సప్తగిరి (పత్రిక)
సప్తగిరి తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక. ఈ పత్రిక డిసెంబరు 1, 1965 సంవత్సరం నుండి తిరుపతి పట్టణంలో ముద్రించబడుతున్నది.[1]

2006 సప్తగిరి పత్రిక ముఖచిత్రం.
శీర్షికలు
- ధారావాహికలు : ప్రస్తుతం ఉషశ్రీ రచించిన భారతం మరియు తిరుమల ఆలయం గురించి విశేషాలను తెలియజేస్తున్నారు.
- బాల ప్రబోధం : ఇందులో పిల్లలు అలవరచుకోవలసిన సద్గుణాలను, వారిని ఉత్తేజపరిచే పురాణ పురుషుల చరిత్రల గురించి వ్యాసాలు వస్తాయి.
- మన దేవాలయాలు : ఇందులో ప్రాచీనమైన హిందూ దేవాలయాలు గురించి స్థల పురాణం మొదలైన చారిత్రాత్మక విషయాలు తెలియజేస్తారు.
- శ్రీ వేంకటేశ్వర లీలలు : ఇందులో కొందరు భక్తుల స్వంత అనుభవాలను తెలియజేస్తారు.
ప్రత్యేక సంచికలు
- మాతల్లి గోదావరి - శ్రీ సుభాను సంవత్సర పుష్కర ప్రత్యేక సంచిక - 2003.
- కృష్ణవేణి తరంగాలు - శ్రీ తారణ సంవత్సర పుష్కర ప్రత్యెక సంచిక - 2004.
మూలాలు
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
