సుమలత
సుమలత అంబరీష్ (జ: ఆగష్టు 27, 1963) తెలుగు సినిమా నటి. ఈమె 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో నటించింది.
| సుమలత | |
|---|---|
![]() సుమలత | |
| జననం |
1963 ఆగస్టు 27 చెన్నై |
| ఇతర పేర్లు | సుమలత అంబరీష్ |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 1978 - ప్రస్తుతం |
| జీవిత భాగస్వామి | అంబరీష్ |
1963, ఆగష్టు 27న మద్రాసులో పుట్టి, బొంబాయి మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో పెరిగిన సుమలత గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించింది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించింది. తెలుగులో తొలిచిత్రం విజయచందర్ హీరోగా నటించి, బాపు దర్శకత్వం వహించిన 'రాజాధిరాజు'. తర్వాత కృష్ణతో సమాజానికి సవాల్ లో నటించింది.
సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి డిసెంబర్ 8, 1992 న సహ కన్నడ నటుడు అంబరీష్ను ప్రేమించి పెళ్ళి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్‌తో కలిసి ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజూనాథ, కల్లరలి హూగవి మొదలైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.
చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము బాస్లో ఈమె ఒక పాత్ర పోషించింది. గేమ్ సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో కనిపించింది.
సుమలత నటించిన తెలుగు చిత్రాలు
- పెళ్లీడు పిల్లలు (1982) - పూర్ణ
- శుభలేఖ
- ఆలయ శిఖరం
- మెరుపు దాడి (1984)
- జస్టిస్ చక్రవర్తి
- జననీ జన్మభూమి
- ఖైదీ
- అగ్నిగుండం
- జాకీ
- చట్టంతో పోరాటం
- తాండ్ర పాపారాయుడు
- వేట
- పసివాడి ప్రాణం
- అంతిమతీర్పు
- దొంగకోళ్లు
- జయమ్ము నిశ్చయమ్మురా
- శ్రుతిలయలు
- గ్యాంగ్ లీడర్
- రాజకుమారుడు
- శ్రీమంజునాధ
- బాస్
