శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం జిల్లా భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య సరిహద్దులో ఉంది. జిల్లా ముఖ్యపట్టణమైన శ్రీకాకుళం (అక్షా: 18' ఉ, రేఖా: 54' తూ) నాగావళి నది ఒడ్డున ఉంది. విశాఖపట్నం జిల్లా నుంచి 1950 ఆగష్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది

శ్రీకాకుళం జిల్లా
.
Countryభారత దేశం
Stateఆంధ్ర ప్రదేశ్
Regionకోస్తా
Headquarterశ్రీకాకుళం
విస్తీర్ణం
  మొత్తం5,837
జనాభా (2011)
  మొత్తం26,99,471
  సాంద్రత462
Languages
  Officialతెలుగు
సమయప్రాంతంIST (UTC+5:30)
Telephone code+91 0( )
Literacy55.9 (2001)
Literacy Male67.9
Literacy Female44.19
వెబ్‌సైటుhttps://www.guntur.ap.gov.in/
మందస వాసుదేవ ఆలయం

జిల్లా పేరు వెనుక చరిత్ర

  • బ్రిటిషు వారు శ్రీకాకుళం పేరును పలకలేక "చికాకోల్" అనేవారు. చికాకోల్ కు సంబంధించిన మరో కథనం ఇలాఉంది : ఈ ప్రాంతం నైజాము ఆధిపత్యంలో ఉండే సమయంలో ఈ ఊళ్లోనే ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహిస్తూ రైతుల వద్ద నుండి పన్నులు వసూలు చేసేవారు. రైతులు తాము కట్ట వలసిన పన్ను సొమ్మును విచ్చు రూపాయల రూపంలో చిన్నచిన్న గుడ్డసంచులలో పోసి, మూటకట్టి, ఆమూటను తీసికొనివచ్చి ఖుద్దున సమర్పించేవారు. ఆ మూట లోని సొమ్ము సరిగా ఉందో లేదో చూసుకోవడానికి మూటను విప్పాలి. ఆ మూటలు చాలా ఉంటున్నందువలన, ఆ మూటల మూతికట్టు విప్పమని రైతులతో చెప్పడానికి "శిఖా ఖోల్" అనేవారు. అంటే "మూతికట్టువిప్పు" అని అర్థం. ఈమాట క్రమంగా "చికా కోల్" అయి, శ్రీకాకుళంగా స్థిరపడిందిట.
  • ఆంధ్రప్రదేశ్ పూర్వపు ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.

జిల్లా చరిత్ర

శ్రీముఖలింగం ఆలయం

ఒకప్పుడు ఇది బౌద్ధమతానికి ముఖ్యస్థానంగా వర్ధిల్లింది. శాలిహుండం, దంతపురి, జగతిమెట్ వంటి బౌద్ధారామం|బౌద్ధారామాలు ఇక్కడ కనుగొనబడ్డాయి. తరువాత ఇది కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. గాంగేయులు ఈ ప్రాంతాన్ని 6 నుండి 14వ శతాబ్దం వరకు, 800 సంవత్సరాలు పాలించారు. వజ్రహస్తుడు|వజ్రహస్తుని కాలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ముఖలింగం ఆలయాన్ని నిర్మించారు. మహమ్మదీయుల పాలన కాలంలో షేర్ మహమ్మద్ ఖాన్ శ్రీకాకుళంలో జామియా మసీదు నిర్మించాడు.

విశాఖపట్నం జిల్లాలో భాగంగా ఉండే ఈ జిల్లా 1950 ఆగష్టు 15న ప్రత్యేక జిల్లాగా అవతరించింది. 1969లో ఈ జిల్లానుండి సాలూరు తాలూకాలోని 63 గ్రామాలు, బొబ్బిలి తాలూకాలోని 44 గ్రామాలను విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఏర్పరచిన గజపతి నగరం తాలూకాకు బదలాయించారు. మళ్ళీ మే 1979లో కొత్తగా విజయనగరం జిల్లాను ఏర్పరచినపుడు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి తాలూకాలను కొత్తజిల్లాలో విభాగాలుగా చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో నక్సలైటు (మావోయిస్టు పార్టీ) ఉద్యమం ప్రారంభమయింది శ్రీకాకుళం జిల్లాలోనే.

నైసర్గిక స్వరూపం

శ్రీకాకుళం జిల్లా మొత్తం జిల్లా వైశాల్యం 5837 చ.కి.మీ. జిల్లాకు 193 కి.మీ. సముద్ర తీరం ఉంది. తూర్పు కనుమలు ఈశాన్యం నుండి కొంతభాగం విస్తరించి ఉన్నాయి.

నదులు

నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, చంపావతి, బహుదా, కుంభికోటగెడ్ ఇవి జిల్లాలలో ముఖ్యమైన నదులు. ఇవి తూర్పు కనుమలలో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.

వాతావరణం

సంవత్సరంలో ఎక్కువకాలం వాతావరణం తేమగా ఉంటుంది. నైఋతి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబరు వరకు, ఈశాన్య ఋతుపవనాలు అక్టోబరు - నవంబరు మాసాలలోను వర్షాలు కురిపిస్తాయి. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు పొడిగాను, చల్లగాను ఉంటుంది. సంవత్సరం సగటు వర్షపాతం 1162 మి.మీ. (2004-2005 సంవత్సరంలో వర్షపాతం 937.6 మి.మీ.)

వన్య సంపద

జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును.

  1. దక్షిణ భారత Moist deciduous అడవులు - మిశ్రమ అడవులు, మద్ది అడవులు మరియు పర్వత సవాన్నా భూములు.
  2. దక్షిణ భారత సతత హరిత అడవులు (dry ever-green miscellaneous forests)
జంతు సంపద

శ్రీకాకుళం జిల్లాలో అటవీ మృగాలు అల్పంగా ఉన్నాయి. జనావాసాల విస్తరణ, అడవుల నాశనం ఇందుకు కారణాలు కావచ్చును. మాంసాహార మృగాలలో పులి దాదాపు అంతరించింది. చిరుత పులి, హైనా (దుమ్ములగొండి), తోడేలు వంటి జంతువులు అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. గుంటనక్క, అడవిపిల్లులు మరియు కుక్కలు జిల్లాలో కనిపించే ఇతర మాంసాహార జంతువులు. శాకాహార జంతువులలో - somber మరియు మచ్చల దుప్పి (చితాల్), అడవి గొర్రెలు, ఎలుగుబంట్లు సాధారణంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కృష్ణజింక, నీలగాయ్ మరియు బైసన్లు అసలు కనిపించకపోవడం గమనార్హం. పక్షి జాతులలో - నెమళ్ళు, కౌజులు, పావురాలు, చిలకలు, మైనా partridges, బాతులు doves వంటివి అధికంగా ఉన్నాయి..

భౌగోళిక స్వరూపం

సరిహద్దులు

ఉత్తరాన ఒడిషా రాష్ట్రము, దక్షిణ-పశ్చిమాల్లో విజయనగరము జిల్లా, ఒడిషా గజపతి జిల్లా, తూర్పున బంగాళాఖాతము ఉన్నాయి. జిల్లాకు కొంత భాగం హద్దులుగా కందివలస గెడ్], వంశధార, బహుదా నదులు ప్రవహిస్తున్నాయి.

మొత్తం జిల్లా వైశాల్యం 5837 చ.కి.మీ.

ఆర్ధిక స్థితి గతులు

వ్యవసాయం

జిల్లాలో ముఖ్య పంటలు- వరి, రాగులు, పెసలు, మినుములు, ఉలవలు, చెరకు, జనుము, వేరుశనగ, నువ్వులు, మిరప, పసుపు, నీరుల్లి.

నీటివనరులు

శ్రీకాకుళం జిల్లాలో బాహుద, ఉత్తర మహేంద్ర, తనయ, బెంజిగడ్డ, వరహాలు గడ్డ, వంశధార, నాగావళి, పెద్దగడ్డ, కందివలస అనే 9 నదులు ఉన్నాయి. వీటిలో నాగావళి, వంశధార, మహేంద్ర తనయ ముఖ్యమైన నదులు.

[1] జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా 26.47%, నైఋతి ఋతుపవనాల ద్వారా 62.61% వర్షాలు లభిస్తాయి. మూడు ముఖ్య నదుల ద్వారా జరుగుతున్న నీటి వినియోగం: నాగావళి 371 మి.క్యూ.మీ. (మిలియన్ క్యూబిక్ మీటర్లు) (36%), వంశధార 121 మి.క్యూ.మీ. (12%), మహేంద్ర తనయ 81 మి.క్యూ.మీ. (8%), చిన్న చెరువులు 140 మి.క్యూ.మీ. (14%), భూగర్భ జలాలు 300 మి.క్యూ.మీ. (30%). మొత్తం 1,013 మి.క్యూ.మీ. రాష్ట్రంలో రెండు ప్రధాన జలాశయాలు సుమారు 140 మి.క్యూ.మీ. నీటిని వ్యవసాయ నిమిత్తం సమకూరుస్తున్నాయి. అవకాశం ఉన్న నీటిలో 91% (5,763 మి.క్యూ.మీ.) బంగాళాఖాతంలోకి వృధాగా పోతున్నదని అంచనా. 9% నీరు మాత్రమే భూగర్భంలోకి ఇంకుతున్నది.

జిల్లాలో 3.3 లక్షల (0.33 మిలియన్) హెక్టేరులు భూమి సాగులో ఉంది. అందులో 1.9 లక్షల హెక్టేరులకు సాగునీటి వసతి ఉంది. కాలువల ద్వారా 91,946 హెక్టేరులు, చెరువుల ద్వారా 80,123 హెక్టేరులు, బోరు బావుల ద్వారా 6,923 హెక్టేరులు, ఇతర బావుల ద్వారా 8,866 హెక్టేరులు, ఇతర వనరుల ద్వారా 5,316 హెక్టేరులు భూమికి సాగునీరు లభిస్తున్నది.

అనిశ్చితమైన వర్షపాతం జిల్లాలో ప్రధాన సమస్య. చాలా సంవత్సరాలు అనావృష్టి సంవత్సరాలుగా పరిగణింపబడుతున్నాయి. అలాగే త్రాగు నీటి సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ఫ్లోరోసిస్ సమస్య కూడా కొన్నిచోట్ల ఉంది. నీటి వనరులను పరిరక్షించే విధానాలు లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతంలోని "పోడు" వ్యవసాయం ఇందుకు ముఖ్యమైన కారణాలు. జిల్లాలో ఎక్కువ భాగం నేల ఉపరితలం గట్టిగా ఉన్నందున నీరు ఇంకే అవకాశం తక్కువ. అందుకు తోడు అధిక భూభాగం వాలుగా ఉన్నది గనుక నీరు నిలవదు. వరి, చెరకు పంటలకు ఎక్కువ నీటిని వాడుతారు.

జిల్లాలో ముఖ్యమైన ప్రాజెక్టులు: నారాయణపురం డామ్ (మద్దివలస రిజర్వాయిర్, నాగావళి), గొట్టా బారేజి (వంశధార), కళింగాంధ్ర ప్రాజెక్టు (మహేంద్ర తనయ)

మచిలేశం, కళింగపట్నం, నువ్వలరేవు, భావనపాడు, బారువలు ముఖ్యమైన మత్స్య పరిశ్రమ కేంద్రాలు.

పరిశ్రమలు

జిల్లాలో మాంగనీసు, గ్రాఫైటు, సున్నపు రాయి, మైకా, గ్రానైట్, జిల్లా తీరప్రాంతంలోని ఇసుకలో మోనజైట్ మరియు ఇతర ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి.

జిల్లాలో ముఖ్యపరిశ్రమలు: చక్కెర, నూనె, జీడిపప్పు, జనపనార, పేపర మిల్లు కర్మాగారములు కలవు

పైడిభీమవరం, రాజాం, మడపాం, ఆమదాలవలస, సంకిలి పట్టణాలలో పరిశ్రమలు విస్తరిస్తున్నాయి.

డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు

రెవెన్యూ డివిజన్లు, మండలాలు

జిల్లా మూడు రెవిన్యూ డివిజన్లుగా విభజింపబడింది: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ

మొత్తం 38 రెవిన్యూ మండలాలు ఉన్నాయి.[2]

శ్రీకాకుళం జిల్లా మండలాలు, రెవెన్యు విభాగాలు
1 వీరఘట్టం మండలం14 భామిని మండలం27 టెక్కలి మండలం
2 వంగర మండలం15 కొత్తూరు మండలం28 కోటబొమ్మాళి మండలం
3 రేగిడి ఆమదాలవలస మండలం16 హీరమండలం మండలం29 సంతబొమ్మాళి మండలం
4 రాజాం మండలం17 సరుబుజ్జిలి మండలం30 నందిగం మండలం
5 గంగువారి సింగడాం మండలం18 ఆమదాలవలస మండలం31 వజ్రపుకొత్తూరు మండలం
6 లావేరు మండలం19 శ్రీకాకుళం మండలం మండలం32 పలాస మండలం
7 రణస్థలం మండలం20 గార మండలం33 మందస మండలం
8 ఎచ్చెర్ల మండలం21 పోలాకి మండలం34 సోంపేట మండలం
9 పొందూరు మండలం22 నరసన్నపేట మండలం35 కంచిలి మండలం
10 సంతకవిటి మండలం23 జలుమూరు మండలం36 కవిటి మండలం
11 బూర్జ మండలం24 సారవకోట మండలం37 ఇచ్ఛాపురం మండలం
12 పాలకొండ మండలం25 పాతపట్నం మండలం38 లక్ష్మీనరసుపేట మండలం
13 సీతంపేట మండలం26 మెళియాపుట్టి మండలం

రవాణా వ్వవస్థ

రోడ్డు మార్గాల ద్వారా వివిధ ప్రాంతాలకు చక్కగా కలపబడి ఉంది. విశాఖపట్నం, దగ్గరలోని విమానాశ్రయము.ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రస్థానమైనా రైలుస్టేషను లేదు.10 కి.మీ.లోని శ్రీకాకుళం రోడ్ స్టేషనుకు వెళ్ళాలి.APSRTC ప్రభుత్వ సంస్ధ ద్వారా జిల్లా కేంద్రం నుండి ఇతర మండల.జిల్లా.రాష్ట్రాలకు వివిధ సర్వీస్ లు నడపబడుచున్నాయ్.

జనాభా లెక్కలు

2011 జన గణన ప్రకారం ప్రధాన వివరాలిలా ఉన్నాయి

  • 2001-2011 దశకంలో జనాభా వృద్ధి రేటు: 6.52% (మొత్తం రాష్ట్రం వృద్ధి రేటు 14.44%)
  • జనసాంద్రత: చ.కి.మీ.కు 463 మంది (రాష్ట్రం జనసాంద్రత 308)
  • అక్షరాస్యులు మగవారిలో 8,57,824 (71.61%), ఆడువారిలో 6,37,557 (52.08%)
  • పట్టణ ప్రాంతాల జనాభా 4,36,703 లేదా 16.16% (రాష్ట్రం మొత్తంలో పట్టణ జనాభా 27.35%)
  • శ్రామికులు: 48.6% (ఇందులో 78% వ్యవసాయం, 15% సేవల రంగం).

(2011 జనాభా లెక్కల సాయంతో)

శ్రీకాకుళం జిల్లా జనాభా [3]
శ్రీకాకుళం జిల్లా జనాభా - 2011 సెన్సెస్ ప్రకారము
కేటగిరీ మగ ఆడ మొత్తము %మగ %ఆడ
అందరు 13,41,738 13,61,376 27,03,114 49.64% 50.36%
ఎస్సీ 113730 115879 229609 9.02% 9.07%
ఎస్టీ 75284 75965 151249 5.97% 5.94%
మైనారిటీస్ 21706 23641 44223 1.73% 1.88%

సంస్కృతి

ప్రధాన భాష తెలుగు. అయితే, ఒడిషా రాష్ట్రానికి సరిహద్దు కావడంచేత ఒరియా భాషను కొంతమంది అర్థం చేసుకోగలరు, మాట్లాడగలరు కూడా. శ్రీకాకుళం జిల్లా ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఇటీవలి కాలంలో జరుగుతున్న పారిశ్రామిక, విద్యా రంగాల్లో అభివృద్ధి కారణంగా శ్రీకాకుళం పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. కానీ మౌలిక సదుపాయాల విషయంలో ఆటంకాలను ఎదుర్కొంటోంది. ఈ ఊరిని పేదవాని స్వర్గం (poor man's paradise) అని చమత్కరిస్తారు (వేసవికాలంలో చల్లగాఉండే ప్రదేశం కావడం వలన).

పశుపక్ష్యాదులు

Cows, Oxus,

విద్యాసంస్థలు

అంబేద్కర్ విశ్వవిద్యాలయం - ఎచ్చెర్ల

Rajivgandhi Institute of Medical Science s ( RIMS) - శ్రీకాకుళం

IIIT ఎచ్చెర్ల వద్ద ఉంది. జి.యు.ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ (రాజాం)

RGUKT Srikakulam

GEMS Medical college, Ragolu village

పర్యాటకం

కళింగపట్నం బీచ్ వద్ద దీపస్తంభం
శాలిహుండం బౌద్ధారామ అవశేషాలు
అరసవిల్లి ఆలయం
శ్రీకూర్మం ఆలయం

శ్రీకాకుళం పట్నం మరియు జిల్లాలోని పలు ప్రాంతాలు పచ్చికబయల్లు, అడవులు,సశ్యస్యామలమైన పంట పొలాలతో ఎప్పుడూ చల్లగా ఉంటుంది.వేసవి కాలములో ఊటీని పోలి ఉంటుంది. ఈ జిల్లాలో వర్షపాతము ఎక్కువగా ఉంటుంది. కాస్టాఫ్ లివింగ్ చాలా తక్కువ. అందుకే దీనిని పేదవాని స్వర్గమని పిలుస్తారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో రెండు కోట్లమంది పైచిలుకు, 2016లో కోటీ అరవైలక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా.[4] పర్యాటకుల సంఖ్య విషయంలో 2017లో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత రెండవ స్థానం పొందింది.

వాతావరణం

సంవత్సరంలో ఎక్కువకాలం వాతావరణం తేమగా ఉంటుంది. నైఋతి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబరు వరకు, ఈశాన్య ఋతుపవనాలు అక్టోబరు - నవంబరు మాసాలలోను వర్షాలు కురిపిస్తాయి. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు పొడిగాను, చల్లగాను ఉంటుంది. సంవత్సరం సగటు వర్షపాతం 1162 మి.మీ. (2004-2005 సంవత్సరంలో వర్షపాతం 937.6 మి.మీ.) జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును.

సస్య సంపద

దక్షిణ భారత Moist deciduous అడవులు - మిశ్రమ అడవులు, మద్ది అడవులు మరియు పర్వత సవాన్నా భూములు. దక్షిణ భారత సతత హరిత అడవులు (dry ever-green miscellaneous forests) అందుకే దీనిని పేదవాని స్వర్గం అని పిలుస్తారు.[5]

శ్రీకాకుళం పట్టణానికి చేరువలో అనేక ధార్మిక, విహార యాత్రా స్థలాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయు.

శ్రీకాకుళం

జిల్లా కేంద్రమైన ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున ఉంది. 13 కిలోమీటర్ల దూరంలో ఆమదాలవలస రైల్వేస్టేషను ఉంది. కోటేశ్వరస్వామి ఆలయము (గుడివీధి), సంతోషిమాత ఆలయం (పాతశ్రీకాకుళం), వెంకటేశ్వరఆలయం (గుజరాతీపేట), కోదండ రామస్వామి ఆలయం, జమియా మసీదు ముఖ్యమైన ప్రార్థనా స్థలాలు.

అరసవిల్లి

సూర్య దేవాలయానికి ప్రసిద్ధి చెందిన అరసవిల్లి శ్రీకాకుళం పట్టణానికి 2 కి.మీ.లోనే ఉంది. దేశంలో ఉన్న కొద్ది సూర్య మందిరాలలో ఇది ఒకటి. ఇక్కడ ఆదిత్య, అంబిక, విష్ణు, గణేష, మహేశ్వర మూర్తులు ఉన్నాయి.

శ్రీకూర్మం

శ్రీకాకుళం పట్టణానికి 15 కి.మీ. దూరంలో ఉన్న శ్రీకూర్మం దేశంలో బహుశా ఒకే ఒక కూర్మావతార మందిరం. విశిష్టమైన శిల్పకళ కలిగిన ఈ మందిరంలో లభించిన శాసనాలు చారిత్రికంగా కూడా ఎంతో ముఖ్యమైనవి. ఇక్కడ డోలోత్సవం ప్రధాన ఉత్సవం.

శాలిహుండం

ఇది శ్రీకాకుళం పట్టణానికి 18 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ పురావస్తుశాఖ త్రవ్వకాలలో పురాతన బౌద్ధారామాల శిథిలాలు బయటపడ్డాయి.

శ్రీముఖలింగం
కళింగపట్నం

జిల్లా కేంద్రానికి 25 కి.మీ. దూరంలో ఉన్న ఓడరేవు. చారిత్రకంగా సముద్ర వాణిజ్య కేంద్రం. వంశధార నది ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ దర్గా షరీఫ్, షేక్ మదీనా అక్విలిన్ ఉన్నాయి. 23 కిలోమీటర్లవరకు కనుపించే ఒక దీప స్తంభం ఉఉంది.

కవిటి

సోంపేట, ఇచ్ఛాపురాల మధ్య ఉన్న కవిటిని 'ఉద్దానం' (ఉద్యానవనం) అని కూడా అంటారు. కొబ్బరి, జీడిమామిడి, పనస వంటి తోటలతో ఇది రమణీయంగా ఉండే ప్రదేశం. శ్రీకాకుళానికి 130 కి.మీ. దూరం. ఇక్కడ చింతామణి అమ్మవారి, శ్రీ సీతారామ స్వామి ఆలయం ఉన్నాయి.

బారువ

ఇది శ్రీకాకుళం పట్టణానికి 109 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ మహేంద్ర తనయ నది సముద్రంలో కలుస్తుంది, ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయం, జనార్దన స్వామి ఆలయం ఉన్నాయి. ఒకప్పుడు ఇది ముఖ్యమైన ఓడరేవు. ఇది కొబ్బరి తోటలకు, కొబ్బరి పీచు పరిశ్రమకు కేంద్రం.

తేలినీలాపురం

ఇది శ్రీకాకుళం పట్టణానికి 60 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ ఒక సంరక్షిత పక్షి ఆవాస కేంద్రం. సైబీరియా నుండి శీతకాలంలో పెలికన్ పక్షులు ఇక్కడికి వలస వస్తాయి.

దంతపురి

ఇది శ్రీకాకుళం పట్టణానికి 22 కి.మీ. దూరంలో ఉంది. దీనిని బౌద్ధ జ్ఞానదంతపురి అని కూడా అంటారు. క్రీ.పూ.261లో అశోకుని కళింగ యుద్ధం తరువాత ఇది కళింగరాజులకు ప్రాంతీయ రాజధానిగా ఉంది. ఇక్కడ పురావస్తు శాఖవారి త్రవ్వకాలలో అనేక పురాతన వస్తువులు లభించాయి.

సంగం

శ్రీకాకుళానికి 56 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నాగావళి, వంశధార, సువర్ణముఖి నదులు కలుస్తున్నాయి. ఇక్కడ సంగమేశ్వర మందిరం ఐదు లింగక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధం. మహాశివరాత్రికి ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది.

పొందూరు

ప్రఖ్యాతి గాంచిన పొందూరు ఖద్దరు తయారయ్యేది జిల్లాలోని పొందూరు లోనే. ఇది జిల్లా కేంద్రానికి 21 కి.మీ. దూరంలో ఉంది.

కొరసవాడ

ప్రఖ్యాతి గాంచిన మంచు తాతాయ్య చెనెత వస్త్రములు తయారయ్యేది జిల్లాలోని కొరసవాడ లోనే. ఇది శ్రీకాకుళానికి 55 కి.మీ. దూరంలో ఉంది.

రాజాం

శ్రీకాకుళానికి 40 కి.మీ. దూరంలో ఉన్న రాజాం బొబ్బిలి సర్దార్ తాండ్ర పాపారాయుడు కథ ద్వారా చారిత్రికమైనది.

మందస

సోంపేటకు 26 కి.మీ. దూరంలో ఉంది. మహేంద్రగిరి కొండ దుగువున ఉన్న ఈ వూరిలో 700 సంవత్సరాల పురాతన వాసుదేవ ఆలయం ఉంది. ఇక్కడి కోట దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనదిగా చెప్పబడుతున్నది.

క్రీడలు

ఈ జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు ఆంధ్ర దేశం, తెలుగు భాష వికాసానికి అసమానమైన సేవ చేశారు. జిల్లాకు చెందిన కొందరు ప్రముఖులు

గిడుగు రామమూర్తి పంతులు
కోడి రామ్మూర్తి నాయుడు
సాహితీవేత్తలు
కళాకారులు

శరత్ బాబు [చలనచిత్ర నటులు]

సీపాన శ్రీధర్ (సినీ రచయిత, దర్శకుడు )

వట్టి కుమార్ ( దర్శకుడు )

షకలక శంకర్ జబర్దస్త్ ఫేమ్

క్రీడాకారులు
నాయకులు
  • సర్దార్ గౌతు లచ్చన్న - స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు
  • మరి కొందరి సినీ ప్రముఖులు - రావి కొండలరావు, శరత్ బాబు, జి.ఆనంద్, జె.వి.సోమయాజులుఉర్లం సంస్థానం సంస్కృత భాష ఆధ్యయనానికి ఎంతో సేవ చేసింది.

పాలనా విభాగాలు

పట్టణ ప్రాంతాలు

జిల్లాలో ఆరు పట్టణ ప్రాంతాలు -నాలుగు మునిసిపాలిటీలు, రెండు నోటిఫైడ్ పంచాయితీ టౌనులు - ఉన్నాయి.

  1. శ్రీకాకుళం మున్సిపాలిటీ (టౌను) - 1,17,320
  2. ఆముదాలవలస - 37,931
  3. ఇచ్చాపురం - 32,662
  4. పలాస (పలాస-కాశిబుగ్గ) - 49,899
  5. సోంపేట - 17,423 (నోటిఫైడ్ పంచాయితీ టౌను)
  6. రాజం -23,424 (నోటిఫైడ్ పంచాయితీ టౌను) #పాలకోండ-75,000 నగరపంచాయతీ

లోక్ సభ స్థానాలు

శ్రీకాకుళం జిల్లాపరిధిలో 3 లోక్‌సభ స్థానాలున్నవి.

  • లోక్‌సభ స్థానం (1): శ్రీకాకుళం లోక్‌సభ, పాక్షికముగా 2.పార్వతీపురం, 3.విజయనగరం లలో కలిసి ఉంది.

శాసనసభస్థానాలు

  • ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ శాసనసభస్థానాలు

తేది 2009 మే 29 నాటికి శ్రీకాకుళం జిల్లాలో మొత్తము 10 శాసనసభ స్థానాలు ఉన్నాయి: ఇచ్ఛాపురం, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం శాసనసభ, ఎచ్చెర్ల, ఆముదాలవలస,పాలకొండ, పాతపట్నం, పలాస,రాజాం

పునర్విభజన ప్రకారము 31-మే-2007 న వెలువడిన నోటిఫికేషన్ ప్రకారము వాటిని 10 స్థానాలకు కుదించడము జరిగింది. వాటి వివరాలు ఈ క్రింది విదముగా ఉన్నాయి.[6]

శ్రీకాకుళం జిల్లా రెవెన్యు విభాగాలు
పునర్విభజన ప్రకారము శ్రీకాకుళం జిల్లా శాసన సభ స్థానాలు.
నియోజకవర్గము పేరు మండలాలు జనాభా ఎస్సీ ఎస్టీ
1.శ్రీకాకుళం శాసనసభ శ్రీకాకుళం18713215136772
గార750174302237
మొత్తము262149194381009
2.ఎచ్చెర్ల. రణస్థలం774369025131
లావేరు673348795459
ఎచ్చెర్ల820517529372
గి.సిగడాం550876656450
మొత్తము281908320051412
3.రాజాం. రాజాం8169394971041
సంతకవిటి668937052132
అర్.ఆమదాలవలస684227673578
వంగర4787970811248
మొత్తము264867313032998
4.ఆమదాలవలస ఆమదాలవలస839456555226
సరుబుజ్జిలి326303643801
బూర్జ4285258661288
పొందూరు731756345271
మొత్తము231602225092586
5.నరసన్నపేట నరసన్నపేట742845029242
పోలాకి65734293163
జలుమూరు602004455391
సారవకోట4879351296148
మొత్తము249011149066944
6.పాలకొండ పాలకొండ73592106372997
సీతంపేట52282187945741
భామిని4105874958178
వీరఘట్టం63882121964224
మొత్తము2308143220761140
7.పాతపట్నం పాతపట్నం58381660410603
మెళియాపుట్టి50490351113435Arasavallitemple14.jpg
కొత్తూరు6087688097823
ఎల్.ఎన్.పేట271412672607
మొత్తము2480922793736830
8.టెక్కలి టెక్కలి7087277133596
నందిగాం5319260502842
సంతబొమ్మాలి648453821764
కోటబొమ్మాలి6990662076944
మొత్తము258815149066944
9.పలాస పలాస8785066943208
మందస76402474710087
వి.కొత్తూరు693981197154
మొత్తము2336501263813469
10.ఇచ్ఛాపురం ఇచ్చాపురం7674724501304
కంచిలి5984726977597
కవిటి7094712146636
సోంపేట7413836341063
మొత్తము281679999516600

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. రోటరీ ఇంటర్నేషనల్ వారి 3020 జిల్లా డిస్కషన్ గ్రూపు
  2. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో శ్రీకాకుళం జిల్లా తాలూకాల వివరాలు. జూలై 28, 2007న సేకరించారు.
  3. కలక్టర్ ఆఫీసు శ్రీకాకుళం నుండి సేకరించినది. (సేకరణ:డా.శేషగిరిరావు)
  4. [http://web.archive.org/save/http://apfootfall.viswagnan.com/web/ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఫుట్‌ఫాల్స్ సమాచారం (ఆర్కైవ్)
  5. http://frontlineonnet.com/fl2124/stories/20041203005811500.htm
  6. "వార్త" దినపత్రిక శ్రీకాకుళం ఎడిషన్ -28 మే 2007

5. Om Art Print - vijayawada,వారి శ్రీకాకుళం జిల్లా సమాచారము

బయటి లింకులు

మూసలు, వర్గాలు

మూస:ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.