సహదేవుడు

సహదేవుడు మహాభారత ఇతిహాసములొ పాండవులలో ఐదవవాడు. అశ్వనీదేవతల అంశ. పాండు రాజు శాపవశాన భార్యలతో సంయోగించడానికి నిరోధింపబడినందున అతని కోరికపై, కుంతి తెలిపిన మంత్రాన్ని అనుష్టించి మాద్రి అశ్వనీదేవతలచే నకుల సహదేవులను కన్నది.


పాండవులు ఐదుగురూ ద్రౌపదిని పెండ్లాడారు. వారికి కలిగిన సంతానం ఉపపాండవులలో శ్రుతసేనుడు ద్రౌపది, సహదేవుల సంతానం. ఈ బిడ్డ కృత్తిక నక్షత్ర లగ్నంలో జన్మించాడు. (Ref: Mbh 1. 223). సహదేవుడు మద్ర రాజు ద్యుతిమతి కుమార్తె అయిన "విజయ"ను కూడా స్వయంవరంలో పెండ్లాడాడు. వారికి కలిగిన పుత్రుడు సుహోత్రుడు. (MBh.1.95). సుహోత్రుడు మగధ రాజు జరాసంధుని కుమార్తెను పెండ్లాడాడు. (జరాసంధుని కొడుకు పేరు కూడా సహదేవుడే)


ద్రోణాచార్యుని విద్యాశిక్షణలో సహదేవుడు ఖడ్గయుద్ధంలో ప్రవీణుడయ్యాడు. అజ్ఞాతవాస సమయంలో సహదేవుడు "తంత్రీపాలుడు" అనే పేరుతో విరాటరాజు కొలువులో గోపాలకునిగా చేరాడు. ఆ సమయంలో తమను వంచించిన శకునిని హతం చేస్తానని సహదేవుడు ప్రతిజ్ఞ చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు యుద్ధంలో ఈ ప్రతిజ్ఞ వెరవేర్చుకొన్నాడు.


యుధిష్ఠిరుడు రాజయినాక దక్షిణదేశ దండయాత్రకు సహదేవుని పంపాడు. రాజసూయానికి ముందు జరిగిన ఈ దండయాత్రలో కేరళ, మహిష్మతి, శూరసేన, మత్స్య, అవంతి, దక్షిణ కోసల, కిష్కింధ రాజ్యాలను సహదేవుడు జయంచాడు. సహదేవుడు బృహస్పతి వలె గొప్ప వివేకము కలవాడని, రాబోవు ఘటనలను ముందుగానే ఊహింపగలడని, కాని శాపవశాన భవిష్యత్తును ముందుగా చెప్పలేదని ప్రతీతి.

మహాభారతం - ఆంధ్ర మహాభారతం - వ్యాసుడు - కవిత్రయం

పర్వాలు

ఆది పర్వము  సభా పర్వము  వన పర్వము లేక అరణ్య పర్వము  విరాట పర్వము  ఉద్యోగ పర్వము  భీష్మ పర్వము  ద్రోణ పర్వము  కర్ణ పర్వము  శల్య పర్వము  సౌప్తిక పర్వము  స్త్రీ పర్వము  శాంతి పర్వము  అనుశాసనిక పర్వము  అశ్వమేధ పర్వము  ఆశ్రమవాస పర్వము  మౌసల పర్వము  మహాప్రస్ధానిక పర్వము  స్వర్గారోహణ పర్వము  హరివంశ పర్వము

పాత్రలు
శంతనుడు | గంగ | భీష్ముడు | సత్యవతి | చిత్రాంగదుడు | విచిత్రవీర్యుడు | అంబ | అంబాలిక | విదురుడు | ధృతరాష్ట్రుడు | గాంధారి | శకుని | సుభద్ర | పాండు రాజు | కుంతి | మాద్రి | యుధిష్ఠిరుడు | భీముడు | అర్జునుడు | నకులుడు | సహదేవుడు | దుర్యోధనుడు | దుశ్శాసనుడు | యుయుత్సుడు | దుస్సల | ద్రౌపది | హిడింబి | ఘటోత్కచుడు | ఉత్తర | ఉలూపి | బభృవాహనుడు |అభిమన్యుడు | పరీక్షిత్తు | విరాటుడు | కీచకుడు | ద్రోణుడు | అశ్వత్థామ | ఏకలవ్యుడు | కృతవర్మ | జరాసంధుడు | సాత్యకి | దుర్వాసుడు | సంజయుడు | జనమేజయుడు | వేదవ్యాసుడు | కర్ణుడు | జయద్రధుడు | శ్రీకృష్ణుడు | బలరాముడు | ద్రుపదుడు | | దృష్టద్యుమ్నుడు | శల్యుడు | శిఖండి
ఇతర విషయాలు
పాండవులు | కౌరవులు | హస్తినాపురం | ఇంద్రప్రస్థం | రాజ్యాలు | కురుక్షేత్ర యుద్ధం | భగవద్గీత


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.