సిరివెన్నెల
సిరివెన్నెల 1986లో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న తెలుగు చలన చిత్రం. భారతీయుల సంగీత కళని వెండితెరపై ప్రతిబింబించే చిత్రాలని అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్ మరియు మూగదైన చిత్రకారిణి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ మంచి ప్రజాదరణ పొందాయి. ఈ సినిమాలో అన్ని పాటలు సీతారామ శాస్త్రి రాశాడు. ఈయనకు పాటల రచయితగా ఇదే మొదటి చిత్రం. ఈ సినిమాతో చేబ్రోలు సీతారామ శాస్త్రి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిపోయాడు.
| తెలుగు సినిమా*వేదిక |
| సిరివెన్నెల (1986 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | కె . విశ్వనాథ్ |
| నిర్మాణం | ఏడిద నాగేశ్వరరావు |
| రచన | కె.విశ్వనాథ్ |
| తారాగణం | సర్వదమన్ బెనర్జీ, సుహాసిని, మున్ మున్ సేన్, మీనా, సంయుక్త |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | పూర్ణోదయా మూవీ క్రియెషన్స్ |
| విడుదల తేదీ | 1986 |
| నిడివి | 181 నిమిషాలు |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
నటవర్గం
- సర్వదమన్ బెనర్జీ - పండిత్ హరిప్రసాద్
- సుహాసిని - సుభాషిణి
- మూన్ మూన్ సేన్ - జ్యోతిర్మయి
- మీనా - కుమారి మీన
- జె.వి. రమణమూర్తి
- ఎస్.కె. మిశ్రో
- శుభ
- సాక్షి రంగారావు
- శుభలేఖ సుధాకర్
- వరలక్ష్మి
- ఈశ్వర రావు
విశేషాలు
తెలుగు సినీ జగత్తులో కళాఖండంగా నిలిచిన ఈ చిత్రం లోని పాటలన్నీ చిరకాలం గుర్తుండిపోయే స్ధాయిలో ఉంటాయి. సీతారామశాస్త్రి ఈ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి, ఈ సినిమా పేరునే ఇంటి పేరు గా నిలుపుకున్నారు. కె.వి.మహదేవన్ సంగీతంతో పాటు ప్రఖ్యాత వేణువాద విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా తన వేణునాద సహకారాన్ని అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓంకార సంబంధమున్న విధాత తలపున ప్రభవించినది... ( ఈ పాటను రాయడానికి సీతారామశాస్త్రికి వారం రోజులు పట్టింది) అనే గీతంలో సాహిత్యం పలువురి ప్రశంసలు పొందింది. ఈ సినిమాలోని ఇతర పాటలలో చందమామ రావే జాబిల్లి రావే ..., ఆది భిక్షువు వాడినేమి కోరేదీ, బూడిదిచ్చే వాడినేమి అడిగేదీ, ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు, మెరిసే తారలదే రూపం తదితర గీతాలు విశేషంగా అలరించాయి.
చిత్రీకరణ
ఈ సినిమాలో చాలాభాగం రాజస్థాన్ లో జైపూర్ లో చిత్రీకరించారు. మొదట్లో చిత్రీకరణ కోసం అక్కడకు వెళ్ళిన వారికి జైపూర్ పర్యాటక శాఖ అధికారులు కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోమన్నారు. అనుమతి కోసం అజ్మీర్ జిల్లా కలెక్టరును కలవడానికి వెళ్ళగా ఆయన శంకరాభరణం సినిమాకు అభిమాని కావడంతో విశ్వనాథ్ ని గుర్తుపట్టి సులభంగా అనుమతి ఇప్పించాడు. [1]
సంగీతం
కె.వి.మహదేవన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. ప్రముఖ వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా వేణునాద సహకారం అందించాడు.
అన్ని పాటలు రచించినవారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, చిత్రం లోని అన్నిపాటలకు సంగీతం అందించినవారు: కె.వి.మహదేవన్.
| పాటలు | ||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| సంఖ్య. | పాట | గానం | నిడివి | |||||||
| 1. | "ఆది భిక్షువు వాడినేమి కోరేదీ" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | ||||||||
| 2. | "ఈ గాలి ఈ నేల" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | ||||||||
| 3. | "చినుకు చినుకు" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | ||||||||
| 4. | "చందమామ రావే జాబిల్లి రావే" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | ||||||||
| 5. | "పాటల్లో" | ప్రకాశ రావు, పి.సుశీల | ||||||||
| 6. | "పొలిమేరు దాటిపోతున్న" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, బి. వసంత | ||||||||
| 7. | "ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలు" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | ||||||||
| 8. | "మెరిసే తారలదే రూపం" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | ||||||||
| 9. | "విధాత తలపున ప్రభవించినది" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | ||||||||
పురస్కారాలు
| సంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
|---|---|---|---|
| 1986 | సిరివెన్నెల సీతారామశాస్త్రి ("విధాత తలపునకు ప్రభవించినది" రచనకు) |
నంది ఉత్తమ గీత రచయితలు | విజేత |
| ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ("విధాత తలపునకు ప్రభవించినది" గానమునకు) |
నంది ఉత్తమ గాయకుడు | విజేత | |
| మూన్ మూన్ సేన్ | నంది ఉత్తమ సహాయనటీమణులు | విజేత | |
| ఎం. వి. రఘు[2] | నంది ఉత్తమ ఛాయాగ్రహకులు | విజేత |
వనరులు
- బి, మధులత. "ఆ పాటను ప్రత్యేకంగా చెప్పి రాయించుకున్నా". eenadu.net. ఈనాడు. Archived from the original on 10 May 2017. Retrieved 10 May 2017.
- "The saga of a lensman". The Hindu. Chennai, India. 9 June 2003.
