శారదా లిపి

శారదా లిపి బ్రాహ్మీ లిపి కుటుంబానికి చెందినది. క్రీ.శ 8వ శతాబ్దంలో అభివృద్ధి చెందినట్టుగా భావిస్తున్న ఈ లిపి సంస్కృత, కాశ్మీరీ భాషలు వ్రాయడానికి ఉపయోగించేవారు. ఒకప్పుడు కాశ్మీరు, ఆఫ్ఘనిస్తాన్ (గాంధార) ప్రాంతాల్లోఎంతో ప్రాచుర్యంలో ఉండే ఈ లిపి, తర్వాతి కాలంలో కాశ్మీరుకి మాత్రమే పరిమితమైపోయింది. ప్రస్తుతం, ఈ లిపిని కాశ్మీరీ పండితులు మాత్రమే ప్రత్యేక సందర్భాల్లోనూ, జాతక చక్రాల్లోనూ, జ్యోతిషంలోనూ వాడుతున్నారు. కాశ్మీరు ప్రాంతంలో వెలసి ఉన్న సరస్వతీ దేవికి మరో పేరు శారద. ఆ పేరుమీదనే ఈ లిపి పిలువబడేది.

అక్షరాలు

అచ్చులు

a అ i ఇ u ఉ e ఎ o ఒ
ā ఆ ī ఈ ū ఊ ai ఐ au ఔ
aṃ అం aḥ అః

హల్లులు

k క kh ఖ g గ gh ఘ
c చ ch ఛ j జ jh ఝ ñ ఞ
ṭh ḍh
t త th థ d ద dh ధ n న
p ప ph ఫ b బ bh భ m మ
y య r ర l ల v వ
ś శ s స h హ

ఇవి కూడా చూడండి:

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.