సర్వదమన్ చౌలా
సర్వదమన్ చౌలా (అక్టోబరు 22 1907 - డిసెంబరు 10 1995) ఇందియన్ అమెరికన్ గణిత శాస్త్రవేత్త. ఈయన "నంబర్ థియరీ" లో ప్రసిద్ధుడు.
| సర్వదమన్ చౌలా | |
|---|---|
| జననం | 1907 అక్టోబరు 22 లండన్, ఇంగ్లాండ్ |
| మరణం | 1995 డిసెంబరు 10 (వయసు 88) Laramie, Wyoming, United States |
| రంగములు | గణిత శాస్త్రము |
| విద్యాసంస్థలు | Institute for Advanced Study University of Kansas University of Colorado at Boulder Penn State University |
| పూర్వ విద్యార్థి | Cambridge University |
| పరిశోధనా సలహాదారుడు(లు) | John Edensor Littlewood |
| డాక్టరల్ విద్యార్థులు | John Friedlander |
| ముఖ్యమైన అవార్డులు | Padma Bhushan |
ప్రారంభ జీవితం
ఈయన లండన్ లో జన్మించారు. ఈయన తండ్రి గోపాల్ చౌలా లాహోర్ లో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశారు. సర్వదమన్ చౌలా కేంబ్రిడ్జ్ లో చదువుకున్నారు. ఆయన కుటుంబం భారత దేశానికి తిరిగివచ్చింది. లాహోర్ లోని ప్రభుత్వ కళాశాలలో 1928 లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.1931 లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ ను పొందారు. ఈయన డాక్టరేట్ ను జె.ఇ.లిటిల్ ఉడ్ అధ్వర్యంలో చేశారు. [1]:594
జీవితం మరియు అవార్డులు
చౌలా భారత దేశానికి వచ్చిన తరువాత అనేక విశ్వవిద్యాలయాలలో బోధించారు. 1936 లో ప్రభుత్వకళాశాలలో గణిత శాస్త్ర అధిపతిగా ఉన్నారు.[1]:594 1947 లో భారత దేశ విభజన జరిగినపుడు ఏర్పడిన సమస్యల మూలంగా ఆయన యునైటెడ్ స్టేట్స్ కు వెళ్ళిపోయాడు.[2] అచట "ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ " సంస్థను 1949 లో దాని పతనం అయ్యే వరకు సందర్శించారు. అపుడు ఆయన లారెన్స్ లోని కనాస్ విశ్వవిద్యాలయం లో బోధించారు. ఈ సంస్థ 1952 లో కొలొరాడో విశ్వవిద్యాలయంగా మారే వరకు బోధన కొనసాగించారు.[1]:594 ఆయన 1963 లో పెన్న్ రాష్ట్రంలో పరిశోధనా ప్రొఫెసర్ గా యున్నారు. ఇచట 1976 లో తాను పదవీవిరమణ చేసే వరకు కొనసాగారు.[1]:594 ఆయన ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ లో సభ్యునిగా యుండి భారత దేశ అత్యున్నత పురస్కారం అయిన పద్మభూషణ్ ను పొందారు..[1]:595
ఆయన చేసిన వివిధ సేవలలోని ఫలితాలకు ఆయన పేరుతోనే సూచించారు. యివి బ్రుక్-చౌలా-రైసెర్ సిద్ధాంతము, అంకినీ-అర్టిన్-చౌలా సరూపత, , చౌలా-మొర్డెల్ సిద్ధాంతం, , చౌలా-సెల్‌బర్గ్ సూత్రము, మరియు చౌలా సీక్వెన్స్.
పనులు
మూలాలు
- Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
- O'Connor, John J.; Robertson, Edmund F., "సర్వదమన్ చౌలా", MacTutor History of Mathematics archive, University of St Andrews.