శ్రీకాకుళం
సంబంధిత ఇతర వ్యాసాలకోసం శ్రీకాకుళం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.
| ?శ్రీకాకుళం ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం | |
| మారుపేరు: చిక్కోలు | |
![]() శ్రీకాకుళంలొ నాగావళ్ళి నది | |
![]() | |
| అక్షాంశరేఖాంశాలు: 18.3°N 83.9°E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 20.89 కి.మీ² (8 చ.మై)[1] |
| జిల్లా(లు) | శ్రీకాకుళం జిల్లా |
| [[:వర్గం:శ్రీకాకుళం జిల్లా గ్రామాలు|గ్రామాలు]] |
}} --> |
| జనాభా • జనసాంద్రత |
1,25,939[2] (2011 నాటికి) • 6,029/కి.మీ² (15,615/చ.మై) |
| భాష(లు) | తెలుగు |
| ప్రణాళికా సంస్థ | ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతము |
| పురపాలక సంఘం | విజయనగరం నగరపాలక సంస్థ |
| కోడులు • పిన్‌కోడు |
• 532 001 |
| వెబ్‌సైటు: http://cdma.ap.gov.in/SRIKAKULAM/ | |
శ్రీకాకుళం (Srikakulam) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం మరియు శ్రీకాకుళం జిల్లా కేంద్రము.[3] ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గము ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.[4]
శబ్ద ఉత్పత్తి శాస్త్రం
ఈ నగరాన్ని భారత స్వాతంత్ర్యానికి ముందు చిక్కోలు అని పిలిచేవారు.[4]
జనాభా వివరాలు
2011 జనాభా ప్రకారం, ఈ నగర జనాభా 125,939. ఇందులో 62,546 మగవారు మరియు 63,393 ఆడవారు ఉన్నారు.[2] 11,001 మంది 0–6 వయసు లోపు వారు ఉన్నారు. ఇందులో 5,686 అబ్బాయిలు మరియు 5,315 అమ్మయిలు. ఈ నగరంలో 84.62% అక్షరాస్యతతొ 96,744 మంది అక్షరాస్యులు ఉన్నారు.[5]
పౌర పరిపాలనన

శ్రీకాకుళం పురపాలక సంఘము 1856 లో స్థాపించారు.[1] సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగి స్వాతంత్ర్య సమరయోధులు, మేధాసంపన్నులు, ఎంతో గొప్పవారు పట్టణ పాలనా బాధ్యతలు నిర్వహించారు. 1905 నుండి ఇప్పటివరకు (13-12-2007) క్రమముగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతము 1 లక్షా 17 వేల జనాభా కలిగి 36 వార్డులుగా విభజించబడింది .
| పనిచేసిన కాలం | అధ్యక్షుని పేరు | పనిచేసిన కాలం | అధ్యక్షుని పేరు | ||
| 1905 -1911 | టి.వి.శివరావుపంతులు | 1949 - 1952 | గైనేటి.వెంకటరావు | ||
| 1912 - 1915 | ఎస్.ఆదినారాయణరావు | 1952 - 1956 | ఇప్పిలి.లక్ష్మినారాయణ | ||
| 1915 - 1918 | డి.శంకరశాస్త్రులు | 1956 - 1961 | పసగాడ సూర్యనారాయణ | ||
| 1918 - 1921 | ఎం.రెడ్డిపంతులు | 1962 - 1963 | మాటూరు.రామారావు | ||
| 1921 - 1926 1927 - 1929 |
చట్టి పూర్ణయ్యపంతులు | 1963 - 1964 | ఎల్.సూర్యలింగం | ||
| 1926 - 1927 | ఎమ్.వి.కామయ్యశెట్టి | 1967 - 1970 | ఎమ్.ఎ.రవూఫ్ | ||
| 1929 - 1931 | హెచ్.సూర్యనారాయణ | 1970 - 1972 | ఇప్పిలి వెంకటరావు | ||
| 1931 - 1938 | ఎం.వి.రంగనాథం | 1981 - 1992 | అంధవరపు వరహానరసింహం | ||
| 1938 - 1942 | చల్లా నరశింహనాయుడు | 1995 - 2000 | దూడ భవానీ శంకర్ | ||
| 1946 - 1949 | బి.వి.రమణ శెట్టి | 2000 - 2005 | పైదిశెట్టి జయంతి | ||
| 2005 నుండి 2010 | ఎం.వి.పద్మావతి |
వైద్యము
- జిల్లాకేంద్ర ఆసుపత్రి 400 పడకలతో అతిపెద్ద హాస్పిటల్
- జిల్లాకి ఒక మెడికల్ కాలేజి (RIMS) ఈ టౌను లోనే ఉంది.
- జిల్లా లోగల ఒక దంతవైద్యకళాశాల (శాపారము)టౌను లోనే ఉన్నది
- పట్నంలో ఒక హోమియో వైద్యశాల, ఒక ఆయుర్వేద వైద్యశాల ఉన్నాయి.
- పట్నంలో 5 హెల్త్ సెంటర్లలో 1 పురపాలకసంఘం,4 స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలోను నిర్వహించబడుతున్నాయి .
- అనేక ప్రైవేటు నర్సింగ్ హోం లు,స్పెసలిస్టు డాక్టర్లు ఉన్నారు.
శ్రీకాకుళం రక్తనిధీ
2006 శ్రీకాకుళంలో బ్లడ్ బ్యాంక్ ప్రారంభమైనది. Indian Red cross society (Blood bank) call-08942-226555,7386907041
న్యాయము
జిల్లాలో ఉన్న మొత్తము 19 న్యాయస్థానాలలో ఇక్కడ 1.జిల్లాకోర్టు, 2.మున్సిపల్ బెంచికోర్టు ఉన్నాయి. పట్నంలో సుమారు 75 వరకు న్యాయవాదులున్నారు. రాజకీయంలో ఉన్న ప్రముఖులంతా సుమారు న్యాయవాదులే. పట్నంలో ఒక న్యాయ కళాశాల ఉంది.
రవాణా

తేదీ 20-12-2007 నాటికి RTC కాంప్లెక్ష్స్ లో ఉన్న టేబుల్ ప్రకారము :
శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషను
శ్రీకాకుళం పట్నానికి రైల్వే స్టేషను లేదు .13 కి.మీ దూరములో శ్రీకాకుళం రోడ్ అనే పేరుతో ఆమదాలవలసలో ఉంది. 2006 లో రెజర్వేషన్ బుకింగ్ కౌంటర్ మాత్రము శ్రీకాకుళం మున్సిపాలిటీ ఆఫీసు ఆవరణలో పెట్టారు. చాలా సదుపాయముగా ఉంది.
ముఖ్యమైన ప్రార్ధనా స్థలాలు

| ముఖ్య ప్రార్థనా స్థలాలు | ప్రదేశం |
| ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము | (గుడి వీధి) |
| శ్రీ సుహ్మణ్యస్వామి ఆలయము | (గుడి వీధి) |
| సంతోషిమాత ఆలయం | (పాత శ్రీకాకుళం) |
| వెంకటేశ్వర ఆలయం (నారాయణ తిరుమల) | (గుజరాతీపేట) |
| కోదండ రామస్వామి ఆలయం | (కృష్ణా పార్క్) |
| అయ్యప్ప స్వామి ఆలయము | (ఆదివారం పేట) |
| జమియా మసీదు | (జి.టి.రోడ్) |
| శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం | అరసవిల్లి క్షేత్రం. |
| సాయిబాబా ఆలయం | విశాఖ బి.కాలనీ |
| రాఘవేంద్ర స్వామి ఆలయం | ఆదివారం పేట |
| శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, నారాయణ తిరుమల | గుజరాతీపేట |
శ్రీకాకుళం లో పార్కులు

- గాంధీ పార్కు, పాలకొండ రోడ్
- శాంతినగర్ పార్కు, శాంతినగర్,
- రివర్ వ్యూ పార్క్, గుడివీధి.
- ఇందిరా గాంధీ పార్కు, గూనపాలెం
- హౌసింగ్ బోర్డ్ కాలనీ పార్క్, పాత శ్రీకాకుళం
- చిన్న బరాటం వీధి పార్కు,
- PSN కాలనీ పార్కు,
- హడ్కో కాలనీ పార్కు
- డైమండ్ పార్క్, న్యూ కాలనీ
- LBS పార్కు, ఎల్.బి.యస్. కాలనీ
- విజయాదిత్య పార్కు, సీపన్నాయుడు పేట,
- కార్గిల్ విక్టరీ పార్క్, ఎ.పి.హె.బి.కాలనీ
శ్రీకాకుళం జిల్లా ప్రముఖులు
- స్వామి అగ్నివేష్ - ప్రముఖ సామాజిక కార్యకర్త
- భాస్కరభట్ల రవికుమార్ - ప్రముఖ సినీ గేయ రచయిత
- మగటపల్లి వెంకటరమణమూర్తి - ప్రముఖ దాత, సమాజ సేవకుడు.
- రావిశాస్త్రి
- తంగి సత్యనారాయణ
- వడ్డాది పాపయ్య
- కాళీపట్నం రామారావు
- సోమంచి వాసుదేవరావు - ప్రముఖ తెలుగు కవి, నిర్వచన సుందరకాండ సమీర సందేశం వంటి కావ్యాల రచయిత.
- మానికొండ చలపతిరావు - అఖిల భారత జాతీయ కాంగ్రెసు పత్రిక 'డెక్కన్ హేరల్డ్' సంపాదకుడు
- గరిమెళ్ళ సత్యనారాయణ - ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ' మా కొద్దీ తెల్ల దొరతనం' గీత రచయిత.
మూలాలు
- "Basic Information of Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Retrieved 16 February 2015.
- "Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.
- "District Census Handbook – Srikakulam" (PDF). Census of India. p. 27. Retrieved 18 January 2015.
- "Srikakulam Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration and Urban Development Department, Govt. of Andhra Pradesh. Retrieved 16 February 2015.
- "Srikakulam City Population Census 2011 - Andhra Pradesh".


