సింహాచలం
సింహాచలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గురించి ఇక్కడ చూడండి.
| సింహాచలం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | విశాఖపట్నం |
| మండలం | విశాఖపట్నం |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామములో మౌలిక వసతులు

- ఇక్కడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉంది.
- తపాలా కచేరి కలదు
- కొన్ని ప్రధానమైన బ్యాంకుల శాఖలు కొండ క్రిందనే ఉన్నాయి.
- సింహాచలంలో రైల్వే స్టేషను కలదు ఇది గోపాలపట్నం ప్రాంతంలో ఉంది.
గ్రామములో రాజకీయాలు
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు.
మూలాలు
ఇది విశాఖపట్నం జిల్లాలోని ఒక గ్రామము. ప్రస్తుతం విశాఖపట్నం నగరంలో ఒక భాగంగా ఉంది. నరసింహస్వామి దేవస్థానం కాకుండా కొండ క్రింద భాగంలో సుమారు 3-4 వేల జనాభా కలిగిన గ్రామం ఉంది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగంగా ఉన్నాయి.
ఊరిపేరు
సింహాచలం అనగా సింహం కలిగిన కొండ. ఈ పేరు సింహ + అచలం అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. అచలం అనగా చలనం లేనిది: కొండ లేదా పర్వతం.
గ్రామం
శ్రీనివాసనగర్, ప్రహ్లాదపురం, సాయినగర్ కాలనీ, సింహపురి కాలనీ, సింహపురి లేఔట్ మొదలైనవి ముఖ్యమైన నివాసప్రాంతాలు.