సీర్గాళి

సీర్గాళి భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

సీర్గాళి
సీర్గాళి
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :11.11°N 79.43°E / 11.11; 79.43
ప్రదేశము
దేశము:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:తాడాళన్-త్రివిక్రమన్
ప్రధాన దేవత:మత్తళంకుళలి నాచ్చియార్, లోక నాయకి
దిశ మరియు స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:శంఖ పుష్కరిణీ, చక్రత్రీర్దము,పుష్కలా
విమానం:వర్తక విమానము
కవులు:తిరుమంగై అల్వార్
ప్రత్యక్షం:అష్టకోణ మహర్షికి

విశేషాలు

ఇచటనే తిరుమంగై ఆళ్వార్ "ఒరుకుఱళాయ్" (పె.తి.3-4) అనుదశకమును రచించింది. "తిరుజ్ఞాన సంబందర్" అను శైవకవిని మెప్పించి "చతుష్కవి శిఖామణి" అను బిరుదమును పొందింది. శ్రీ వైష్ణవ సిద్దాంత స్థాపన చేసి "తాడాళన్" పెరుమాళ్లను పున:ప్రతిష్ఠ చేసాడు. "తిరుక్కోవలూర్"లో "త్రివిక్రమన్" పెరుమాళ్ల కుడి పాదము పైకి యుండగా ఇచ్చటి పెరుమాళ్ల ఎడమ పాదము పైకి గలదు. మణవాళమాముని మంగళాశాసనం చేసిన ప్రదేశమిది.

సాహిత్యం

శ్లో. శంఖ పుష్కరిణీ చక్ర తీర్థ సుందర వైభవే|
  కాట్చీరామ పురే శ్రీమాన్ తాడాళన్నితి విశ్రుత:||

శ్లో. మరంద స్యంది కబరీ నాయకీ భాగలోలుప:|
  పుష్కలా వర్తకాఖ్యాన విమాన స్థితి శోభిత:||

శ్లో. అష్టకోణ మహర్షీణాం ప్రత్యక్ష:ప్రాగ్దిశాముఖ:|
  పరకాల వచోదివ్య సుధాప్రీతో విరాజితే||

పాశురం

పా. ఒరు కుఱళాయిరు నిలమ్‌ మూవడిమణ్ వేణ్డి
  యులగనైత్తు మీరడియా లొడుక్కి; ఒన్ఱుమ్‌
  తరగవెనా మావలియై చ్చిఱై యిల్ వైత్త
  తాడాళన్ తాళణైవీర్; తక్క కీర్తి
  యరు మఱైయిన్ తిరళ్ నాన్గుమ్‌ వేళ్వియై న్దుమ్‌
  అజ్గజ్గళవై యాఱు మిశైగళేழுమ్‌
  తెరువిల్ మలివిழா వళముమ్‌ శిఱక్కుమ్‌ కాழி
  చ్చీరామ విణ్ణగరే శేర్మినీరే.
  తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 3-4-1

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
తాడాళన్-త్రివిక్రమన్ మత్తళంకుళలి నాచ్చియార్, లోక నాయకి శంఖ పుష్కరిణీ, చక్రత్రీర్దము, పుష్కలా తూర్పు ముఖము తిరుమంగై అల్వార్ నడచున్న భంగిమ వర్తక విమానము అష్టకోణ మహర్షికి

చేరే మార్గం

శీర్గాళి పెద్ద పట్టణము. అన్ని వసతులు గలవు.

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.