సంజీవ్ కుమార్
సంజీవ్ కుమార్ (జన్మ నామం: హరిహర్ జెఠాలాల్ జరీవాలా 9 జూలై 1938 – 6 నవంబర్ 1985) ఒక పేరుపొందిన భారతీయ చలనచిత్ర నటుడు. ఇతడు అనేక అవార్డులను గెలుచుకున్నాడు. వాటిలోఉత్తమ నటుడిగా రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉన్నాయి. ఇతడు సినిమాలలో విభిన్నమైన పాత్రలను ధరించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు.
| సంజీవ్ కుమార్ संजीव कुमार | |
|---|---|
![]() తపాలా బిళ్ళపై సంజీవ్ కుమార్ | |
| జననం | హరిహర్ జెఠాలాల్ జరీవాలా[1] 1938 జూలై 9 సూరత్, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
| మరణం | 1985 నవంబరు 6 (వయసు 47) ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం |
| మరణానికి కారణం | గుండెపోటు |
| ఇతర పేర్లు | హరిభాయ్ |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 1960–1985 |
ప్రారంభ జీవితం మరియు నేపథ్యం
సంజీవ్ కుమార్ అసలు పేరు హరిహర్ జెఠాలాల్ జరీవాలా (హరిభాయ్ అని కూడా వ్యవహరించబడేవాడు)[1][2] ఇతడు గుజరాత్ లోని సూరత్ లో ఒక గుజరాతీ పటేల్ కుటుంబంలో జన్మించాడు. ఇతని బాల్యం సూరత్‌లో గడచింది. తరువాత ఇతని కుటుంబం ముంబాయికి తరలి వెళ్ళింది. అక్కడ ఒక ఫిలిం స్కూలులో సంజీవ్ కుమార్ శిక్షణ పొందాడు. తద్వారా బాలీవుడ్‌లో నటుడిగా స్థిరపడ్డాడు. ఇతని ఇరువులు సోదరులు ఒక సోదరి ఉన్నారు.
సినిమారంగం
ఇతడు తన నట జీవితాన్ని నాటకరంగం ద్వారా ప్రారంభించాడు. మొదట ఇతడు ముంబాయిలోని "ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్(IPTA)", పిమ్మట "ఇండియన్ నేషనల్ థియేటర్" సంస్థల నాటకాలలో వేషాలు వేశాడు.[2] రంగస్థల నటుడిగా ఇతడు 22 ఏళ్ల వయసులో ముసలి వేషాలు వేసేవాడు.
ఇతని సినిమా ప్రస్థానం 1960లో హమ్ హిందుస్తానీ అనే సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా ఆరంభమైంది. 1965లో నిశాన్ అనే సినిమా ద్వారా కథా నాయకుడి వేషాలు వేయడం మొదలు పెట్టాడు. 1968లో సంఘర్ష్ సినిమాలో ప్రముఖ నటుడు దిలీప్ కుమార్‌తో కలిసి నటించాడు. ఇతడు హిందీ సినిమాలలోనే కాక మారాఠీ, తెలుగు, పంజాబీ, సింధీ, తమిళ, గుజరాతీ సినిమాలలో కూడా నటించాడు. ఇతడు గుల్జార్, ఎ.కె.హంగల్, హృషీకేశ్ ముఖర్జీ, యశ్ చోప్రా, సుభాష్ ఘాయ్, సత్యజిత్ రే మొదలైన దర్శకులతో పనిచేశాడు. అరుణా ఇరానీ, జయ బాధురి, ఎల్.విజయలక్ష్మి,రాఖీ, లీనా చంద్రావర్కర్, సులక్షణా పండిట్, మౌసమీ చటర్జీ, యోగీతా బాలీ, అపర్ణా సేన్, షర్మిలా ఠాగూర్ మొదలైన నటీమణుల సరసన నటించాడు. ఇతడు నటించిన షోలే చిత్రంలో ఠాకూర్ పాత్ర ఇతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. నయాదిన్ నయీరాత్ సినిమాలో తొమ్మిది పాత్రలను ధరించాడు. ఈ పాత్రలను తమిళం (నవరాత్రి)లో శివాజీ గణేశన్, తెలుగు(నవరాత్రి)లో అక్కినేని నాగేశ్వరరావు పోషించారు.
వ్యక్తిగత జీవితం
ఇతడు జీవితాంతం అవివాహితుడిగానే ఉండిపోయాడు. ఇతడు హేమా మాలినితో 1973 నుండి సన్నిహితంగా మెలిగాడు. తరువాత నటి సులక్షణ పండిట్‌తో సంబంధం నెరిపాడు కానీ ఇరువురూ అవివాహితులుగానే మిగిలిపోయారు.[3] సంజీవ్ కుమార్ సులక్షణా పండిట్‌ను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆమె అవివాహితగానే ఉండి పోయింది. ఇతనికి సినిమా పరిశ్రమలో రాజేష్ ఖన్నా, శశికపూర్, షర్మిలా టాగూర్, తనూజ, దేవేన్ వర్మ, శివాజీ గణేశన్, బి.నాగిరెడ్డి, సారిక మొదలైన వారితో సన్నిహితమైన స్నేహ భాంధవ్యాలున్నాయి.
ఆరోగ్య సమస్యలు, మరణం
ఇతడికి పుట్టుకతోనే గుండె సంబంధమైన లోపంతో జన్మించాడు. ఇతని కుటుంబ సభ్యులలో ఎక్కువమంది 50 ఏళ్లకు మించి బ్రతుకలేదు. ఇతనికి 1979లో తొలిసారి గుండెపోటు వచ్చింది. అప్పుడు అమెరికాలో బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. అయినా 1985, నవంబర్ 6న 47వ యేట తీవ్రమైన గుండెపోటు వచ్చి మరణానికి దారితీసింది.ఇతని తమ్ముడు నికుల్ ఇతని కంటే ముందు మరణించాడు. మరొక సోదరుడు కిశోర్ ఇతని తరువాత 6 నెలలకు గతించాడు.[1][4] ఇతడు సినిమాలలో అనేక వృద్ధపాత్రలను పోషించినప్పటికీ నిజజీవితంలో 50 యేళ్లు కూడా బ్రతకలేక పోవడం విషాదకరమైన విషయం. ఇతడు నటించిన సుమారు పది సినిమాలు ఇతడి మరణానంతరం విడుదలయ్యాయి. 1993లో విడుదలైన ప్రొఫెసర్ కి పడోసన్ ఇతడు నటించిన ఆఖరి సినిమా.
అవార్డులు
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం – విజేత
1971 దస్తక్ – హమీద్[5]
1973 కోషిష్ – హరిచరణ్[5]
ఫిలింఫేర్ అవార్డులు
ఇతడు 11 మార్లు ఉత్తమ నటుడిగా, మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా మొత్తం 14 పర్యాయాలు ఫిలింఫేర్ పురస్కారానికి ప్రతిపాదించబడ్డాడు,[6] వాటిలో రెండు సార్లు ఉత్తమ నటుడిగా ఒకసారి ఉత్తమ సహాయనటునిగా ఎంపిక కాబడ్డాడు. వివరాలు:
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – విజేత
1976 ఆంధి – జె.కె.
1977 అర్జున్ పండిట్ – అర్జున్ పండిట్
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ సహాయనటుడు – విజేత
1969 షికార్ – ఇన్‌స్పెక్టర్ రాయ్
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన
1971 ఖిలోనా – విజయ్ కమల్ ఎస్.సింగ్
1974 కోషిష్ – హరిచరణ్ మాథుర్
1976 షోలే – ఠాకూర్ బలదేవ్ సింగ్
1977 మౌసమ్ – డా.అమర్‌నాథ్ గిల్
1978 యేహీ హై జిందగీ – ఆనంద్ నారాయణ్
1978 జిందగీ – రఘు శుక్లా
1979 దేవత – టోనీ/తరుణ్ కుమార్ గుప్తా
1979 పతి పత్ని ఔర్ వో – రంజీత్ ఛద్దా
1983 అంగూర్ – అశోక్ ఆర్.తిలక్
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ సహాయనటుడు – ప్రతిపాదన
1979 త్రిశూల్ – రాజ్ కుమార్/ఆర్.కె.గుప్త
1983 విధాత – అబూ బాబా
ఇతర అవార్డులు
- 1974 - కోషిష్ చిత్రానికి ఉత్తమ నటుడిగా బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ (BFJA) అవార్డు.[7][8]
- 1969 - నావల్ స్టార్స్ అవార్డ్, ఎస్.ఎం.నందా చేత షానూ వరుణ్ ట్రోఫీ
- 1975 - సినీగోయర్స్ కౌన్సిల్ (ఢిల్లీ) ఫిలిం అవార్డు
- 1976 - మౌసమ్ చిత్రానికి లయన్స్ క్లబ్ ఆఫ్ నార్త్ కలకత్తా వారిచే యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.
- ఉత్తర్ ప్రదేశ్ ఫిలిం పత్రకార సంఘ్ అవార్డు
- కళాశ్రీ ఆర్ట్ & నెట్‌వర్క్ జీవన సాఫల్య మిలీనియం 2000 అవార్డ్
- 18వ జాతీయ భరత్ పురస్కారం
- ఆంధ్రప్రదేశ్ ఫిలిం జర్నలిస్ట్ అవార్డ్
ఫిల్మోగ్రఫీ
| సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | వివరణ |
|---|---|---|---|
| 1993 | ప్రొఫెసర్ కి పడోసన్ | ప్రొఫెసర్ విద్యాధర్ | మరణానంతరం విడుదలైనది |
| 1989 | ఊంఛ్ నీచ్ బీచ్ | ||
| 1988 | నా ముంకిన్ | ||
| 1988 | దో వక్త్ కీ రోటీ | ||
| 1987 | రాహీ | డా.ప్రభాత్ కుమార్ | |
| 1986 | లవ్ అండ్ గాడ్ | కైస్ -ఇ - అమిర్ (మజ్ను) | మరణానంతరం విడుదలైంది |
| 1986 | కాంచ్ కీ దీవార్ | ||
| 1986 | బాత్ బన్ జాయే | సూరజ్ సింగ్ | |
| 1986 | హాథోఁ కీ లఖీరేఁ | డాక్టర్ సాబ్ | |
| 1986 | కత్ల్ | రాకేష్ | |
| 1985 | రామ్ తేరే కిత్నే నామ్ | రామ్ కుమార్ (పేటూ రామ్) | శివాజీ గణేశన్ నటించిన "రామన్ ఎథనై రామనది" తమిళ సినిమా రీమేక్ |
| 1985 | జబర్దస్త్ | రతన్ కుమార్ | |
| 1984 | బద్ ఔర్ బద్నామ్ | ||
| 1984 | లాఖోఁ కీ బాత్ | అడ్వకేట్ ప్రేమ్ సాగర్ | |
| 1984 | పాఖండి | ||
| 1984 | యాద్‌గార్ | రాయ్ కల్పనాథ్ రాయ్ | |
| 1983 | హీరో | దామోదర్ మాథుర్ | |
| 1982 | సురాగ్ | ||
| 1982 | హాథ్‌కడీ | హరిమోహన్/సాకియా/గోపాల్ దాస్ మిత్తల్ | |
| 1982 | అంగూర్ | అశోక్, ద్విపాత్రాభినయం | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన |
| 1982 | ఆయాస్ | ఠాకూర్ జస్వంత్ సింగ్ | |
| 1982 | ఖుద్‌దార్ | హరి శ్రీవాత్సవ్ | |
| 1982 | లోగ్ క్యా కహెంగే | ||
| 1982 | నమ్‌కీన్ | గెరూలాల్ | |
| 1982 | సవాల్ | ||
| 1982 | శ్రీమాన్ శ్రీమతి | శంకర్ లాల్ | తాయారమ్మ బంగారయ్య రీమేక్ |
| 1982 | సింధూర్ బనే జ్వాలా | ||
| 1982 | విధాత | అబూ బాబా | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ సహాయనటుడు – ప్రతిపాదన |
| 1981 | సిల్‌సిలా | డా.వి.కె.ఆనంద్ | |
| 1981 | దాసి | ఆనంద్ | |
| 1981 | ఇత్నిసీ బాత్ | రాజా | |
| 1981 | బీవీ ఓ బీవీ | కల్నల్ మంగళ్ సింగ్/శంకర్ | |
| 1981 | చెహ్రే పే చెహ్రా | డా.విల్సన్/బ్లాక్ స్టోన్ | |
| 1981 | లేడీస్ టైలర్ | ||
| 1981 | వక్త్‌కీ దీవార్ | విక్రమ్ | |
| 1980 | హమ్ పాంచ్ | కృష్ణ | పడువారళ్ళి పాండవరు రీమేక్ |
| 1980 | అబ్దుల్లా | ||
| 1980 | బే రెహమ్ | ||
| 1980 | ఫౌజీ చాచా | ఫౌజీ చాచా | పంజాబీ సినిమా |
| 1980 | జ్యోతి బనే జ్వాలా | అతిథి పాత్ర | |
| 1980 | పత్తర్ సే టక్కర్ | ||
| 1980 | స్వయంవర్ | రామ్ | గుండమ్మ కథ సినిమాకు రీమేక్ |
| 1980 | టక్కర్ | సూరజ్/కిషన్ | దేవుడు చేసిన మనుషులు రీమేక్ |
| 1979 | కాలా పత్తర్ | డా.రమేష్ | |
| 1979 | గృహ ప్రవేశ్ | అమర్ | |
| 1979 | బాంబే బై నైట్ | ||
| 1979 | ఘర్ కీ లాజ్ | ||
| 1979 | హమారే తుమ్హారే | జైరాజ్ వర్మ | |
| 1979 | జానీ దుష్మన్ | ఠాకూర్ | |
| 1979 | మాన్ అపమాన్ | శంకర్ | |
| 1979 | నౌకర్ | అమర్ | |
| 1978 | దేవతా | టోనీ/తరుణ్ కుమార్ | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన. శివాజీ గణేశన్ నటించిన "జ్ఞాన ఓలి" తమిళ సినిమా రీమేక్ |
| 1978 | ముఖద్దర్ | ||
| 1978 | పతి పత్ని ఔర్ వో | రంజీత్ చద్దా | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన |
| 1978 | సావన్ కే గీత్ | ||
| 1978 | స్వర్గ్ నరక్ | పండిట్ సోహన్ లాల్ త్రిపాఠీ | |
| 1978 | త్రిశూల్ | రాజ్ కుమార్ గుప్తా/ఆర్.కె.గుప్తా | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ సహాయనటుడు – ప్రతిపాదన |
| 1978 | తుమ్హారే లియే | ప్రకాష్/గంగాధర్ ఉపాధ్యాయ్ | |
| 1977 | ఉయంధవర్కల్ | సంజీవ్ కుమార్ | తమిళ సినిమా అతిథి పాత్ర |
| 1977 | ముక్తి | రతన్ | |
| 1977 | షత్రంజ్ కే ఖిలాడీ | మీర్జా సజ్జాద్ అలి | |
| 1977 | యేహీ హై జిందగీ | ఆనంద్ నారాయణ్ | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన. "కలియుగ కణ్ణన్" తమిళ సినిమా రీమేక్. |
| 1977 | ఇమాన్ ధరమ్ | కబీర్ దాస్ | |
| 1977 | ఆలాప్ | రాజా బహద్దూర్ | అతిథి పాత్ర |
| 1977 | అంగారే | రాకేష్ | |
| 1977 | అప్నాపన్ | రాజన్ రస్పాల్ సింగ్ | |
| 1977 | ధూప్ ఛావో | డా.పరాశ్ | |
| 1977 | దిల్ ఔర్ పత్తర్ | ||
| 1977 | పాపి | అశోక్ రాయ్ | |
| 1977 | విశ్వాస్‌ఘాత్ | మహేష్/రాజు | |
| 1976 | జిందగీ | రఘు శుక్లా | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన |
| 1976 | అర్జున్ పండిట్ | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు | |
| 1976 | దో లడికియా | ||
| 1975 | మౌసమ్ | డా.అమర్‌నాథ్ గిల్ | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన |
| 1975 | ఫరార్ | ఇన్‌స్పెక్టర్ సంజయ్ | |
| 1975 | షోలే | ఠాకూర్ బలదేవ్ సింగ్ | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు - ప్రతిపాదన |
| 1975 | ఆక్రమణ్ | మేజర్ అజయ్ వర్మ | |
| 1975 | ఆంధి | జె.కె. | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు |
| 1975 | అప్నే దుష్మన్ | డాక్టర్ | |
| 1975 | అప్నే రంగ్ హజార్ | సునీల్ | |
| 1975 | ధోతీ లోటా ఔర్ చౌపట్టీ | ఇన్‌స్పెక్టర్ వాగ్లే | |
| 1975 | ఉల్జాన్ | ఆనంద్ | |
| 1974 | ఊర్వశి | తెలుగు సినిమా | |
| 1974 | కుఁవారా బాప్ | డాక్టర్ | |
| 1974 | ఆప్ కీ కనమ్ | మోహన్ | |
| 1974 | అర్చన | ప్రకాష్ | |
| 1974 | చరిత్రహీన్ | ఇంద్రజీత్ ముఖర్జీ | |
| 1974 | చౌకీదార్ | డా.శ్యామ్ | |
| 1974 | దావత్ | ||
| 1974 | ఇమాన్ | మాధవ్/లఖన్ | |
| 1974 | మనోరంజన్ | కానిస్టేబుల్ రతన్/షేరూ | |
| 1974 | నయా దిన్ నయీ రాత్ | ఆనంద్/స్వామీరహస్యానంద్/మిస్టర్ సారంగ్/ సేఠ్‌ధన్‌రాజ్/షేర్‌సింగ్/నాలుగు ఇతర పాత్రలు | తొమ్మిది విభిన్న ప్రాత్రలు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన నవరాత్రి రీమేక్ |
| 1974 | షాన్‌దార్ | రాజన్ | రాజ్‌కుమార్ నటించిన కన్నడ సినిమా "కస్తూరి నివాస" రీమేక్ |
| 1973 | అగ్ని రేఖ | ||
| 1973 | భారత విలాస్ | అతిథి పాత్ర, తమిళ సినిమా | |
| 1973 | అనామిక | దేవేంద్ర దత్ | |
| 1973 | అన్‌హోనీ | ఇన్‌స్పెక్టర్ సునీల్ | |
| 1973 | దూర్ నహీ మంజిల్ | కేవల్ | |
| 1973 | మన్‌చలీ | సుశీల్ కుమార్ | |
| 1973 | సూరజ్ ఔర్ చందా | సూరజ్ | |
| 1972 | పరిచయ్ | నీలేష్ | అతిథి పాత్ర |
| 1972 | కోషిష్ | హరిచరణ్ మాథుర్ | BFJA అవార్డ్ - ఉత్తమ నటుడు (హిందీ) ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన |
| 1972 | రివాజ్ | శేఖర్ | |
| 1972 | సబ్ సే బడా సుఖ్ | కథకుడు | |
| 1972 | సీతా ఔర్ గీతా | రవి | |
| 1972 | శుభ్-ఓ-శ్యామ్ | నజీర్ | |
| 1971 | అనుభవ్ | అమర్ సేన్ | |
| 1971 | ఏక్ పహేలి | పోలీస్ ఇన్‌స్పెక్టర్ | |
| 1971 | కంగన్ | ||
| 1971 | మన్ మందిర్ | దీపక్ | |
| 1971 | పరాశ్ | ధరమ్ సింగ్ | |
| 1970 | బచ్‌పన్ | ||
| 1970 | దస్తక్ | హమీద్ | |
| 1970 | దేవు | డా.ఎ.ఎన్.శేఖర్ | |
| 1970 | గునా ఔర్ కానూన్ | ||
| 1970 | ఇన్సాన్ ఔర్ సైతాన్ | ||
| 1970 | ఖిలోనా | విజయ్ బాబు | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ నటుడు – ప్రతిపాదన. పునర్జన్మ రీమేక్ |
| 1970 | మా కా ఆంచల్ | ||
| 1970 | ప్రియా | మాన్ సింగ్ | |
| 1970 | ఎ నైట్ ఇన్ కలకత్తా | ||
| 1969 | చందా ఔర్ బిజిలీ | తమిళ సినిమా "ఆనందై ఆనందన్" రీమేక్ | |
| 1969 | ఉస్ రాత్ కే బాద్ | ద్విపాత్రాభినయం | |
| 1969 | ధర్తీ కహే పుకార్ కే | మోతీ | |
| 1969 | గుస్తాకీ మాఫ్ | జై | |
| 1969 | ఇన్సాఫ్ కా మందిర్ | ||
| 1969 | జీనే కీ రాహ్ | మనోహరి | అతిథి పాత్ర |
| 1969 | జ్యోతి | ||
| 1969 | సచ్చాయి | కిశోర్ దయాళ్ | |
| 1969 | సత్యకామ్ | నరేంద్ర శర్మ (నరేన్) | |
| 1968 | ఆశీర్వాద్ | డాక్టర్ బీరేన్ | |
| 1968 | అనోఖీ రాత్ | ||
| 1968 | గౌరి | సంజీవ్ కుమార్ | |
| 1968 | రాజా ఔర్ రంక్ | సుధీర్ | |
| 1968 | సాథీ | అశోక్ | అతిథి పాత్ర |
| 1968 | షికార్ | పోలీస్ ఇన్‌స్పెక్టర్ | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - ఉత్తమ సహాయనటుడు |
| 1968 | సంఘర్ష్ | ద్వారకా ప్రసాద్ | |
| 1967 | గునేగార్ | ||
| 1967 | నౌనిహాల్ | ||
| 1966 | బాదల్ | బసల్/కిరణ్ | |
| 1966 | హుస్న్ ఔర్ ఇష్క్ | ఆషిక్ హుసేన్ | |
| 1966 | కలాపి | ||
| 1966 | పతి పత్ని | అమర్ | |
| 1966 | స్మగ్లర్ | మోహన్ | |
| 1966 | ఆలీబాబా ఔర్ 40 చోర్ | ఆలీబాబా | |
| 1965 | నిషాన్ | ||
| 1964 | ఆవో ప్యార్ కరే | ||
| 1960 | హమ్ హిందుస్తానీ | పోలీస్ ఇన్‌స్పెక్టర్ | |
గుర్తింపు
గుజరాత్ రాష్ట్రం సూరత్ లో ఒక వీధికి ఇతని స్మృత్యర్థం "సంజీవ్ కుమార్ మార్గ్" అని నామకరణం చేశారు.
ఇతనిపేరుతో సూరత్‌లో ఒక పాఠశాల నెలకొల్పారు.
2013, మే 3వ తేదీ భారతప్రభుత్వం ఇతనిపై ఒక తపాలాబిళ్ల విడుదల చేసింది.[9]
14 ఫిబ్రవరి 2014లో ఇతని స్వంత పట్టణం సూరత్‌లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ 108 కోట్ల విలువైన సమావేశ మందిరాన్ని "సంజీవ్ కుమార్ ఆడిటోరియం" పేరుతో ప్రారంభించాడు.[10]
సామాజిక సేవ
ఇతని పేరుతో "సంజీవ్ కుమార్ ఫౌండేషన్"[11] ఒక జాతీయ స్థాయి సేవా సంస్థ ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ బాలల విద్య, ఆరోగ్య, సాంస్కృతిక అభ్యున్నతికై పనిచేస్తున్నది. 2015 నుండి ఈ సంస్థ సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న సంజీవ్ కుమార్ నాటక పోటీలను స్పాన్సర్ చేస్తున్నది. ప్రతియేటా సంజీవ్ కుమార్ పేరుమీద ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు విభాగాలలో నగదు బహుమతులను ఇస్తున్నారు.
మూలాలు
- "Salt-and-pepper memories with Sanjeev Kumar". Hindustan Times. 4 November 2012. Retrieved 2013-08-12.
- "He was an actor for all seasons". The Sunday Tribune. 13 August 2000. Retrieved 2013-08-12.
- "Whatever happened to....... Sulakshana Pandit". Filmfare.
- "Sanjeev Kumar". upperstall.com.
- "20th National Awards For Films (1971)" (PDF). dff.nic.in. Directorate of Film Festivals. p. 41.
- "Sanjeev Kumar Awards". Bollywood Hungama.
- "BFJA Awards". BFJA Awards. Archived from the original on 12 July 2009.
- "BFJA Awards". BFJA Awards. Archived from the original on 9 January 2010.
- "India Post | Philately | Stamps | Stamps 2013:". Retrieved 18 July 2014.
- "Gujarat remembers its proud son, versatile actor Sanjeev Kumar by inaugurating a grand auditorium in his honour | Home | www.narendramodi.in". Retrieved 18 July 2014.
- Sanjeev Kumar Foundation
బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సంజీవ్ కుమార్ పేజీ
