శాసనసభ

ప్రతి రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకునే సభ్యులతో కూడిన ఒక సభ ఉంటుంది. దీన్ని శాసనసభ లేదా విధానసభ అంటారు. కొన్ని రాష్ట్రాల్లో రెండు సభలుంటాయి. ఈ రెండో సభను శాసనమండలి అంటారు. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రం లోనైనా శాసనసభలో 500 కంటే ఎక్కువ కాకుండాను, 60 కంటే తక్కువ కాకుండాను స్థానాలు ఉండాలి.

భారతదేశం

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వము

రాజ్యాంగము

కార్య నిర్వాహక వ్యవస్థ

శాసన వ్యవస్థ

న్యాయ వ్యవస్థ

రాష్టాలు

g

గ్రామీణ ప్రాంతాలు

ఎన్నికల వ్యవస్థ

  • ఎన్నికల కమిషను
  • లోక్‌సభ ఎన్నికలు
  • రాజ్యసభ ఎన్నికలు
  • రాష్ట్రపతి ఎన్నిక
  • ఉప రాష్ట్రపతి ఎన్నిక
  • రాష్ట్ర శాసనసభ ఎన్నికలు
  • రాష్ట్ర శాసన మండలి ఎన్నికలు
  • స్థానిక సంస్థల ఎన్నికలు
  • రాజకీయ ఘాతాలు
  • అంతర్జాతీయ సంబంధాలు

ఇతర దేశాలు

సభ్యుల అర్హతలు

  • శాసనసభ సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి
  • కనీసం 25 ఏళ్ళ వయసు ఉండాలి

సభానిర్వహణ

సభా నిర్వహణ బాధ్యతలు నిర్వహించేందుకు ఒక సభాపతి (స్పీకరు) ని, ఒక ఉపసభాపతి (డిప్యూటీ స్పీకరు) ని సభ్యుల నుండి ఎన్నుకుంటారు. సాంప్రదాయికంగా సభాపతిగా అధికార పక్షానికి, ఉపసభాపతిగా ప్రతిపక్షానికి చెందిన వారిని ఎన్నుకుంటారు. అయితే ఇది నియమం కాదు.


తమ పదవికి రాజీనామా సమర్పించదలచిన పక్షంలో సభాపతి ఉపసభాపతి కి, ఉపసభాపతి సభాపతికి సమర్పించాలి. వారి తొలగింపుకు మెజారిటీ సభ్యుల మద్దతు అవసరం.

సమావేశాలు

శాసనసభను సమావేశపరచడం, సమావేశాలను ముగించడం, సభను రద్దు చెయ్యడం వంటి అధికారాలు గవర్నరు వద్ద ఉంటాయి. శాసనసభ సమావేశాల చివరి రోజుకు, తదుపరి సమావేశాల మొదటి రోజుకు మధ్య 6 నెలలకు మించి అంతరం ఉండరాదు. సభలో సభ్యులు కాని రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, రాష్ట్ర అడ్వొకేటు జనరల్ సభనుద్దేశించి ప్రసంగించవచ్చు, సభా కమిటీలలో పాల్గొనవచ్చు. కాని వారికి సభలో ఓటు వేసే అధికారం ఉండదు.

ఇవీ చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.