శాసనం
శాసనం (ఆంగ్లం : Epigraphy "ఎపీగ్రఫీ" లేదా "inscription" ఇన్‌స్క్రిప్షన్ ) అనగా పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో అనగా కాగితం మరియు కాగితంతో తయారు చేసిన గ్రంథాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు మొదలగువారు, తమ రాజ్యపు అధికారిక శాసనాలను "రాళ్ళ"పై, రాతి బండలపై, రాగి రేకులపై చెక్కించి, బహుకాలపయోగం కొరకు భద్రపరచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటనలకే శాసనం అనేవారు. ఉదాహరణకు "శిలాశాసనం", అంటే శిలపై చెక్కించిన శాసనం. ఈ శాసనాలన్నీ ప్రస్తుతం భారత పురాతత్వ శాఖ వారి ఆధ్వర్యంలో గలవు. ఇలాంటి శాసనాలకు భారత్ లో ఉదాహరణలు:
- అశోకుడి (శిలా) శాసనం.
| తెలుగు శాసనాలు |
| విష్ణుకుండినులు |
| తూర్పు చాళుక్యులు |
| పశ్చిమ చాళుక్యులు |
| రాష్ట్రకూటులు |
| ఇతర వంశములు |
| సామ్రాజ్య చోళులు |
| కాకతీయులు |
| రెడ్డి రాజులు |
| రేచర్ల రెడ్లు |
| రేనాటి చోళులు |
| వైడుంబులు |
| చిందులు |
| తూర్పు గాంగులు |
| గజపతులు |
| కుతుబ్‌షాహీలు |
| మొఘల్ సామ్రాజ్యము |
| సూచిక I |
| సూచిక II |
రకాలు
శాసనాలు స్థూలంగా రెండురకాలుగా విభజించవచ్చు. అవి లోహ శాసనాలు (లౌహికములు), శిలా శాసనాలు (శైలికములు).
లోహ శాసనాలు
లోహశాసనాలకే లౌహికములని మరో పేరు. సంఖ్యాపరంగా చూస్తే శిలాశాసనాల కన్నా ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ వీటి చారిత్రిక ప్రాధాన్యత చాలా ఎక్కువ. పల్లవ, కదంబ, గాంగ, చాళుక్యాది వంశాల చరిత్ర ప్రధానంగా లోహశాలనాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ శాసనాలను ప్రజలు ఏవో యంత్రాలను, మంత్రతంత్రాలకు సంబంధించిన వివరాలేవో వాటిలో వ్రాసి వున్నాయని భావించడంతో చాలా శాసనాలు వెలుగులోకి రావట్లేదు. పలువురు వీటిని నిధినిక్షేపాలున్న ప్రదేశాల దారిని చూపే రహస్యమిందులో వ్రాసివుందని భావించి ప్రభుత్వానికి ఇవ్వక తమ వద్దే దాచుకునే మూర్ఖత వల్ల ఎంతో చరిత్ర కాలగర్భంలోనే ఉండిపోయింది. కొందరు తామ్రశాసనాలను కరిగించి ఇంటికి ఉపయోగించే చెంబులు, తపేలాలు, గుండిగలు వంటివి తయారుచేసుకున్నారు. వీటివల్ల ఎంతో విలువైన చారిత్రిక సమాచారం నశించిపోయింది[1].
శిలా శాసనాలు

ఇవీ చూడండి
- తెలంగాణా శాసనములు
- తెలుగు శాసనాలు
- తిరుమల శాసనాలు
- అశోకుడి శిలా శాసనాలు
- తామ్రపత్ర శాసనాలు
- తాళపత్ర శాసనాలు
- ఆంధ్ర క్షత్రియుల శిలాశాసనాలు
మూలాలు
- వెంకటరమణయ్య, నేలటూరు (1948). చారిత్రిక వ్యాసములు (1 ed.). మద్రాస్: వేదము వేంకటరాయశాస్త్రి అండ్ సన్స్. Retrieved 9 December 2014.