వైరా

వైరా, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన పట్టణం.

వైరా రోడ్డు దృశ్యం

ఇది ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, జగ్గయ్యపేట పట్టణాల రహదారులకు కూడలిగా ఉంది. కనుక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉంది.

గణాంకాలు

2001 జనగణన ప్రకారం వైరా జనాభా సుమారు 51,205. ఇందులో మగవారు 25,984 ఆడువారు 25,221. అక్షరాస్యత 60.59%; మగవారిలో అక్షరాస్యత 70.20% మరియు ఆడువారిలో అక్షరాస్యత 50.73%.

ఆలయాలు

వైరాలో అయ్యప్ప మందిరం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఖమ్మం నుండి వైరా వచ్చు దారిలో ఉంది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాలమధ్య నెలకొని, భక్తులకు మానసికానందాన్నిస్తోంది. వివిధ దేవతల ఆలయాలతో నెలకొని ఉన్న ఈ ఆలయ దర్శనం సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. ఇంకా, పాత బస్ స్టాండు వద్ద రామాలయం ఉంది. మధు విద్యాలయం వద్ద సాయిబాబా గుడి ఉంది. శివాలయం ఉంది.

వైరా జలాశయం

వైరా చెరువు అనునది వైరా నది నుండి వచ్చింది. ఈ చెరువులో 19 బావులువున్నవి. దీనిని నిజాం నవాబు 1929లో తవ్వించాడు. దీని ద్వారా చుట్టుప్రక్కల 8 మండలాలకు త్రాగు నీరు, సుమారు ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి ఛెందుతోంది. ఇక్కడ బోటు షికారు, గెస్ట్ హౌస్, పిల్లలు ఆడుకునే స్థలం మొదలగునవి ఉన్నాయి. చేపల పెంపకం కూడా జరుగుతున్నది.

విద్యా సంస్థలు

  • కె.వి.సి.ఎమ్. డిగ్రీ కాలేజి
  • మధు విద్యాలయం, జూనియర్ కాలేజి,డిగ్రీ కాలేజీ
  • టాగోర్ విద్యాలయం
  • ప్రభుత్వ ఉన్నత పాఠశాల
  • క్రాంతి జూనియర్ కాలేజి

బ్యాంకులు

  1. నాగార్జున గ్రామీణ బ్యాంక్.
  2. ఆంధ్రా బ్యాంక్.
  3. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ( పెట్రోల్ బంక్ సమీపంలో ).

వ్యవసాయం

వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి, వైరా చెరువు వల్ల ఇక్కడ జాలర్లు కూడా ఉన్నారు. జాలర్ల నివసించే వీధిని ఫిషరీష్ కాలని అని అంటారు. ఇది చెరువు పక్కనే ఉంది.

రవాణా సౌకర్యాలు

ఇక్కడ నుంచి జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలకు, హైదరాబాదుకూ రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రం అయిన ఖమ్మంకు సర్వీసు ఆటోలు ఉంటాయి, మధిర నుంఛి ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి.హైదరాబాద్కు మధిర నుంచి బస్సులు ఉన్నాయి.

శాసనసభ నియోజకవర్గం

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు

    బయటి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.