సాధారణ విద్యుత్ వలయము
సాధారణ విద్యుత్ వలయము లో సామర్థ్య జనకం, సామర్థ్య వినియోగదారు మరియు టాప్ కీ లను విద్యుత్ వాహకంతో చేయబడిన సంధానాలతో శ్రేణి సంధానం చేయబడుతుంది.

సాధారణ విద్యుత్ వలయం అమరిక
వలయంలో వివిధ భాగములు
- సామర్థ్య జనకం: బ్యాటరీ
- సామర్థ వినియోగదారు: బల్బు
- టాప్ కీ : వలయం కలుపడానికి, విడదీయటానికి వాడుతారు.
- సంధానాలు: కనెక్టర్లు (లోహపు తీగలు)
సంధానం చేయు విధానం
- బ్యాటరీ ధన టెర్మినల్ కు టాప్ కీకి జతచేయాలి.
- టాప్ కీ రెండవ టెర్మినల్ ను బల్బు యొక్క ఒక టెర్మినల్ కు కలపాలి.
- బల్బు యొక్క రెండవ టెర్మినల్ ను బ్యాటరీ యొక్క ఋణ టెర్మినల్ కు కలపాలి.
- టాప్ కీని కలిపినపుడు వలయంలో విద్యుత్ ప్రవహిస్తుంది.
యివి కూడా చూడండి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.