సంతరావూరు
సంతరావూరు, ప్రకాశం జిల్లా, చినగంజాము మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523185., ఎస్.టి.డి.కోడ్ = 08594.
| సంతరావూరు | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() సంతరావూరు |
|
| అక్షాంశరేఖాంశాలు: 15.804918°N 80.258616°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| మండలం | చినగంజాము |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 3,920 |
| - పురుషుల సంఖ్య | 1,896 |
| - స్త్రీల సంఖ్య | 2,024 |
| - గృహాల సంఖ్య | 1,090 |
| పిన్ కోడ్ | 523185 |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామం పేరు వెనుక చరిత్ర
ఒకప్పుడు ఊరి పేరు రావూరు మాత్రమే. అయితే ఊరి చివరన ఉన్న "బకింగ్ హాం" కాలువలో ఇతర ప్రాంతాల నుంచి వారానికి ఒక రోజు సరుకులు వచ్చేవి. అల వచ్చే సరుకులను విక్రయించేవారు.అలా వారానికి ఒక రోజు సంత జరిగేది.. కాలక్రమేణా రావూరు సంతరావూరు అయ్యింది.
సమీప గ్రామాలు
- కడవకుదురు 3.4 కి.మీ
- పందిల్లపల్లి 3.6 కి.మీ
- గొనసపూడి 4 కి.మీ
- పుల్లరిపాలెం 6.3 కి.మీ
- వేటపాలెం 6.6 కి.మీ.
సమీప మండలాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాల
గ్రామంలో రవాణా సౌకర్యాలు
అన్ని సమీప పట్టణాలకు, గ్రామాలకు బస్సు సౌకర్యం ఉన్నది.
గ్రామములో మౌలిక వసతులు
బ్యాంకులు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ కనకనాగ వరపమ్మ అమ్మవారి ఆలయం
ఈ ఆలయం వేటపాలెం మండలంలోని రావూరిపేట గ్రామంలో ఉన్నది. అమ్మవారికి సంతరావూరు పుట్టినిల్లు, రావూరిపేట మెట్టినిల్లు. అమ్మవారి శిడిమానోత్సవం ప్రతి సంవత్సరం, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమికి, ఒక వారం రోజులు నిర్వహించెదరు. సంతరావూరులో ఐదురోజులు, రావూరిపేట గ్రామంలోని ఆలయంలో, మూడు రోజులు నిర్వహించుచున్నారు. ఈ ఏడాది, 2014,జూన్-12 గురువారం నాడు ఈ ఉత్సవాలు నిర్వహించుచున్నారు. ఈ క్రతువు తిలకించేటందుకు, స్థానికులే గాక, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. రైలులో వచ్చేవారు, ఒంగోలు స్టేషనులో దిగి, అక్కడనుండి ఆటోలలో ఆలయానికి చేరుకోవచ్చు. బస్సులో వచ్చేవారు, రామన్నపేటలో దిగి, ఆలయానికి చేరుకోవచ్చు. [2]
రామలింగేశ్వర ఆలయం
శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర ఆలయం లో గంటకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ గంట ఒక సారి కొడితే 108 సార్లు మ్రోగుతుంది. ఇలా కేవలం కాశీ లోనూ , సంతరావూరు లోని శివాలయం లో మాత్రమే జరుగుతుంది. కాశీ లో గంట తయారుచేసిన వ్యక్తే సంతరావూరు గుడి లోని గంట కూడా తయారు చేసారు. ఈ ఆలయాన్ని చోళ రాజు నిర్మించారు. ఈ ఆలయంలో రెండు నందులు ఉండటం మరో ప్రత్యేకత. [2]
ఇతర ప్రార్ధనా స్థలాలు
- చర్చి
- వెంకటేశ్వర స్వామి పాదుకలు
- కన్యకాపరమేశ్వరి ఆలయం
- వీరభద్ర స్వామి ఆలయం
- పోతురాజు,అమ్మవారి ఆలయం
గ్రామజనాబా
2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3920 .ఇందులో పురుషుల సంఖ్య 1,896, మహిళల సంఖ్య 2,024
- 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు 343 (మొత్తం జనాభాలో 8.75% )
- స్త్రీ-పురుష నిష్పత్తి 1068. ఇది ఆంధ్రపదేశ్ రాష్ట్ర నిష్పత్తి(993) కన్నా ఎక్కువ.
- 70.11% అక్షరాస్యత తో ఆంధ్రప్రదేశ్ సగటు కన్నా ఎక్కువ ఉన్నది.
- పురుషుల అక్షరాస్యతా శాతం :78.55 %
- స్త్రీలు అక్షరాస్యతా శాతం : 62.21%
- సంతరావూరు గ్రామంలో ఎస్సీలు 46.73% , ఎస్టీలు 3.55% ఉన్నారు.
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
- తోటకూర వెంకటనారాయణ , ప్రిన్సిపాల్, చుండి రంగనాయకులు కళాశాల, చిలకలూరిపేట.
వీరు వ్రాసిన గ్రంధాలు:- 1.పితృదేవోభవ(2005),2.గుర్తుకొస్తున్నాయి(2006),3.స్మైలీ (2008),4.స్వాతంత్ర్యంకోసం (2009)
గణాంకాలు
2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3920 .[3] ఇందులో పురుషుల సంఖ్య 1,896, మహిళల సంఖ్య 2,024, గ్రామంలో నివాస గృహాలు 1,078 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,136 హెక్టారులు.
