సప్తవాయువులు
కశ్యపుడు, దితిల సంతానమైన సప్త మరుత్తులు లేదా సప్తమారుతములు లేదా సప్త వాయువులు వివిధ మండలములలో వ్యాపించిన వాయువులకు అధిపతులుగా భగవంతుడు నియమించెనని పురాణ గాథ. ఈ 7 వాయువులు:
- ఆహవ వాయువు: మేఘ మండలమునకు, భూమండలమునకు మధ్య ప్రసరించునది.
- ప్రవహ వాయువు: సూర్య మండలమునకు, మేఘ మండలమునకు మధ్య ప్రసరించునది.
- అనువహ వాయువు: చంద్ర మండలమునకు, సూర్య మండలమునకు మధ్య ప్రసరించునది.
- సంవహ వాయువు: నక్షత్ర మండలమునకు, చంద్ర మండలమునకు మధ్య ప్రసరించునది.
- వివహ వాయువు: గ్రహ్ర మండలమునకు, నక్షత్ర మండలమునకు మధ్య ప్రసరించునది.
- పరావహ వాయువు: సప్తర్షి మండలమునకు, గ్రహ మండలమునకు మధ్య ప్రసరించునది.
- పరివహ వాయువు: ధ్రువ మండలమునకు, సప్తర్షి మండలమునకు మధ్య ప్రసరించునది.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.