శాసన మండలి

భారత దేశము యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభను శాసనమండలి (విధాన పరిషత్) అంటారు. రాజ్యాంగంలోని 171 అధికరణం ద్వారా ఈ విధాన సభను ప్రారంభించవచ్చు. 2017 నాటికి భారతదేశంలోని 29 రాష్ట్రాలలో కేవలం 7 రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉంది[1]. అవి ఉత్తర ప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీరు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ. రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికౌతారు. ఈ సభలోని సభ్యులను ఎన్నికైన స్థానిక సంస్థలు, అసెంబ్లీ సభ్యులు, గవర్నర్, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు మొదలైనవారు ఎన్నుకుంటారు. ఈ సభ్యులను ఎం.ఎల్.సి అని పిలుస్తారు. ఇది శాశ్వత సభ. అనగా శాసన సభ వలె దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు.

భారతదేశం

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వము

రాజ్యాంగము

కార్య నిర్వాహక వ్యవస్థ

శాసన వ్యవస్థ

న్యాయ వ్యవస్థ

రాష్టాలు

g

గ్రామీణ ప్రాంతాలు

ఎన్నికల వ్యవస్థ

  • ఎన్నికల కమిషను
  • లోక్‌సభ ఎన్నికలు
  • రాజ్యసభ ఎన్నికలు
  • రాష్ట్రపతి ఎన్నిక
  • ఉప రాష్ట్రపతి ఎన్నిక
  • రాష్ట్ర శాసనసభ ఎన్నికలు
  • రాష్ట్ర శాసన మండలి ఎన్నికలు
  • స్థానిక సంస్థల ఎన్నికలు
  • రాజకీయ ఘాతాలు
  • అంతర్జాతీయ సంబంధాలు

ఇతర దేశాలు

సభ్యత్వం

ప్రతీ శాసన మండలి సభ్యుడు (ఎం.ఎల్.సి) ఆరు సంవత్సరాల పదవీకాలం కలిగి ఉంటాడు. సభలో మూడొంతులలో ఒక వంతు సభ్యుల పదవీ కాలం ప్రతీ రెండు సంవత్సరాలకు పూర్తి అవుతుంది. ఈ అమరిక భారత పార్లమెంటులోని ఎగువ సభ అయిన రాజ్యసభ ను పోలి ఉంటుంది.

శాసనమండలి సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి. మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. దివాళా తీసి ఉండరాదు. అతడు ఏ రాష్ట్రంలో పోటీ చేస్తే ఆ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. అతడు/ఆమె అదే కాలంలో పార్లమెంటు సభ్యునిగా ఉండరాదు.

శాసన మండలి సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల శాసన సభ్యుల సంఖ్యలో మూడో వంతు కంటే మించరాదు. కానీ సభ్యుల సంఖ్య 40 కి తగ్గరాదు. (జమ్మూ కాశ్మీరు శాసన మండలిలో 32 మంది సభ్యులే ఉండటం చేత ప్రత్యేక పార్లమెంటు చట్టము వలన అనుమతించబడినది).

ఈ క్రింది పద్ధతిలో ఎం.ఎల్.సి లు నియమితులవుతారు:

  • మూడోవంతు (1/3) మందిని స్థానిక ప్రభుత్వ సంస్థలు అనగా మ్యునిసిపాలిటీలు, గ్రామ సభలు/గ్రామ పంచాయితీలు, పంచాయత్ సమితులు మరియు జిల్లాపరిషత్ లు ఎన్నుకుంటాయి.
  • మూడోవంతు (1/3) మందిని రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు.
  • శాసన మండలి సభ్యులలో ఆరోవంతు (1/6) మంది సభ్యులు గవర్నరు చే నియమించబడతారు. వీరు శాస్త్రము, కళలు, సామాజిక సేవ మరియు ఇతర రంగములలో రాణించినవారై ఉంటారు.
  • పన్నెండో వంతు (1/12) మందిని ఉన్నత పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఎన్నుకొంటారు.
  • మరో (1/12) మందిని పట్టభద్రులు ఎన్నుకుంటారు.

ప్రతిపాదిత విధాన పరిషత్తులు

  • 2010లో భారత పార్లమెంటు ఎనిమిదవ రాష్ట్రం (తమిళనాడు) లో శాసన మండలి పునః స్థాపన కొరకు చట్టం చేసింది. కానీ ఈ చట్టాన్ని అమలు చట్టపరమైన చర్యల మూలంగా పెండింగ్ లో ఉంచబడింది.[2] రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌన్సిల్ పునరుద్దరణకు వ్యతిరేకత వ్యక్తం చేసింది[3].
  • 2013 నవంబరు 28 న అసోం లో శాసన మండలి ఏర్పరచవలసినదిగా భారత యూనియన్ కెబినెట్ ఆమోదించింది.
  • కర్ణాటక, మహారాష్ట్రలలో అధ్యయనం చేసిన తరువాత ఒడిశా రాష్ట్ర శాసన మండలిని ఏర్పాటు చేయనుంది.[4]
  • మహారాష్ట్ర విధానసభ వివరాలు: ఎన్నికలు 31, స్థానిక సంస్థలు 21, ఉపాధ్యాయులు 7, గ్రాడ్యుయేట్లు 7, నామినేటెడ్ 12.

రద్దు మరియు పునరుజ్జీవనం

శాసనసభ యొక్క ఉనికి రాజకీయంగా వివాదాస్పదంగా ఉంది. కొన్ని రాష్ట్రాలలో కౌన్సిల్ రద్దు చేయబడిన తరువాత దాని పునఃస్థాపనన క్కొరకు అభ్యర్థించారు; దీనికి విరుద్ధంగా, ఒక రాష్ట్రం కోసం కౌన్సిల్ యొక్క పునఃస్థాపన కోసం ప్రతిపాదనలు కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. రాష్ట్ర శాసన మండలి రద్దుచేయడం లేదా పునఃస్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలు భారత పార్లమెంటు నిర్ధారణకు కావాలి.

2007 ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిని పునఃస్థాపించబడింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చినట్లయితే మళ్లీ కౌన్సిల్‌ను రద్దు చేస్తామని ప్రకటించింది.

పంజాబ్ లో అకాలీదళ్-బిజెపి విజయం తర్వాత, కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ తాను రాష్ట్రం యొక్క విధాన పరిషత్‌ను మళ్లీ ఏర్పరుస్తానని ప్రకటించాడు కానీ స్థాపించబడలేదు.

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.