సారంగపాణి

దీకొండ సారంగపాణి తెలంగాణ ప్రముఖ తెలుగు జానపద, సినీ నేపథ్య గాయకుడు[1].

Sarangapani Deekonda
జననం సారంగపాణి
వరంగల్ జిల్లా
మరణం వరంగల్ .
నివాస ప్రాంతం సారంగపాణి
ఇతర పేర్లు దీకొండ సారంగపాణి
ప్రసిద్ధి ఓరుగల్లు ప్రముఖ,జానపద సినీ నేపథ్య గాయకుడు.
భార్య / భర్త దీకొండ సారంగపాణి
పిల్లలు ఒక అమ్మయి, ఒక అబ్బాయి రాజమహేందర్.

బాల్యం, వృత్తి జీవితం

వరంగల్ జిల్లాలో దీకొండ సారంగపాణి జన్మించారు. బాల్యమంతా హనుమకొండ లలోనే గడిచింది. ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన సానా యాదిరెడ్డి సినిమాలతో సినీ నేపథ్య గాయకుడుగా వెలుగులోకొచ్చాడు. అనంతరం జానపద సినీ నేపథ్య గాయకుడుగా సినిమాలలో సారంగపాణి అనేక పాటలు పాడారు. పిట్టల దొర రావే వయ్యరి రాస గుమ్మడి ఈ రాలుగారి పిట్టలదొర నీసరి జోడి. ప్రేమ పల్లకి సినిమాలో కొండకోన తిరిగేటి మామయ్యో నీ అండ నేనుంటాను రావయ్యో లాంటి... తెలుగు సినిమా గాయకుడు చిత్రతో సారంగపాణీ అనేక పాటలు పాడారు. దీకొండ సారంగపాణి, జానపద సినీ నేపథ్య గాయకుడైన వరంగల్ శంకర్కి సమకాలికుడు.

వివాహం

ప్రమీల సారంగపాణి సతీమణి వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు.

ప్రజాదరణ పొందిన పాటలు

దీకొండ సారంగపాణి పాటలు... ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సింగారామ తందనానే తాన... తయ్యందతయ్యం తయ్యందతయ్యం లంబాడోల్లం మేము బాబు బంజాలం ... పండు వెన్నెలే పల్లె నిండా రాలుతూ ... జానపద, సినిమా గేయాలు ఉరుతలుగించినవి[2].

మరణం

సికింద్రాబాదు రైల్ వే స్టేషన్లో ప్రమాదవ శాత్తు రైలు కింద పడి సారంగపాణి మరణించారు.

మరణాంతరం

భర్త స్నేహితులే ఆదుకున్నారు జానపద కళాకారుడిగా సారంగపాణి సంపాదించింది ఏమీ లేదు. ఆయన మరణాంతరం స్నేహితులే కుటుంబాన్ని ఆదుకున్నారు. భర్త లేని తనకు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆర్థిక సాయం అందించాడు అనీ, పిల్లలను చదివించి ప్రయోజకులను చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసింది సారంగపాణి సతీమణి ప్రమీల.[1].

ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి ఫీజులు లేకుండా చదివించారని సారంగపాణి కొడుకు రాజమహేందర్ తెలియజేశాడు.

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.