శుభలేఖ (సినిమా)

శుభలేఖ 1982 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సాంఘిక చిత్రం. ఇందులో చిరంజీవి, సుమలత ముఖ్యపాత్రలు పోషించారు.

శుభలేఖ
దర్శకత్వం కె.విశ్వనాథ్
రచన గొల్లపూడి మారుతీరావు (మాటలు)
స్క్రీన్ ప్లే కె.విశ్వనాథ్
కథ కె.విశ్వనాథ్
నటులు చిరంజీవి,
సుమలత
సంగీతం కె.వి.మహదేవన్
ఛాయాగ్రహణం లోక్ సింగ్
కూర్పు జి.జి.కృష్ణారావు
నిర్మాణ సంస్థ
విజయసాయి ఫిల్మ్స్
విడుదల
1982
భాష తెలుగు

కథ

శాస్త్రీయ నృత్య భంగిమలో

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నరసింహ మూర్తి (చిరంజీవి) డిగ్రీలో తప్పటంతో ఒక స్టార్ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తూ ఉంటాడు. అంకెల ఆదిశేషయ్య (కైకాల సత్యనారాయణ) నడుపుతున్న కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న సుజాత (సుమలత) అతనికి పరిచయం అవుతుంది. ఆదిశేషయ్య తన కుమారుడు మోహన్ (గిరీశ్)తో సహా పెళ్ళిచూపులకి సుజాత ఇంటికి వస్తారు. ఆదిశేషయ్య అడిగిన వరకట్నం సుజాత కుటుంబం స్తోమతకి మించగా, సుజాత అతనితో వాదనకి దిగుతుంది. తమతోనే ఉంటే తమ కుమార్తె వివాహం చెయ్యలేమని, సంఘంలో తలెత్తుకు తిరగలేమని భయపడిన తల్లిదండ్రులు ఆమెను ఇంటినుండి పంపించేస్తారు. ఆదిశేషయ్య కూడా తనని పనిలోంచి తీసేయగా నిరాశ్రయురాలైన తనకి తన ఇంటిలోనే చోటిస్తాడు మూర్తి. అయితే సంఘం వారిద్దరికీ అక్రమ సంబంధం అంటగడుతుంది. ఒక సన్మాన సభలో ఆదిశేషయ్య నిజస్వరూపాన్ని బయటపెట్టి మూర్తి అతనిని అవమానించగా, రౌడీలతో అతనిని కొట్టించి, అతని ఉద్యోగం కూడా తీయించేస్తాడు ఆదిశేషయ్య. సుజాతతో బాటు హైదరాబాదు చేరి, తనకి పరిచయం ఉన్న ఆల్విన్ లో ఉన్నతోద్యోగి అయిన రావు (అరుణ్) తో మాటాడి సుజాతకి ఉద్యోగం ఇప్పిస్తాడు మూర్తి. సుజాత చెల్లెలు లక్ష్మి (తులసి) ని మోహన్ తమ్ముడు మురళి (శుభలేఖ సుధాకర్) ప్రేమిస్తాడు. లక్ష్మితో పెళ్ళి జరిపించకపోతే ఆత్మహత్య చేస్కొంటానన్న మురళి బెదిరింపుకు భయపడి, తక్కువ కట్నంతోనే మురళి, తులసి ల పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాడు ఆదిశేషయ్య.

మూర్తి, సుజాతల పెళ్ళికి మురళి, లక్ష్మిలు ఏం చేశారు, అన్నది చిత్రానికి ముగింపు.

తారాగణం

విశేషాలు

కథకళి వేషధారణలో
  • కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరుకి ఇది మొదటి చిత్రం.
  • సుధాకర్, శుభలేఖ సుధాకర్ అయ్యింది ఈ చిత్రంతోనే.
  • ఈ చిత్రంలో చిరు పని చేసే స్టార్ హోటల్, వైజాగ్లో రామోజీ రావుకి చెందిన డాల్ఫిన్ హోటల్
  • ఆల్విన్ ఫ్రిజ్ ల వాణిజ్య ప్రకటనకి మాడల్ గా చిరంజీవి ఒక పాటలో అన్ని భారతీయ సంప్రదాయ నాట్యాల నృత్యకారుడిగా కనిపిస్తారు.

పాటలు

  • రాగాల పల్లకిలో కోయిలమ్మా

ఇవి కూడా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.