శ్రీరంగపట్టణం

శ్రీరంగపట్టణం (ఆంగ్లం : Srirangapattana) (కన్నడ : ಶ್ರೀರಂಗಪಟ್ಟಣ ) (ఇంకనూ శ్రీరంగపట్న శిరంగపట్టణ్ అని పిలువబడేది). కర్నాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో గలదు. మైసూరుకు అతిసమీపంలో గలదు. ఈ నగరం, చారిత్రక, ధార్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను గలిగివున్నది.

శ్రీరంగనాధ మందిరం

  ?శ్రీరంగపట్టణం
కర్ణాటక  భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 12.414°N 76.704°E / 12.414; 76.704
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
13 కి.మీ² (5 sq mi)
• 679 మీ (2,228 అడుగులు)
జిల్లా(లు) మాండ్య జిల్లా
[[:వర్గం:మాండ్య జిల్లా గ్రామాలు|గ్రామాలు]]

}} -->

జనాభా
జనసాంద్రత
23 (2001 నాటికి)
• 1,803.69/కి.మీ² (4,672/చ.మై)
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 571 438
• +08236
• KA-11

ప్రదేశం

మైసూరు కు 13 కి.మీ. దూరంలో గల ఈ నగరం, మాండ్య లో గలదు. ఈ పట్టణం మొత్తం కావేరీ నది చే చుట్టబడియున్నది. ఇదో ద్వీపంలా కనబడుతుంది.

ధార్మిక ప్రాముఖ్యత

ఈ నగరంలోని శ్రీరంగనాధ స్వామి ఆలయంలో వెలసిన రంగనాధస్వామి పేరున ఈ నగరానికి శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు. హోయసల మరియు విజయనగర శైలిలో ఆ తరువాత రంగరింపబడినది.

జనగణన

2001 గణాంకాల ప్రకారం [1], శ్రీరంగ పట్టణ జనాభా 23,448. అందులో పురుషులు 51% మరియు స్త్రీలు 49% గలరు. అక్షరాస్యత శాతం 68%, జాతీయ అక్షరాస్యత శాతం 59.5% కంటే ఎక్కువ : పురుషుల అక్షరాస్యత 74%, మరియు స్త్రీల అక్షరాస్యత 63%. 10% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగలవారు.

భూగోళికం

శ్రీరంగపట్టణం, 12.41° N 76.7° E లో గలదు. దీని సరాసరి ఎత్తు 679 మీటర్లు (2227 అడుగులు).

చరిత్ర

శ్రీరంగపట్టణం, విజయనగర సామ్రాజ్య కాలంనుండి పుణ్యక్షేత్రంగా, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుచున్నది. అంతేగాక మైసూరు రాజ్యపు రాజధానిగాను విరాజిల్లినది. రంగరాయను ఓడించి వడయార్ రాజు 1614 లో శ్రీరంగపట్టణాన్ని వశబర్చుకున్నాడు.[2],విజయనగర సామ్రాజ్యంపై దండెత్తిన వడయార్ రాజుకు విజయనగర సామ్రాజ్య ఆరాధ్య దేవతయైన అలిమేలమ్మ శపించిందనీ, దాని కారణాన వడయార్ రాజుకు సంతానం కలుగలేదని ఓ కథనం ఉన్నది.

టిప్పు సుల్తాన్ కోటలో ఉన్న ఈ నీటి సరఫరా మార్గం ద్వారా శత్రువులు కోటలోకి చొరబడి కోటను ముట్టడించారు
హైదర్ మరియు టిప్పు

హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ ఆధ్వర్యంలో శ్రీరంగపట్టణం 'మైసూరు రాజ్యానికి' రాజధాని అయినది. టిప్పు సుల్తాన్ తన రాజ్యానికి ఖుదాదాద్ సల్తనత్ లేదా సల్తనత్ ఎ ఖుదాదాద్ అని పేరు పెట్టాడు. టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్టణానికి రాజధాని చేసుకుని, దక్షిణ భారత్ లోని పలు భాగాలను తన రాజ్యం క్రింద కలుపుకున్నాడు. ఇండో-ఇస్లామీయ నిర్మాణ శైలి లో టిప్పుసుల్తాన్ సమాధి, టిప్పూ పాలెస్, దరియా దౌలత్ మరియు జుమ్మా మసీదు లాంటి నిర్మాణాలు కానవస్తాయి. '1799' లో తన స్వంత అనుచరగణం విద్రోహచర్యవలన శ్రీరంగపట్టణ పరిసరాలలోనే బ్రిటిష్ వారిచే చంపబడ్డాడు.

ముఖ్యమైన ప్రదేశాలు

శ్రీరంగపట్టణంలో పలు ప్రదేశాలు చూడదగినవి. వాటిలో ముఖ్యమైనవి :

  • రంగనాధ ఆలయం : ఈ ఆలయం చాలా పురాతనమైనదే కాక హైందవ సంప్రదాయంలో, అందులోనూ వైష్ణవ సంప్రదాయంలో మరీ ప్రఖ్యాతి పొందినది. మైసూరును హైదరాలీ పరిపాలించిన కాలంలో ఈ ఆలయానికి సమీపంలోని మందుగుండు సామగ్రి కార్ఖానా పేలి రంగనాథస్వామి దేవాలయ గోపురం విరిగిపడింది. హైదర్ అలీ వెన్వెంటనే తన సైనికులను పంపి వారిచేతనే దేవాలయ గోపురాన్ని నిర్మింపజేశారు.[3]
  • జుమ్మా మసీదు
  • రంగన్నతిట్టు పక్షి అభయారణ్యం
  • కరిఘట్ట
  • శివసముద్రం జలపాతం, భారత్ లో రెండవ అతిపెద్ద జలపాతం మరియు ప్రపంచంలో 16వ అతిపెద్ద జలపాతం.[4]

ఫుట్ నోట్స్

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  2. The fall of Srirangapattana to the Wodeyar dynasty in 1614 is much celebrated in local ballad and legend, one of which concerns a curse put upon the Wodeyars by Alamelamma, the lamenting wife of the defeated Vijayanagar viceroy. In fulfillment of that curse, no ruling Maharaja of Mysore has ever had children; the succession has inevitably devolved upon brothers, nephews or adopted heirs, or on children born to the Maharaja before his accession, but never has a child been born to a ruling Maharaja.
  3. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  4. "Shivasamudra Falls". Retrieved 2006-11-11.

మూలాలు

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.