శశి కపూర్
శశి కపూర్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు మరియు నిర్మాత. ఆయన మార్చి 18, 1938న కలకత్తాలో జన్మించాడు. కొన్ని సినిమాలకు దర్శకుడిగా, సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. 2011 లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
| శశి కపూర్ | |
|---|---|
![]() | |
| జననం | బల్బీర్ రాజ్ పృధ్వీరాజ్ కపూర్ 1938 మార్చి 18 [1] కోల్‌కత, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు కోల్‌కత, పశ్చిమ బెంగాల్) |
| నివాసం | ముంబై, మహారాష్ట్ర |
| ఇతర పేర్లు | బల్బీర్ శశి బల్బీర్ రాజ్ షాషా శశి బాబా |
| వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత |
| క్రియాశీలక సంవత్సరాలు | 1941–1999 (విరమణ) |
| ఎత్తు | 1.83 మీటర్లు |
| జీవిత భాగస్వామి | జెన్నిఫర్ కెండాల్ (1958–1984) |
| పిల్లలు | కునాల్ కపూర్ కరణ్ కపూర్ సంజనా కపూర్ |
| బంధువులు | కపూర్ కుటుంబం |
బాల్యం
శశి కపూర్ నాలుగు సంవత్సరాల పిన్న వయసునుండే తండ్రి పృథ్వీరాజ్ కపూర్ స్థాపించిన పృథ్వీ థియేటర్స్ తోపాటు ప్రయాణిస్తూ ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన నాటకాలలో నటించడం ప్రారంభించాడు.1940 దశాబ్దిలోనే సంగ్రామ్ (1950), దనపాణి (1953) లాంటి వ్యాపారాత్మక చిత్రాల్లో బాల నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. అప్పట్లో శశికపూర్ పేరుతో పౌరాణిక చిత్రాల్లో నటించే మరో బాలనటుడు ఉండటంతో శశిరాజ్ అనే పేరుతో చిత్రరంగానికి పరిచయం అయ్యాడు. 1948లో వచ్చిన ఆగ్, 1951లో వచ్చిన ఆవారా సినిమాల్లో తన అన్న రాజ్ కపూర్ చిన్నప్పటి పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. 1950లో వచ్చిన సంగ్రామ్ చిత్రంలో అశోక్ కుమార్ చిన్నప్పటి పాత్ర పోషించాడు. 1948-54 మధ్యలో నాలుగు హిందీ చిత్రాలలో నటించాడు.
మరణం
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న శశి కపూర్ ముంబైలోని కోకిలబెన్ హాస్పిటల్లో 2017, డిసెంబర్ 4 (సోమవారం)న మరణించాడు.[2]
మూలాలు
- "Shashi Kapoor Biography – IMDb". Retrieved 29 March 2014.
- నమస్తే తెలంగాణ (4 December 2017). "బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూత". Retrieved 4 December 2017.
