షట్‌పుత్రులు
పాండవులు పాండురాజు అనుమతితో అతని భార్యలకు ఇతరుల వలన పుట్టినవారు. కనుక వారు పాండురాజుకు క్షేత్రజులు. కర్ణుడు కుంతీదేవి కని వదలి వేయగా రాధకు దొరికిన వాడు కనుక రాధకు కర్ణుడు అపవిద్ధుడు. ఉంపుడుకత్తెకు పుట్టిన పుత్రుడు గూఢోత్పన్నుడు.
- ఔరసుడు = ధర్మపత్ని యందు పుట్టిన కుమారుడు
- క్షేత్రజుడు = తన అనుమతితో భార్యకు ఇతరుల వలన పుట్టినవాడు
- దత్తకుడు = దత్తత చేసుకున్న పుత్రుడు
- కృత్రిముడు = కృత్రిమముగా తనకు అంటగట్టబడినవాడు, లేదా అభిమాన పుత్రుడు
- గూఢోత్పన్నుడు = రహస్యముగా తన వలన ఇతరులకు పుట్టినవాడు
- అపవిద్ధుడు = ఎవరో కని వదలివేయగా దొరికినవాడు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.