సిద్ధ
సిద్ధ (Siddha) అంటే सिद्ध సంస్కృతంలో పూర్తి సామర్థ్యం కలవారు అని అర్థం మరియు కచ్చితమైన మాస్టర్స్‌కు దీనిని అపాదించవచ్చు. హిందూ నమ్మకం ప్రకారం, అహంకార (ఇగో లేదా ఐ మేకర్) ను వదిలి, వారి మనసులను వారి ఆలోచనలకు తగ్గట్లుగా నిగ్రహంతో ఉంచుకునేవారు మరియు వారి శరీరాలను (ముఖ్యంగా రాజో తమా గుణాలతో) సత్వతో భిన్నమైన దేహంగా మలచుకునేవారు. సాధారణంగా ధ్యానం చేయడం ద్వారా నైపుణ్యాన్ని పొందగలుగుతారు.

జైనుల నమ్మకం ప్రకారం సిద్ధ అంటే, కర్మ బంధాలను తెంచుకుని తమ ఆత్మలను స్వేచ్ఛగా చేసుకునేవారు. సిద్ధకు ఎలాంటి శరీరం ఉండదు. ఆత్మ పూర్తి స్వచ్ఛతను కలిగి ఉండటమే సిద్ధ.
ఒకరు ఎవరైతే సిద్ధిని పొందారో, వారి గురించి పేర్కొంటూ, ఇచ్చే నిర్వచనాన్ని కూడా సిద్ధ అంటారు. ఇక్కడ సిద్ధిలు ఒక వ్యక్తికి ఉన్న పారానార్మల్ సామర్ధ్యాలను, ఎమర్జెంట్ సామర్ధ్యాలుగా గుర్తించి, దీనిని సిద్ధత్వంలో భాగంగా తీసుకోవాలి. ఇక్కడ ప్రణవ్ లేదా అవుమ్‌లో స్థిరపడిన వారిని సిద్ధగా నిర్వచించలేదు. అనగా సృష్టికి సంబంధించి ఆధ్యాత్మిక భావన పొంది ఉండటం. సిద్ధి అనేది తన పూర్తి స్వచ్ఛమైన అర్థంలో వాస్తవంలో పూర్తి అస్థిత్వాన్ని సాధించడం (బ్రహ్మాన్): స్పిరిట్ యొక్క కచ్చితత్వం.
కాశ్మీర్ శైవత్వం (హిందు తంత్ర) యొక్క హిందూ వేదాంతంలో, సిద్ధ అంటే సిద్ధ గురువు అని కూడా అర్థం. ఈయన యోగాలో శక్తిపత్ అంశాల ద్వారా ఇది సాధిస్తారు.
సిద్ధ - శైలి

జైన్‌ల తత్వం ప్రకారం, సిద్ధ శైలి అనేది విశ్వం యొక్క అగ్రభాగాన కొలువై ఉంటుంది. సిద్ధులు (అంతరించిన ఆత్మలు, తిరిగి పుట్టుక లేనివి, జీవితం మరణం అనే సైకిల్‌ను దాటిపోయినవారు) సిద్ధశైలిని దాటి, అనంతంలో స్థిరపడిపోతారు. సిద్ధ అనేది ఆత్మ యొక్క మరొక స్థాయి. అరిహంత అంటే కేవల జ్ఞానను సూచిస్తుంది. హిందూ తత్వంలో, సిద్ధలోకం అనేది సూక్ష్మమైన ప్రపంచం (లోకం ), ఇక్కడ ఉన్నవారు (సిద్ధులు) తిరిగి పుడతారు. పుట్టుకలో ఎనిమిది ప్రాథమిక సిద్ధులు ఉంటాయి.
సిద్ధాశ్రమం
హిందూ పురాణాల ప్రకారం సిద్ధాశ్రమం అనేది హిమాలయాల అంతర్భాగంలో ఉంది. ఇక్కడ గొప్ప యోగులు, సాధువులు మరియు సాగులు సిద్ధ జీవితాన్ని గడుపుతుంటారు. టిబెటిన్ల పవిత్ర భూమి శాంభాలకు ఈ ఆలోచన సమాంతరంగా ఉంటుంది.
సిద్ధాశ్రమాన్ని అనేక భారత ఇతిహాసాల్లో, పురాణాల్లో ప్రస్తావించారు. ఇందులో రామాయణ, మహాభారతాలు కూడా ఉన్నాయి. వాల్మికి రామాయణంలో, విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలోనే జీవించారని చెప్పారు. ఇది విష్ణువు యొక్క ఆవాసం. విష్ణువు వామనావతారం దాల్చినప్పుడు ఇది తెలుస్తుంది. రామ లక్ష్మణులను విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి తీసుకెళ్లి, తన మత త్యాగాలను నాశనం చేయాలని చూస్తున్న రాక్షసులను సంహరించమని కోరతారు. (28.1-20) [1][2]
సిద్ధ సంప్రదాయం
సిద్ధ అనేది ప్రస్తావనకు వచ్చినప్పుడు, 84 సిద్ధలు మరియు 9 నతాలు గుర్తుకువస్తాయి. ఇది సిద్ధల యొక్క సంప్రదాయం. అందుకే దీనికి సిద్ధ సంప్రదాయం అని పేరు వచ్చింది. సిద్ధ అనే పదం మహాసిద్ధులకు మరియు నాతాలకు కూడా వాడతారు. కాబట్టి సిద్ధ అంటే అర్థం ఒక సిద్ధి కావచ్చు, మహా సిద్ధి కావచ్చు లేదా నాత కావచ్చు. ఈ మూడు పదాలు సిద్ధ, మహాసిద్ధ మరియు నాతా అనేవి ఒకదానికి ఒకటి మార్చుతూ కూడా వినియోగించవచ్చు.
వర్న(న)రత్నాకరంలో 84లు సిద్ధులు
84 సిద్ధుల యొక్క జాబితా (ఇక్కడ కేవలం 76 మాత్రమే ప్రస్తావించబడినప్పటికీ) చేతిరాతలోనే లభించాయి. (ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ యొక్క చేతి రాత నెంబర్ 48/34లో), వీటికి తేదీ లక్ష్మణ సంవత్ 388 (1506). మెడివల్ మైథిలీ పని ప్రకారం. వర్న(న)రత్నాకరాన్ని కేవిశేఖరాచార్య జ్యోతిరిష్వర ఠాకూరా రచించారు. ఈయన మైథిలా రాజు హరిషిమ్‌హదేవ ఆస్థానంలో కవి. (1300-1321 కాలంలో). ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ జాబితాలోని పేర్లలో అనేకం నాతాలకు సంబంధించినవి ఉన్నాయి. ఇవి ఈ జాబితాతో పాటు, బుద్ధ సిద్ధాచార్యుల జాబితాలోనూ ఉన్నాయి. ఈ జాబితాలో దొరికిన పేర్ల జాబితా :[3][4]
|
|
|
|
హతయోగప్రదీపికలో సిద్ధులు
హతయోగప్రదీపిక తొలి ఉపదేశం (అధ్యాయం) లో, ఇది 15వ శతాబ్దానికి సంబంధించిన వచనం, ఇందులో కనుగొనబడిన యోగుల జాబితా ఉంటుంది. వీరు మహాసిద్ధులను నిర్వచించారు. ఈ జాబితాలో అనేక పేర్లు వర్న(న)రత్నకరలో ఉన్న పేర్లకు సమాంతరంగా ఉన్నాయి.[3][5]
|
|
|
|
సిద్ధత్వంలో తమిళనాడు సంస్కృతి
దక్షిణభారతదేశంలో సిద్ధ అంటే శారీరకంగా, ఆత్మపరంగా పూర్తి కచ్చితత్వాన్ని అత్యధిక స్థాయిలో పొందిన వ్యక్తి. దీనికి సంబంధించి పూర్తి వివరణ అంటే, సిద్ధులు శారీరకంగా అంతం అనేది లేకుండా ఉంటారని పేర్కొంటారు. కాబట్టి సిద్ధ, సిద్ధార్ లేక సిట్టార్ (తమిళనాడులో ఉపయోగించే సంస్కృత పదాలు) అంటారు. ఇది ఒక వ్యక్తి పూర్తి కచ్చితత్వం ఉన్న జీవిగా మారడానికి ఎలాంటి సాధన చేశాడో, అలాంటి సాధన వల్ల దానిని పొందాడో, అలాంటి వ్యక్తి. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఇప్పటికీ సిద్ధుల సంస్కృతిని పాటిస్తున్నారు. కొంతమంది ప్రత్యేక వ్యక్తులను సిద్ధులు (సిద్ధార్‌లు లేదా సిట్టార్‌లు) అని పిలుస్తున్నారు. వారు తమ శరీరాల్లోకి ప్రత్యేక రసాయనాలను తీసుకోవడం ద్వారా దీనిని సాధించగలుగుతున్నారని నమ్ముతున్నారు. అందుకే ధ్యానంలో మరియు ప్రాణాయామంలో వారు చాలా తక్కువసార్లు ఊపిరి తీసుకుని కూడా జీవిస్తున్నారు.
సిద్ధ వైద్యం
సిద్ధ వైద్యం అనేది, ప్రతి సందర్భంలోనూ శరీరానికి హాని కలిగించే రోగాల యొక్క మూలాలను తొలగించి వేయడం. ఈ వైద్య పద్ధతిని అనేక మంది సిద్ధులు అవలంబిస్తున్నారు. భవిష్యత్ తరాలకు ఈ వైద్యం యొక్క వివరాలను అందించడానికి దీనికి సంబంధించిన అంశాలను సిద్దార్లు గ్రంథస్తం చేస్తున్నారు. సిద్ధ వైద్యం అనేది ద్రవిడియన్లు (పూర్వకాల తమిళులు) రూపొందించారు. స్థానికంగా వీరిని సిట్టార్‌లు అని పిలుస్తారు. వీరు దీనికి వాడే మందులను ఆకులు, బెరడు, కాండం, దుంపల నుంచి తయారు చేస్తారు. కానీ ఇందులో కొన్ని జంతువులకు సంబంధించిన అంశాలు మరియు ఖనిజాలను కూడా కలుపుతారు. ఈ పద్ధతి వైద్యం ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో బాగా ప్రసిద్ధి చెంది ఉంది. బంగారం, వెండి మరియు ఇనుము యొక్క పొడి (సంస్కృత భష్మం) తదితర లోహాలను కూడా కొన్ని మందులు తయారు చేయడానికి సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఈ లోహాలు శరీరంలోని కొన్ని రోగాలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ పద్ధతిలో తరచుగా ఉపయోగించే పాదరసం విషయంలో ఈ వాదన చాలా ఎక్కువగా ఉంది. వైద్యంలో పూర్తి స్వచ్ఛమైన పాదరసాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఏదేమైనా ఇది చాలా ఎక్కువ నైపుణ్యం కలిగిన కళగా చెప్పుకోవాలి.
ఇవి కూడా చూడండి
- అగస్త్యార్
- తిరుములార్
- సిద్ధ సంప్రదాయం
- సిద్ద యోగా
- సిద్ధి
- మహాసిద్ధి
- యోగా
సూచనలు
- Vyas, R.T. (ed.) (1992). Vālmīki Rāmāyaṇa, Text as Constituted in its Critical Edition. Vadodara: Oriental Institute, Vadodara. p. 40.CS1 maint: Extra text: authors list (link)
- Hanumanta Rao, Desiraju (1998). "Valmiki Ramayana, Bala Kanda, Chapter 29". valmikiramayan.net website. Retrieved 2009-10-21.
- దాస్‌గుప్త, శశిభూషన్ (1995), అబ్‌స్కూర్ రిలీజియస్ కల్ట్స్, ఫిర్మా కె.ఎల్.ఎమ్. కలకత్తా ISBN 81-7102-020-8, pp.203ff, 204
- శాస్త్రి హరప్రసాద్ (1916, 2006 మూడో ఎడిషన్) హజర్ బచరెర్ పురానో బంగాలా భాషే బౌద్ధగాన్ ఓ దోహా (బెంగాలీలో), కోల్‌కతా: వంగియా సాహిత్య పరిషద్.
- Sinh, Pancham (tr.) (1914). "Hatha Yoga Pradipika, Chapter 1". sacred-texts.com website. Retrieved 2009-11-12.

