శ్రీ వింజేటమ్మతల్లి దేవాలయం
వింజేటమ్మ అనగా వింజమూరు గ్రామానికి గ్రామ దేవత. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా లోని ఒక మండల కేంద్రం. పార్వతీదేవి మరొక నామమే వింజేటమ్మతల్లి. వింజమూరు గ్రామానికి దక్షిణం దిక్కున గల కొండపై వెలసియున్న శ్రీ వింజేటమ్మతల్లి దేవాలయం చాలా ప్రాచీనమైనది. ఈ కొండ వద్ద ఎవరు నివాసం లేనప్పటికి ఈ కొండ చుట్టూ ఉన్న ఎనిమిది గ్రామాలతో కలిపి కొండ తొమ్మిది పల్లెలుగా ప్రసిద్ధి పొందింది.

శ్రీ పరంజ్యోతి స్వామి
ఎంతోకాలం పాటు ఆగిపోయిన పూజా కార్యక్రమాలను శ్రీ పరంజ్యోతి స్వామి వారు పున:ప్రారంభించారు.
నూతన నిర్మాణం
కొండపైన మరియు కొండ కింద ఉన్న దేవాలయాలు శిథిలమై పోవడంతో కొండ కింద దాతల సహాయంతో నూతన దేవాలయాన్ని నిర్మించారు.
నాగులపుట్ట
శ్రీ వింజేటమ్మతల్లిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ముందుగా నాలుగు వేపచెట్ల మధ్య ఉన్న నాగులపుట్టను దర్శిస్తారు.
వరాల కల్పవల్లి
ఇక్కడకి వచ్చే భక్తుల కోర్కెలు నెరవేరుతుండటంతో శ్రీ వింజేటమ్మతల్లిని వరాల కల్పవల్లి శ్రీ వింజేటమ్మతల్లిగా అభివర్ణిస్తున్నారు.
అన్నదానం
ఇక్కడ ప్రతి శుక్రవారం మరియు పండుగలకు ప్రత్యేక సందర్భాలలో అన్నదానం జరుగుతుంది.
ఈ కొండ వద్ద జరిగే ఉత్సవాలు
శివరాత్రి, దసరా, శ్రీ వింజేటమ్మతల్లి తిరునాళ్ళ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
ఈ కొండపై చూడదగినవి
ఆహ్లాదకరమైన ప్రకృతి
గబ్బిలాల గుహ వద్ద ఉన్న శివలింగం
పురాణాల ప్రకారం
హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తిరిగి యదాస్థానంలో ఉంచడానికి తీసుకుని వెళ్తున్న సమయంలో ఒక పెళ్ల విరిగి ఇక్కడ పడిందని పెద్దలు చెప్పుతుంటారు.
రవాణా సౌకర్యాలు
వింజమూరుకి నాలుగు కిలోమీటర్ల దూరంలో గల ఈ కొండ వద్దకు శుక్రవారం మరియు పర్వదినములలో చుట్టుప్రక్కల గ్రామాలలోని భక్తులు నడచి మరియు సొంత, బాడుగ వాహనాలలో ఇక్కడికి వస్తుంటారు.
సౌకర్యాలు
ఇక్కడ వసతి గృహములు లేనందువలన ఇక్కడకి వచ్చిన భక్తులు సాయంత్రానికి తిరిగి వెళ్తుంటారు.
