సాహిత్య అకాడమీ అనువాద బహుమతి
సాహిత్య అకాడమీ అనువాద బహుమతిని కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద రచనలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసింది. ఏటా సాహిత్య అకాడమీ గుర్తించిన 24 భాషల్లో అత్యుత్తమ అనువాదాలకు భాషకు ఒకటి చొప్పున ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.
చరిత్ర
సాహిత్య అకాడమీ అనువాద బహుమతిని 1989లో కేంద్ర సాహిత్య అకాడమీ ఏర్పాటుచేసింది. ఏర్పాటు చేసినప్పుడు(1989లో) రూ.10 వేలు అనువాద బహుమతిగా అందజేసేవారు. ఈ మొత్తాన్ని రూ.15 వేలకు 2001లో, రూ.20వేలకు 2003లో పెంచారు. ప్రస్తుతం రూ.50వేలను బహుమతి మొత్తంగా అందజేస్తున్నారు(2009 నుంచి).[1]
నిబంధనలు
అర్హతలు
ఎంపిక పద్ధతులు
తెలుగు భాషకు చెందిన అనువాద బహుమతి గ్రహీతలు
| సంవత్సరం | అనువాద పుస్తకం పేరు | అనువాద రచయిత | మూలం పేరు (భాష, సాహితీ విభాగం) | మూల రచయిత |
|---|---|---|---|---|
| 2010 | కళ్యాణి | జి. బాలాజీ | తమిళం | |
| 2009 | దళిత ఉద్యమ చరిత్ర | మందర ప్రభాకర్ | ఇంగ్లీష్ | |
| 2008 | నా దేశ యువజనులారా | వాడ్రేవు చినవీరభద్రుడు | ఇంగ్లీష్ | |
| 2007 | అంతరాలు | మంత్రిప్రెగడ శేషాబాయి | తమిళం | |
| 2006 | భావార్థ రామాయణం | విమల శర్మ | మరాఠీ | |
| 2005 | మాస్తి చిన్నకథలు | జి.ఎస్.మోహన్ | సన్న కథెగళు సం. 12-13 (కన్నడ, చిన్న కథలు) | మాస్తి వెంకటేశ అయ్యంగార్ |
| 2004 | పర్వ | గంగిశెట్టి లక్ష్మీనారాయణ | పర్వ (కన్నడ, నవల) | ఎస్.ఎల్.బైరప్ప |
| 2003 | శ్రీ దేవీభాగవతము | బేతవోలు రామబ్రహ్మం | దేవీభాగవతం (సంస్కృతం, పురాణం) | వేదవ్యాసుడు |
| 2002 | మాటన్నది జ్యోతిర్లింగం | డి.వి.సుబ్బారావు | కన్నడ 'వచనాల' సంపుటి (కన్నడ, పద్యాలు) | వివిధ రచయితలు |
| 2001 | ఆత్మ సాక్షాత్కారము | పింగళి సూర్య సుందరం | సెల్ఫ్ రియలైజేషన్ (ఇంగ్లీషు, జీవిత చరిత్ర) | బి.వి.నరసింహస్వామి |
| 2000 | ఛాయారేఖలు | ఆర్.ఎ.పద్మనాభరావు | షాడో లైన్స్ (ఇంగ్లీషు, నవల) | అమితావ్ ఘోష్ |
| 1999 | సగం వెన్నెల రాత్రి | వేమరాజు భానుమూర్తి | ఆధ్ చనాణీ రాత్ (పంజాబీ, నవల) | గుర్దయాళ్ సింగ్ |
| 1998 | మెట్టుకు పైమెట్టు | ఇలపావులూరి పాండురంగారావు | ఎనిప్పాదికళ్ (మలయాళం, నవల) | తక్కాళి శివశంకర పిళ్ళై |
| 1997 | గడచిన కాలం | బి.కె.ఈశ్వర్ | కజింజ కాలం(మలయాళం, నవల) | కె.పి.కేశవ మీనన్ |
| 1996 | కావ్య ప్రకాశము | పుల్లెల శ్రీరామచంద్రుడు | కావ్య ప్రకాశం (సంస్కృతం, వ్యాఖ్యానం) | మమ్మట |
| 1995 | తలదండం | భార్గవి పి. రావు | తలెదండ (కన్నడ, నాటకం) | గిరీష్ కర్నాడ్ |
| 1994 | అమృతం విషం | పి.ఆదేశ్వరరావు | అమృత్ ఔర్ విష్ (హిందీ, నవల) | అమృత్లాల్ నాగర్ |
| 1993 | సమయం కాని సమయం | మద్దిపట్ల సూరి | అసమయ (బెంగాలీ, నవల) | బిమల్ కార్ |
| 1992 | తమస్ | యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ | తమస్ (హిందీ, నవల) | భీషమ్ సాహనీ |
| 1991 | తిరుక్కురళ్ | సి.ఆర్.శర్మ | తిరుక్కురళ్ (తమిళం, వ్యాఖ్యానం | తిరువళ్ళువార్ |
| 1990 | గణపతి రామాయణ సుధ | చర్ల గణపతిశాస్త్రి | శ్రీమద్రామాయణం(సంస్కృతం, పురాణం) | వాల్మీకి |
| 1989 | రవీంద్రుని నాటికలు | బెజవాడ గోపాలరెడ్డి | బిదాయెర్ అభిశాప్, చిత్రాంగద, మొ.. (బెంగాలీ, నాటికలు) | రవీంద్రనాథ్ టాగోర్ |
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.