని పిలుస్తుంటారు. మదుభాషిణి అయిన ఆమె క్రమశిక్షణతో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆమె రాటుదేలారు.[1]
| సుమిత్ర మహాజన్ | |||
| పదవీ కాలము 2014 - ప్రస్తుతం | |||
| ముందు | మీరా కుమార్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గము | ఇండోర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1943 ఏప్రిల్ 12 చిప్లున్, రత్నగిరి జిల్లా | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | జయంత్ మహాజన్ | ||
| సంతానము | 2 కుమారులు | ||
| నివాసము | ఇండోర్, మధ్యప్రదేశ్ | ||
| 6 జూన్, 2014నాటికి | |||
బాల్యము
శ్రీమతి సుమిత్ర మహాజన్ తల్లి దండ్రులు శ్రీ పురుషోత్తం నీలకాంథ్ సాథే, శ్రీమతి ఉషా. వీరు 12 ఏప్రిల్, 1942 లో మహారాష్ట్రలోని చిప్లన్ జిల్లా... రత్న గిరిలో జన్మించారు.
చదువు
వీరు మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ విశ్వ విద్యాలయంలో ఎం.ఎ. ఎల్.ఎల్.బి చదివి న్యాయవాద వృత్తొ చేసారు.
కుటుంబము
వీరు 29 జనవశ్రీ 1965 లో శ్రీ జయంత్ మహాజన్ గారిని పెండ్లాడారు. వీరికి ఇద్దరు కుమారులు.
రాజకీయ ప్రస్థానం
శ్రీమతి సుమిత్ర మహాజన్ 1982 - 85 లో ఇండోర్ మునిసిపల్ కార్పోరేటర్ గా పనిచేసారు. 1984-85 లో ఇండోర్ మునిసిపల్ కార్పోరేషన్ కు డిప్యూటి మేయర్ గా పనిచేసారు. 1991 లో భారతీయ జనతా పార్టీ తరుపున లోక్ సభకు ఎన్నికై 10 వ లోక్ సభలో కూర్చున్నారు. వీరు 1992-94 లో మధ్య ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెశిడెంటగా ఉన్నారు. 1996 లో భారతీయ జనతా పార్టీ తరుపున 11 వ లోక్ సభకు తిరిగి ఎన్నికైనారు. 1999 లో 13 వ లోక్ సభకు కూడా మరళా గెలిచారు. 1999 నుండి 2002 వరకు కేంద్ర మంత్రిగాను పనిచేశారు. 2009 లో జరిగిన ఎన్నికల్లో వరుసగా 7వ సారి భారతీయ జనతా పార్టీ తరుపున గెలిచి లోక్ సభ సభ్యులయ్యారు.
మూలాలు
ఇతర లింకులు
వనరులు
- "స్పీకర్‌గా తాయి". http://namasthetelangaana.com/. namasthetelangaana. 6 June 2014. Retrieved 6 June 2014. External link in
|website=(help)