సత్యనారాయణ వ్రతము

సత్యనారాయణ వ్రతము, అన్నవరం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ విధానము. ఈ వ్రతమును హిందూ వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యముగా ఉండును, విద్యార్థులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం లభించును.

శ్రీసత్యనారాయణస్వామి పూజ

వ్రత ప్రాశస్త్యము

కలియుగమున లోక సంచారము చేసిన నారదుడు, లోకుల బాధలు చూడలేక మహావిష్ణువును ప్రార్థించగా స్వామి వారు ఇటుల తెలిపెను.

కలియుగమున నేను సత్యనారాయణ రూపం ధరించితిని, కావున శ్రీ సత్యనారాయణ వ్రతము చేసినవారికి శోకథుఃఖములు తొలగి ధనధాన్యాభివృద్ది చెంది సంతానసౌభాగ్యాలు కలిగి సర్వత్రా విజయము లభించి కోరిన కోరికలు తీరును.

అంతట వ్రత విధానమును తెలుసుకొనిన నారదుడు సూతునికి చెప్పగా సూతుడు శౌనకాది మహామునులకు తెలిపెను.

వ్రత సామాగ్రి

వ్రత విధానము

" దేవాలయే నదీతీరే గోశ్చే బృందావనే తధా

యత్పరిష్యతి తత్సర్వం అనంత ఫలదం భవేత్ "

  • దేవాలాయమున, నదీతీరమున, గోశాలలో, తులసీవనమున చేసిన వ్రతాలు అనంతఫలాన్నిస్తాయి అని చెప్పబడింది.
  • కింద చెప్పిన వ్రత సామాగ్రి సమకూర్చుకున్న తరువాత, తెల్లని గుడ్డను నేలపై పరచి, అందు బియ్యం పోసి, మధ్యన మామిడి ఆకులు మరియు కొబ్బరితో కూడిన కలశమునుకు రవికెల గుడ్డను చుట్టి మద్యమున ఉంచవలెను.
  • పసుపుతో వినాయకుని సిద్దము చేసుకుని తమలపాకులనందు ఉంచి, బియ్యమునందు తూర్పుదిక్కుగా ఉంచవలెను.
  • వినాయకపూజ నంతరము తమలపాకుపై బియ్యము పోసి సత్యనారాయణుని బంగారు,వెండి,రాగి లాంటి లోహ విగ్రహాలలో ఏదైనా పెట్టి చుట్టూ మూడు లేక ఐదు కొబ్బరి కాయలను వక్కలు,పూలు,అక్షతలతో కలపి నవగ్రహ మండపముపై పెట్టవలెను.అష్టదిక్పాలకులను, సకల దేవతలను ఆవాహణ చేసి చివరగా సత్యనారాయణ స్వామిని ఆవాహణ చెయ్యవలెను.
  • పిమ్మట సత్యనారాయణ స్వామి పూజను చేసి కథా కాలక్షేపము చెయ్యవలెను.
శ్రీసత్యనారాయణస్వామి పూజ

వ్రత కథలు

వ్రత కథ మొత్తము ఐదుభాగములుగా ఉండును. ప్రతీ కథానంతమున నారికేళసమర్పణ ఆచారము.

మొదటి వ్రత కథ

ఒకానొక సమయమున నైమిశారణ్యమునకు విచ్చేసిన సూత మహర్షిని శౌనకాది మునులు ఇటుల అడిగినారు "మహానుభావా.. దేని చేత మనుషులు తమ కోరికలననుభవించి, మోక్షమును పొందగలరు?" అందులకు సూత మహర్షి

శ్రీ సత్యనారయాణవ్రతమే సకల ధు:ఖ నివారిణి,ఈ వ్రతమును ఏ రోజునైనను చేసి, వ్రతానంతరము తీర్ధప్రసాదాలు పుచ్చుకొనవలెను. ఈ వ్రతము చేసిన వారు మోక్షమును పొందెదరని మహావిష్ణువు నారదునకు తెలిపెను.

కనుక జనులారా, సత్యనారాయణ వ్రతము చేసినచో మీ కోరికలు తీరునని సూత మహర్షి తెలిపెను. ఇది మొదటి వ్రత కథ.

రెండవ వ్రత కథ

కాశీ పట్టణమందు ఒక బీద బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణునికి ఒక రోజు ఏమీ భిక్ష లభించక విచారముగా నుండును,శ్రీ సత్యనారాయణ స్వామి వారు అతనిని చూచి జలిపడి ఒక ముసలి బ్రాహ్మణవేషములో వచ్చి నాయనా నీ బాధ ఏమి అడిగాడు. అంతట ఆ ముసలి బ్రాహ్మణుడు, సత్యనారాయణవ్రత విశేషము తెలిపి అదృశ్యుడాయెను. అంతట బీద బ్రాహ్మణుడు రేపే ఈ వ్రతము చేసెదనని నిశ్చయించుకున్నవాడై మరుసటి దినమున నిత్యకాలకృత్యములు నెరవేర్చుకుని "స్వామీ! ఈ రోజు లభించిన బిక్షతో నీ వ్రతము చేసెదను" అని పలికి భిక్షాటనకు బయలుదేరెను. ఆనాటి వేళావిషయమున అతనికి విశేషమైన భిక్ష లభించెను. పిమ్మట లభించిన భిక్షతో ఆ బ్రాహ్మణుడు వ్రతము చేసెను. వ్రతమహిమ వలన సమస్తసంపదలు కలిగినవి. అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు ప్రతీ మాసము సత్యనారాయణస్వామి వ్రతము చేసెను. ఆ బ్రాహ్మణుడు ఒకానొక ఏకాదశినాడు వ్రతము చేయుచుండగా కట్టెలమ్ముకొనువాడు వచ్చి వ్రతమంతయూ చూచి వ్రత మహిమ తెలుసుకొన్న వాడై, తను కూడా తరువతి దినమునాడు వ్రతము చేసెదనని పలికెను. తరువాతిదినమున, కట్టెలమ్మగా మిక్కిలి విశేషముగా ధనము లభించింది.ఆ ధనముతో ఆ నాడు వ్రతము చేసినవాడై అనతికాలమునందు ధనవంతుడయ్యెను. సత్యనారాయాణ వ్రత విశేషము వల్ల బ్రాహ్మణుడు మరియు కట్టెలమ్ముకొనువాడు కోరికలు తీరి మోక్షమునొందినారు. ఇది రెండవ వ్రత కథ.

మూడవ వ్రతకథ

నాల్గవ వ్రతకథ

ఐదవ వ్రతకథ

ఇవి కూడా చూడండి

మూలాలు

    ఇతర లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.