సరీసృపాలు
సరీసృపాలు (ఆంగ్లం: Reptiles) భూమిపై గుడ్లు పెట్టే మొట్టమొదటి నిజమైన భూచర జీవులు. ఇవి 270 మిలియన్ సంవత్సరాల క్రితం లాబిరింథోడాంట్ ఉభయచరాల నుంచి పరిణామం చెందాయి. సరీసృపాల విజ్ఞానాన్ని 'హెర్పటాలజీ' అంటారు.
| సరీసృపాలు Temporal range: కార్బోనిఫెరస్ యుగం - ప్రస్తుత కాలం | |
|---|---|
![]() | |
| A Tuatara, స్ఫీనోడాన్ పంక్టేటస్ | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ఏనిమేలియా |
| విభాగం: | కార్డేటా |
| ఉప వర్గం: | సకశేరుకాలు |
| తరగతి: | సారాప్సిడా * గుడ్రిచ్, 1916 |
| ఉపతరగతులు | |
| |
| పర్యాయపదాలు | |
| |
సాధారణ లక్షణాలు
- ఇవి మొదటి నిజ భూచరాలు. చర్మం పొడిగా ఉంటుంది. వీటికి చర్మీయ గ్రంథులు లేవు.
- దేహం పొడిగా ఉన్న బహిత్వచ స్కూట్ లు లేదా పొలుసులతో కప్పబడి ఉంటుంది.
- గోళ్ళను కలిగియున్న పంచాంగుళిక అంగాలు ఉంటాయి.
- కపాలం ఒక అనుకపాల కందాన్ని కలిగి ఒకటి లేదా ఎక్కువ శంఖఖాతాలను కలిగి ఉంటుంది.
- కింది దవడకు అర్ధభాగంలో ఆరు ఎముకలు ఉంటాయి.
- ఉరోస్థి బాగా అభివృద్ధి చెంది పర్శుకలను కలిగి ఉంటుంది.
- ఉరోమేఖలలో ఆకారపు అంతర జత్రుక ఉంటుంది. కశేరుకాలు పురోగర్తికలు.
- సమదంతాలు, ఆక్రోడాంట్ లేదా ప్లూరోడాంట్ దంతాలను కలివి ఉంటాయి.
- ఆవస్కరం మూడు భాగాలుగా విభజించి ఉంటుంది. ఇవి కోప్రాడియం, యూరోడియం, పాయుపదం.
- శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. సముద్ర తాబేళ్ళలో అవస్కర శ్వాసక్రియ కనిపిస్తుంది.
- వీటిలో మూడు గదుల గుండె ఉంటుంది.
- మూత్రపిండాలు అంత్యవృక్కాలు. విసర్జక పదార్థం యూరిక్ ఆమ్లం.
- కేంద్ర నాడీ వ్యవస్థ ఉభయచరాల కంటే బాగా అభివృద్ధి చెందింది. 12 జతల కపాల నాడులుంటాయి (సర్పాలలో 10 జతలు మాత్రమే ఉంటాయి.
- మగ జీవులలో సంపర్కావయవాలు ఉంటాయి. స్పీన్ డాన్ లో సంపర్కావయవాలు లేవు.
- చాలా జీవులు అండోత్పాదకాలు.
వర్గీకరణ
- ఉపవిభాగం 1: అనాప్సిడా
- క్రమం: కీలోనియా: ఉ. తాబేలు, టెర్రపిన్
- ఉపవిభాగం 2: ఇక్తియోప్టెరిజియా
- ఉపవిభాగం 3: సినాప్సిడా
- ఉపవిభాగం 4: సినాప్టోసారియా
- ఉపవిభాగం 5: లెపిడోసారియా
- క్రమం 1: రెంకోసిఫాలియా: ఉ. స్ఫీన్ డాన్
- క్రమం 2: స్క్వామేటా
- ఉపక్రమం 1: లాసర్టీలియా: ఉ. బల్లులు, తొండ, ఊసరవెల్లి
- ఉపక్రమం 2: ఒఫీడియా: ఉ. సర్పాలు
- ఉపవిభాగం 6: ఆర్కోసారియా
- క్రమం 1:
- క్రమం 2: క్రోకడీలియా: ఉ. మొసళ్ళు, ఆలిగేటర్లు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.







