శ్రీవిల్లి పుత్తూరు దివ్యదేశం

శ్రీవిల్లి పుత్తూరు దివ్యదేశం భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

శ్రీవిల్లి పుత్తూరు దివ్యదేశం
Lua error in మాడ్యూల్:Location_map at line 418: No value was provided for longitude.
Location in Tamil Nadu
ప్రదేశము
దేశము: భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం: వటపత్రశాయి పెరుమాళ్, రంగమన్నార్
ప్రధాన దేవత: ఆండాళ్ తాయార్
దిశ మరియు స్థానం: తూర్పుముఖము
పుష్కరిణి: ముక్కళ తీర్థము
విమానం: సంశన విమానము
కవులు: పెరియాళ్వార్, ఆండాళ్
ప్రత్యక్షం: మండూక మహర్షికి

విశేషాలు

పెరియాళ్వార్ ఆండాళ్ జన్మించిన దివ్యదేశము. ఇచ్చట పెరియాళ్వార్లు పెంచిన నందనవనము, ఆండాళ్ అవతరించిన స్థలము. కణ్ణాడి కిణర్ (ఆండాళ్ ముఖము చూచుకొన్న బావి) ఉన్నాయి. ఈ దివ్యదేశమునకు 20 కి.మీ దూరములో కాట్టళగర్ సన్నిధి, 5 కి.మీ దూరములో శ్రీనివాసన్ సన్నిధి, 24 కి.మీ దూరములో తిరుత్తణ్‌గాల్ క్షేత్రము ఉన్నాయి. మిధునమాస ఉత్సవములో 5వ రోజు ఉదయం రంగమన్నార్, వటపత్రశాయి, కాట్టళగర్, శ్రీనివాసన్, తణ్‌గలప్పన్ వేంచేయగా పెరియాళ్వార్లు మంగళాశాసనం చేయుదురు. నాటి రాత్రి ఆండాళ్ హంసవాహనం మీద ఊరేగుతుంది. పెరుమాళ్లు గరుడ వాహనముపై ఊరేగుతాడు. ఈ సన్నిధిలో రంగమన్నార్ పెరుమాళ్లకు కుడివైపున ఆండాళ్ ఎడమవైపు గరుడాళ్వార్ ఉన్నారు. ఆండాళ్ ప్రార్థన వలన రంగమన్నారును రాజగోపాల రూపములో తీసుకొని వచ్చిన గరుడాళ్వార్ పెరుమాళ్లతో ఏకాసనమున ప్రతిష్ఠితమై ఉన్నాడు. వటపత్రశాయి సన్నిధిలో ఆదిశేషుడు, నాభికమలంలో బ్రహ్మ, శ్రీదేవి భూదేవి, విల్లి పుత్తర్ అను కిరాత రాజులైన భక్తులు ఉన్నారు.ఇచట ప్రతి నిత్యము పెరియాళ్వార్లకు తిరుమంజనము జరుగుతుంది. పిమ్మట పెరియాళ్వార్ పెరుమాళ్లకు మంగళా శాసనం చేస్తాడు. పెరియాళ్వార్ సన్నిధి ప్రక్కనగల నందన వనములో ఆండాళ్ సన్నిధి వేరుగా ఉంది. శ్రీరంగములో ఉన్నట్లు ఇక్కడ కూడా అరయర్ సేవ ఉంది. ఈస్వామి విషయమై శ్రీపరాశర్ భట్టర్ గోదాచతుశ్లోకి శ్రీమద్వేదాంత దేశికులు గోదాస్తుతి రచించారు.

పేరు వెనుక చరిత్ర

విల్లి పుత్తర్ అను కిరాత రాజులచే కట్టబడుటచే ఈక్షేత్రమునకు విల్లి పుత్తూరను పేరు వచ్చింది.

కన్యా శ్రవణం తీర్థోత్సవం.

ఉత్సవాలు

మిధునం స్వాతి పెరియాళ్వార్ తిరునక్షత్రం, కర్కాటకం పుబ్బ, ఆండాళ్ తిరునక్షత్రం పది దినములు అతి వైభవముగా జరుగును. పంగుని ఉత్తరా నక్షత్రమున ఆండాళ్‌కు తిరుక్కల్యాణం జరుగును.

ఝ్

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వారా దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
వటపత్రశాయి పెరుమాళ్, రంగమన్నార్ ఆండాళ్ తాయార్ ముక్కళ తీర్థము తూర్పుముఖము నిలచున్న భంగిమ, వటపత్ర శయనము పెరియాళ్వార్, ఆండాళ్ సంశన విమానము మండూక మహర్షికి

సాహిత్యం

శ్లో. దివ్యే ముక్కళ తీర్థ సుందరతటే శ్రీ విల్లి పుత్తూర్ పురే
  శ్రీమత్సంశన దేవయాన నిలయ: ప్రాచీముఖ స్సంస్థిత:||
  భాతిశ్రీ వటపత్రశాయి భగవాన్ శ్రీ గోదయా సంస్తుత:
  శ్రీమద్విష్ణుహృదా ప్రశస్య విభవో మండూక యోగీక్షిత:||

పాశురాలు

పా. మిన్ననైయ నుణ్ణడియార్ విరికుழల్‌మేల్ నుழைన్దవణ్డు
  ఇన్నిశైక్కుం విల్లిపుత్తూరిని తమర్‌న్దాయ్, ఉన్నైక్కణ్డార్
  ఎన్ననోన్బు నోற்றா ళ్ గొలో వివవై పెற்ற వయిరుడై యాళ్
  ఎన్నుం వార్తై యెయ్‌దువిత్త విరుడికేశా! ములై యుణాయే
  పెరియాళ్వార్- పెరియాళ్వార్ తిరుమొழி 2-2-6

  మెన్నడై యన్నమ్ పరన్దు విళై యాడుమ్‌ విల్లిపుత్తూరుఱై వాన్ఱన్,
  పొన్నడి కొణ్బదోరాశైయినా లెన్ పొరుకయ ఱ్కణ్ణిణై తు--;
  ఇన్నడి శిలొడు పాలము తూట్టి యెడుత్త వెన్ కోలక్కిళియై;
  ఉన్నొడు తోழாమై క్కొళ్వన్ కుయిలే యులగళన్దాన్ వరక్కూవాయ్
  ఆండాళ్-నాచ్చియార్ తిరుమొழி 6-5

గోదా చతుశ్లోకి

  నిత్యాభూషా నిగమ శిరసా నిస్సమోత్తుజ్గవార్తాం
  కాన్తోయస్యా: కచవిలులితై: కాముకోమాల్య రత్నై:
  సూక్త్యా యస్యా శ్రుతిసుభగయా సుప్రభాతా దరిత్రీ
  సైషాదేవీ సకల జననీ సి--తాం మామపాజ్గై:|| (1)

  మాతా చేత్తులసీ పితాయదితవ శ్రీ విష్ణు చిత్తోమహాన్
  భ్రాతా చేద్యతి శేఖర: ప్రియతమ: శ్రీరజ్గదామాయది
  జ్ఞాతారస్తవయా స్త్వదుక్తి సరస స్తవ్యేన సంవర్ధితా:
  గోదాదేవి కధం త్వ మన్య మనిశం సాధారణా శ్రీ రసి|| (2)

  కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం
  ప్రోక్తం స్వస్యచ కీర్తనం ప్రపదనం స్వస్మైప్రసూనార్పణం
  సర్వేషాం ప్రకటం విధాతు మనిశం శ్రీ ధన్వినవ్యేపురే
  జాతాం వైదిక విష్ణు చిత్తతనయాం గోదా ముదారాం స్తుమ:|| (3)

  ఆకూతస్య పరిష్క్రియా మనుపమా మసేచనం చక్షుషో:
  ఆనన్దస్య పరం పరామనుగుణా మారామశైలే శితు:
  తద్దోర్మధ్య కిరీట కోటి ఘటిత స్వోచ్చిష్ట కస్తూరికా
  మాల్యామోదన మేది తాత్మవిభవాం గోదాముదారాం స్తుమ:|| (4)

చేరే మార్గం

తెన్‌కాశి-విరుదునగర్ రైలు మార్గము మధురకు 65 కి.మీ

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.