శల్యుడు

మహాభారతంలో శల్యుడు మాద్ర రాజ్యానికి రాజు. ఇతను మాద్రికి సోదరుడు. మాద్రి నకులుడు మరియు సహదేవులకు తల్లి. ఆలా అతను నకులుడు మరియు సహదేవులకు మేనమామ. పాండవులు ఇతనియందు ప్రేమ కలిగి ఉండేవారు. శల్యుడు యుక్త వయసులో ఉన్నప్పుడు కుంతిని పెళ్ళి చేసుకొనుటకు రాజులతో పోటీపడి విఫలుడయ్యాడు. మాద్రి కూడా పాండురాజునే పెళ్ళి చేసుకున్నది. శల్యుడు మంచి విలుకాడు మరియు యుద్ధ వీరుడు.

జావా జానపద ప్రదర్శనలో శల్యుడు

శల్యుని మీద అతని పెద్ద సైన్యం మీద పాండవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శల్యుడు తన సైన్యంతో పాండవులకు యుద్ధమున సాయం చేయుటకు వచ్చుచుండగా దుర్యోధనుడు యధిష్టురుని వలే నటించి శల్యునికి మరియు అతని సైన్యానికి గొప్ప విందు ఏర్పాటు చేసెను. శల్యుడు ఆ విందుకు సంతసించి యధిష్టురుడు అనుకుని యుద్ధమున సాయం చేతునని దుర్యోధనునికి మాట ఇచ్చెను. ఇచ్చిన మాట తప్పలేక దుర్యోధనుని తరపున కౌరవులతో కలసి యుద్ధం చేయుటకు సమ్మతించెను. తరువాత శల్యుడు యధిష్టురుని కలిసి తన పొరబాటుకి క్షమించని అడిగెను. శల్యుడు గొప్ప రథసారథి అని తెలిసిన యధిష్టురుడు దుర్యోధనుడు అతనిని కర్ణునికి రథసారథిగా నియమించునని ఊహించెను. అలా అయినచో కర్ణుని యుద్ధమున తన ఎత్తిపొడుపు మాటలతో కర్ణునికి ఆత్మస్తైర్యాన్ని దెబ్బ తీయవలసినదని మాట తీసికొనెను.

శల్యుడు ఇష్టం లేకున్నను కౌరవుల తరపున యుద్ధము చేసెను. శల్యుడు కర్ణునికి అర్జునునితో యుద్ధము చేయునపుడు రథసారథిగా పనిచేసెను. ఆ సమయమున శల్యుడు అర్జునుని అదేపనిగా పొగడుతూ కర్ణుని విమర్శిస్తూ ఉండెను. శల్యుడు కర్ణుని మరణం తరువాత యుద్ధమున చివరి రోజున (పదునెనిమిదవ రోజు) కౌరవ సైన్యాన్ని అధిపతియై నడిపించెను. యుద్ధమున యధిష్టురుడు శల్యుని చంపెను.

మహాభారతం - ఆంధ్ర మహాభారతం - వ్యాసుడు - కవిత్రయం

పర్వాలు

ఆది పర్వము  సభా పర్వము  వన పర్వము లేక అరణ్య పర్వము  విరాట పర్వము  ఉద్యోగ పర్వము  భీష్మ పర్వము  ద్రోణ పర్వము  కర్ణ పర్వము  శల్య పర్వము  సౌప్తిక పర్వము  స్త్రీ పర్వము  శాంతి పర్వము  అనుశాసనిక పర్వము  అశ్వమేధ పర్వము  ఆశ్రమవాస పర్వము  మౌసల పర్వము  మహాప్రస్ధానిక పర్వము  స్వర్గారోహణ పర్వము  హరివంశ పర్వము

పాత్రలు
శంతనుడు | గంగ | భీష్ముడు | సత్యవతి | చిత్రాంగదుడు | విచిత్రవీర్యుడు | అంబ | అంబాలిక | విదురుడు | ధృతరాష్ట్రుడు | గాంధారి | శకుని | సుభద్ర | పాండు రాజు | కుంతి | మాద్రి | యుధిష్ఠిరుడు | భీముడు | అర్జునుడు | నకులుడు | సహదేవుడు | దుర్యోధనుడు | దుశ్శాసనుడు | యుయుత్సుడు | దుస్సల | ద్రౌపది | హిడింబి | ఘటోత్కచుడు | ఉత్తర | ఉలూపి | బభృవాహనుడు |అభిమన్యుడు | పరీక్షిత్తు | విరాటుడు | కీచకుడు | ద్రోణుడు | అశ్వత్థామ | ఏకలవ్యుడు | కృతవర్మ | జరాసంధుడు | సాత్యకి | దుర్వాసుడు | సంజయుడు | జనమేజయుడు | వేదవ్యాసుడు | కర్ణుడు | జయద్రధుడు | శ్రీకృష్ణుడు | బలరాముడు | ద్రుపదుడు | | దృష్టద్యుమ్నుడు | శల్యుడు | శిఖండి
ఇతర విషయాలు
పాండవులు | కౌరవులు | హస్తినాపురం | ఇంద్రప్రస్థం | రాజ్యాలు | కురుక్షేత్ర యుద్ధం | భగవద్గీత


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.