శతపది
శతపాదులు (ఆంగ్లం Centipede) (from లాటిన్ prefix centi-, "నూరు", and గ్రీకు ποδός podos, "పాదం") ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జంతువులు. ఇవి మిరియాపోడా ఫైలమ్ లోని కీలోపోడా తరగతికి చెందినవి. వీటిని జెఱ్ఱి అని కూడా పిలుస్తారు.
| శతపాదులు Temporal range: Silurian - Recent | |
|---|---|
![]() | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ఏనిమేలియా |
| విభాగం: | ఆర్థ్రోపోడా |
| ఉప వర్గం: | మిరియాపోడా |
| తరగతి: | కీలోపోడా Latreille, 1817 |
| Orders and Families | |
|
See text | |
ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 జాతుల శతపాదులున్నట్లు అంచనా.[1] వీటిలో సుమారు 3,000 జాతులు మాత్రమే గుర్తించబడ్డాయి. ఇవి విస్తృతంగా ఆర్కిటిక్ ప్రాంతం నుండి ఉష్ణమండలం మరియు ఎడారి వాతావరణంలోనూ నివసిస్తాయి.[2] వీటికి తేమ చాలా అవసరం. అందువలన ఇవి ఎక్కువగా భూమిలోపల, రాళ్ళక్రింద నివసిస్తాయి.
కొన్ని శతపాదులు మానవులకు హాని కలిగిస్తాయి. అయితే వీటికాటు వలన నొప్పి కలుగుతుంది. కొందరికి ఎలర్జీ వస్తుంది. సామాన్యంగా ప్రాణహాని ఉండదు.
సామాన్య లక్షణాలు
- శతపాదులు పొడవుగా సన్నగా ఉండే జీవులు. ఇవి కొన్ని మిల్లీమీటర్ల నుండి 30 సెంటీమీటర్ల వరకు ఉంటాయి.
- వీటి దేహం తల, మొండెంగా విభజితమై ఉంటుంది.
- తలలో ఒక జత స్పర్శశృంగాలు, రెండు జతల జంభికలు, ఒక జత హనువులు ఉంటాయి. రెండవ జత హనువులు విలీనం చెందడం వలన అధరం ఏర్పడుతుంది.
- ప్రతి ఖండితానికి ఒక జత కాళ్ళుంటాయి. (సహస్రపాదులకు రెండు జతలుంటాయి)
- శతపాదులన్నింటికీ మొదటి ఖండితంలో ఒక జత విషపు నఖాలు (venom claws) ఉంటాయి.
- విసర్జకాంగాలు - మాల్పీజియన్ నాళికలు.
మూలాలు
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో శతపదిచూడండి. |
- Adis, J. and M.J. Harvey. 2000. How many Arachnida and Myriapoda are there worldwide and in Amazonia? Studies on Neotropical Fauna and Environment, 35: 139-141.
- Lewis, J.G.E. 1981. The biology of centipedes. Cambridge University Press, Cambridge.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
